S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/11/2017 - 02:15

ప్రపంచ యువతను ఉర్రూతలూగిస్తున్న కెనడా పాప్ సింగర్ జస్టిన్ బీబర్ బుధవారం రాత్రి ముంబయని ఉరకలెత్తించారు. భారత్‌లో తొలిసారి కచేరీ ఇచ్చిన ఈ పాప్ సింగర్ షోకు వేలల్లో అభిమానులు తరలివచ్చి సంగీతాన్ని ఆస్వాదించారు.

05/11/2017 - 02:14

ముంబయి, మే 10: ఆయన గళంతో జనం స్వరం కలిపారు. పాప్ మాధుర్యంలో మునిగితేలారు. ఇదీ కెనడా పాప్ సెనే్సషన్ జస్టిన్ బీబర్ తొలిసారిగా భారత్‌లో ఇచ్చిన కచేరీ.. తన పాప్ సంగీతంతో అంతర్జాతీయ ప్రేక్షకులను ఉర్రూత లూగిస్తున్న జస్టిన్ బుధవారం ముంబయిలోని డివై పాటిల్ స్టేడియంలో తన గాత్రామృతాన్ని కురిపించారు. ‘వేర్ యు ఆర్’తో మొదలైన ఆయన కచేరీలో ఇతర డాన్సర్లూ వరుస కలిపారు.

05/11/2017 - 01:56

శ్రీనగర్, మే 10: జమ్మూ, కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు యువ ఆర్మీ అధికారిని అపహరించి దారుణంగా హత్య చేశారు. కుల్గాం జిల్లా సుర్‌సోనా గ్రామానికి చెందిన లెఫ్టెనెంట్ ఉమర్ ఫయాజ్ (22) మంగళవారం విధులనుంచి సెలవు తీసుకుని షోపియాన్ జిల్లాలోని బాటపురాలో మేనమామ ఇంట్లో జరుగుతున్న వివాహ వేడుకలకు వెళ్లారు. రాత్రి పది గంటల సమయంలో కొంతమంది మిలిటెంట్లు అతడిని కిడ్నాప్ చేశారని అధికారులు చెప్పారు.

05/11/2017 - 01:52

న్యూఢిల్లీ, మే 10: రాష్టప్రతి పదవికి బిజెపి ప్రతిపాదించే అభ్యర్థికే తమ పూర్తి మద్దతు ఉంటుందని వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు, ఏపీ శాసనసభలో ప్రతిపక్షం నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. జగన్‌మోహన్ రెడ్డి బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిసి చర్చలు జరిపిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈవిషయాన్ని ప్రకటించారు.

05/11/2017 - 00:50

న్యూఢిల్లీ, మే 10: రాజ్యాంగాన్ని కాపాడేందుకు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సమర్థంగా అమలు జరిగేలా చూడాలని, లక్షలాది మంది డిపాజిటర్లను మోసం చేసిన ఆగ్రిగోల్డ్ వ్యవహారంపై న్యాయస్థానం పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు.

05/11/2017 - 00:47

పాట్నా, మే 10: పశుదాణా కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై వ్యాఖ్యానించడానికి ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నిరాకరించారు. దాణా కేసులో విచారణ ఎదుర్కోవల్సిందేనని కోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు సిబిఐని ధర్మాసనం ఆదేశించిన సంగతి తెలిసిందే. రెండు రోజులుగా లాలూ ప్రసాద్ యాదవ్ సర్క్యులర్ రోడ్ నెంబర్ 10లోని రబ్రీదేవీ అధికార నివాసంలోనే ఉంటున్నారు. దాదాపు అప్పటినుంచీ మీడియాకు దూరంగానే ఉంటున్నారు.

05/11/2017 - 00:47

న్యూఢిల్లీ, మే 10: కోర్టు ధిక్కార నేరానికి పాల్పడిన, ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్న ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను జూలై 10న జరిగే విచారణకు తన ముందు హాజరయ్యేలా చూడాలని సుప్రీంకోర్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖను ఆదేశించింది.

05/11/2017 - 00:46

న్యూఢిల్లీ, మే 10: ముస్లింలలో ఉన్న ట్రిపుల్ తలాఖ్, నిఖా హలాల, బహుభార్యత్వం లాంటి సంప్రదాయాల రాజ్యాంగపరమైన చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం నుంచి విచారణ ప్రారంభిస్తుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెఎస్ ఖేహర్ నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం మొత్తం ఏడు పిటిషన్లపై విచారణను ప్రారంభిస్తుంది.

05/11/2017 - 00:45

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్, మే 10: పాకిస్తాన్‌లో భారత పౌరుడు కులభూషణ్ జాదవ్ ప్రాణాలకు ముప్పు ఉండడం, అలాగే దాదాపు 16 సార్లు కోరినప్పటికీ తమ కాన్సులేట్ అధికారులు అతడ్ని కలుసుకోవడానికి నిరాకరించిన కారణంగానే ఈ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

05/10/2017 - 08:15

న్యూఢిల్లీ, మే 9:కలుషిత ఆహారం తినడం వల్ల అస్వస్తతకు గురైన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇక్కడి శ్రీగంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ఆదివారం నాడే సోనియా తమ ఆసుపత్రిలో చేరినట్టు మేనేజ్‌మెంట్ బోర్డు చైర్మన్ డిఎస్ రాణా వెల్లడించారు. సోనియా ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని, ఆమె బాగానే ఉన్నారని త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు.

Pages