S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/10/2017 - 07:56

న్యూఢిల్లీ, మే 9: మూడు రోజుల క్రితం దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షల్లో విద్యార్థులకు చుక్కలు చూపించారు. డ్రెస్‌కోడ్ పేరుతో విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. కేరళలో అయితే ఏకంగా లోదుస్తులు తొలగిస్తేగానీ విద్యార్థినిని పరీక్షకు అనుమతించలేదు. ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో ప్రవేశం నిమిత్తం దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షను ఆదివారం నిర్వహించింది.

05/10/2017 - 07:55

న్యూఢిల్లీ, మే 9: కాంగ్రెస్ అధినాయకత్వం పార్టీని కింది స్థాయి నుండి పై స్థాయి వరకు పునర్ వ్యవస్థీకరించేందుకు రంగం సిద్ధం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం మేరకు డిసెంబర్ 31లోగా పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయవలసి ఉన్నది. అందుకే కాంగ్రెస్ అధినాయకత్వం పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తోంది.

05/10/2017 - 07:53

ముంబయి, మే 9: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై వచ్చిన అవినీతి కథనాలపై సామాజిక కార్యకర్త అన్నాహజారే తీవ్రంగానే స్పందించారు. కేజ్రీవాల్ అవినీతికి పాల్పడినట్టు రుజువైతే సిఎం పదవికి రాజీనామా చేయాల్సిందిగా తాను స్వయంగా జంతర్‌మంతర్ వద్ద దీక్షకు దిగుతానని మంగళవారం ప్రకటించారు. ‘కేజ్రీవాల్ అవినీతికి పాల్పడినట్టు రుజువైతే ముఖ్యమంత్రి పదవినుంచి తప్పుకోవడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.

05/10/2017 - 07:37

న్యూఢిల్లీ, మే 9: కోర్టు ధిక్కార కేసులో వ్యాపారవేత్త విజయ్ మాల్యాను సుప్రీం కోర్టు మంగళవారం దోషిగా ఖరారు చేసింది. కోర్టు ఆర్డర్‌కు వ్యతిరేకంగా 40మిలియన్ డాలర్లను తన పిల్లల ఖాతాల్లోకి బదిలీ చేసినట్లు బ్యాంకుల కన్సార్టియం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది.

05/10/2017 - 06:35

న్యూఢిల్లీ, మే 9: భారత పౌరుడు కుల్‌భూషణ్ జాదవ్ మరణ శిక్ష కేసులో పాకిస్తాన్‌కు చుక్కెదురైం ది. తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డారంటూ జాదవ్‌కు పాకిస్తాన్ సైనిక కోర్టు విధించిన మరణ శిక్షపై అంతర్జాతీయ కోర్టు స్టే విధించింది. జాదవ్‌కు దౌత్యపరమైన సహాయాన్ని అందించాలని, అతడి వాదన వినాలంటూ భారత్ అనేక దఫాలుగా స్పష్టం చేసినప్పటికీ పాకిస్తాన్ పెడచెవిన పెట్టింది.

05/10/2017 - 06:30

పూణె, మే 9: ఎనిమిదేళ్ల క్రితం జరిగిన నయన పూజారి అనే 28ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కిడ్నాప్, గ్యాంగ్ రేప్, హత్య కేసులో నిందితులైన ముగ్గురికి ఇక్కడి ప్రత్యేక కోర్టు మరణ శిక్ష విధించింది.అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ హత్య, మానభంగం కేసులో యోగేష్ రౌత్, మహేష్ ఠాకూర్, విశ్వాస్ కదం అనే ముగ్గుర్ని సోమవారం నేరస్తులుగా నిర్థారించిన ప్రత్యేక న్యాయమూర్తి ఎల్‌ఎల్ యెంకర్ వారికి మంగళవారం శిక్షలు ఖరారు చేశారు.

05/10/2017 - 06:26

న్యూఢిల్లీ, మే 9: దేశ రాజధాని ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం భారతీయ జనతా పార్టీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ట్యాంపరింగ్ చేసిందని ఆరోపిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇవిఎంను రిగ్ చేయడం ఎంత సులభమో మంగళవారం ఢిల్లీ అసెంబ్లీలో ప్రదర్శించి చూపించింది. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం డూప్లికేట్ ఇవిఎంను హ్యాక్ చేశారని పేర్కొంది.

05/10/2017 - 06:23

న్యూఢిల్లీ, మే 9: కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్‌పై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రధాన న్యాయమూర్తితో సహా పలువురు న్యాయమూర్తులకు జైలు శిక్ష విధిస్తూ సోమవారం కర్ణన్ ఇచ్చిన తీర్పుపై సుప్రీం ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. కోర్టు ధిక్కార కేసు కింద జస్టిస్ కర్ణన్‌కు ఆరు నెలల పాటు జైలు శిక్ష విధించింది.

05/10/2017 - 05:57

న్యూఢిల్లీ, మే 9: ఏపీ విభజన చట్టం బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే సందర్భంలో పెప్పర్ స్ప్రే సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది.

05/10/2017 - 05:15

జైపూర్, మే 9: ఉగ్రవాదులపై సర్జికల్ దాడులు జరపడం ద్వారా తమ సామర్థ్యాన్ని చాటిన సాయుధ దళాలపై ఈ దేశ ప్రజలు విశ్వాసం ఉంచాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇటీవల అధీన రేఖ వద్ద ఇద్దరు భారత జవాన్లను దారుణంగా నరికి చంపిన నేపథ్యంలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ, ఎట్టి పరిస్థితుల్లోను ఈ దేశ గౌరవప్రతిష్టలకు భంగం రానివ్వమని అన్నారు. ‘సైన్యంపై ఈ దేశ ప్రజలు విశ్వాసం ఉంచాలి.

Pages