S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/04/2017 - 03:23

విశాఖపట్నం, డిసెంబర్ 3: తమిళనాడు, కేరళ రాష్ట్రాలను వణికిస్తున్న ఓకీ తుపాను ఈ నెల అయిదోతేదీన గుజరాత్ రాష్ట్రం సూరత్ వద్ద తీరాన్ని దాటనుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు. ప్రస్తుతం లక్షద్వీప్‌లోని అమినీ దీవికి 480 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓకీ తుపాను పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోందన్నారు. ఇది క్రమంగా బలహీన పడి తీరాన్ని దాటే సమయంలో వాయుగుండంగా మారుతుందన్నారు.

12/04/2017 - 02:56

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి యువనేత రాహుల్ గాంధీ సోమవారం నామినేషన్‌లు దాఖలు చేయబోతున్నారు. పార్టీ అధినేత్రి సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా సీనియర్ నేతల సమక్షంలో ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. ఆదివారం పొద్దుపోయే వరకూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇతరులెవరూ నామినేషన్‌లు దాఖలు చేయక పోవడంతో రాహుల్ ఎన్నిక లాంఛనంగానే మారింది.

12/04/2017 - 02:55

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వచ్చే ఏడాది జనవరి 30 నుంచి ప్రారంభంకానున్నాయి. జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత మొదటి వార్షిక బడ్జెట్ కాగా, ఎన్డీయే ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కానుంది. ఈ మేరకు సాధరణ బడ్జెట్ వివరాలను అధికార వర్గాలు వెల్లడించాయి.

12/04/2017 - 02:37

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ప్రధాని నరేంద్ర మోదీ కేవలం వాగ్దానాలతోనే కాలక్షేపం చేస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్వరంతో ధ్వజమెత్తారు. గుజరాత్‌లో మహిళలకు భద్రత లేదని పేర్కొన్న ఆయన రోజుకో ప్రశ్న కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఐదో ప్రశ్నను మోదీని లక్ష్యించి సంధించారు.

12/04/2017 - 02:36

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సన్నద్ధం అవుతోంది. విశ్వసౌధంలో సంపన్న దేశాలకు చెందిన పరిశోధనా సంస్థలతో పోటాపోటీగా దూసుకుపోతున్న ఇస్రో చంద్రయాన్-2లో భాగంగా చంద్రుడిపైకి వెళ్లేందుకు సన్నద్ధమవుతోంది. అనతికాలంలోనే అంతరిక్ష పరిశోధనల్లో నిరుపమాన స్థాయికి చేరుకున్న ఇస్రో ఉపగ్రహ ప్రయోగాల్లోనూ, అలాగే మార్స్ మిషన్ ద్వారానూ తన సత్తాను చాటుకుంది.

12/04/2017 - 02:34

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: దేశంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని అవిశ్రాంతంగా వీటిని వినియోగించడంవల్ల తీవ్రస్థాయిలోనే నీటి ఎద్దడి పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని తాజాగావెలుగుచూసిన వాస్తవాలు స్పష్టం చేస్తున్నాయి.

12/04/2017 - 02:32

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో దివ్యాంగులకు సేవలు అందించిన పలుపురు వ్యక్తులు, సంస్థలకు జాతీయ దివ్యాంగ పురస్కారాలు అందజేశారు. జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డులను అందజేశారు.

12/04/2017 - 02:31

జమ్ము, డిసెంబర్ 3: పాకిస్తాన్‌తో చర్చలు జరపాలంటూ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా చేస్తున్న వాదనను బీజేపీ తిరస్కరించింది. భారత్‌లోనూ, సరిహద్దుల్లోనూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న పాక్‌తో శాంతి చర్చల ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ‘ఒకపక్క ఉగ్రవాదానికి పాల్పడుతున్న దేశంతో శాంతి చర్చలు ఏవిధంగానూ పొసగవు’ అని కాశ్మీర్ బీజేపీ ప్రతినిధి అనిల్ గుప్తా స్పష్టం చేశారు.

12/04/2017 - 02:43

సురేంద్రనగర్ (గుజరాత్), డిసెంబర్ 3: కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికకు ముహూర్తం సమీపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. సంస్థాగత ఎన్నికల్లో కూడా రిగ్గింగ్‌కు పాల్పడిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనంటూ ఎద్దేవా చేశారు.

12/03/2017 - 04:57

జమ్మూ, డిసెంబర్ 2: పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలిగా మెహబూబా ముఫ్తీ తిరిగి ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఆమె మరో మూడేళ్లపాటు కొనసాగుతారు. పీడీపీ అధ్యక్షురాలిగా మెహబూబా 6వసారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తనపై నమ్మకముంచి మళ్లీ అధ్యక్షురాలిగా గెలిపించినందుకు పార్టీ కార్యకర్తలకు మెహబూబా కృతజ్ఞతలు తెలిపారు.

Pages