S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/04/2017 - 09:05

డెహ్రాడూన్, మే 3: శీతాకాలం విరామం తరువాత బుధవారం ఉదయం తిరిగి తెరుచుకున్న ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. శీతాకాలంలో మంచు కారణంగా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వీలుకాదు. అందువల్ల ఏటా చలికాలంలో దీన్ని మూసివేస్తారు. తిరిగి ఎండాకాలంలో ఆలయ ద్వారాలు తెరచి భక్తుల ప్రవేశానికి వీలు కల్పిస్తారు.

05/04/2017 - 08:19

న్యూఢిల్లీ, మే 3: భారత సైనికులపై పాక్ జరిపిన పైశాచిక దాడిని మరోసారి తీవ్ర పదజాలంతో ఖండించిన భారత్, ఆ దేశ హైకమిషనర్ బాసిత్‌కు సమన్లు పంపింది. ఇద్దరు భారత సైనికులపై దాడి జరిపింది పాకిస్తానీయులేనని రుజువు చేసే సాక్ష్యాధారాలను అందించింది. వీటి ఆధారంగా దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని బుధవారం డిమాండ్ చేసింది.

05/04/2017 - 08:16

న్యూఢిల్లీ, మే 3: ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక బాబా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. విజ్ఞాన్ భవన్‌లో బుధవారం సాయంత్రం జరిగిన 64వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో విశ్వనాథ్‌కు ఫాల్కేతోపాటు ఉత్తమ అవార్డులను పలువురు సినీ ప్రముఖులకు రాష్టప్రతి అందించారు.

05/04/2017 - 08:36

న్యూఢిల్లీ,మే 3: ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీని అమలు చేసేందుకు ఒక ప్రత్యేక కార్యచరణ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తోందని, దీనిని త్వరలోనే అమలు చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు.

05/04/2017 - 08:37

న్యూఢిల్లీ, మే 3: కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలలోని మిర్చి రైతులను ఆదుకునేందుకు మార్కెట్ ఇంటర్‌వెన్షన్ పథకాన్ని ప్రకటించింది. ఎర్రమిర్చిని క్వింటాలుకు ఐదు వేల రూపాయల మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తారని కేంద్ర సమాచారశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ బుధవారం విలేకరుల సమావేశంలో ఈ విషయం ప్రకటించారు.

05/04/2017 - 08:11

న్యూఢిల్లీ, మే 3: విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాశ్రయా హోదా కల్పిస్తూ కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది.బుధవారం నాడు ప్రథాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్రమంత్రి వర్గం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. గన్నవరానికి అంతర్జాతీయ విమానాశ్రయ హోదా లభించటంతో ఈ విమానాశ్రయంలో మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

05/03/2017 - 04:04

సూళ్లూరుపేట, మే 2: భారత అంతరిక్ష పరిశోదన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సమాచార ఉపగ్రహ ప్రయోగానికి శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఈ ప్రయోగానికి సంబంధించిన ప్రయోగాత్మక ప్రయోగం (రిహార్సల్)ను మంగళవారం షార్‌లో విజయవంతంగా నిర్వహించారు.

05/03/2017 - 03:27

తరన్‌తరన్ (పంజాబ్), మే 2: జమ్మూ, కాశ్మీర్‌లోని పూంఛ్ సెక్టార్‌లో సోమవారం పాక్ సైనికుల చేతిలో దారుణంగా హత్యకు గురయిన జవాను నరుూబ్ సుబేదార్ పరమ్‌జీత్ సింగ్‌కు మంగళవారం తరన్‌తరన్ జిల్లాలోని ఆయన స్వస్థలమైన వైన్‌పోయిన్ గ్రామంలో పూర్తిస్థాయి సైనిక మర్యాదలతో అంత్యక్రియలు నిర్వహించారు.

05/03/2017 - 03:25

చిత్రం.. సైనికుల చేతిలో హత్యకు గురయిన నరుూబ్ సుబేదార్ పరమ్‌జీత్ సింగ్,
హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్‌సాగర్ భౌతిక కాయాలకు నివాళులర్పిస్తున్న ఆర్మీ అధికారులు, జవాన్లు

05/03/2017 - 03:23

తరన్‌తరన్ (పంజాబ్) / దేవరియా (యూపి), మే 2: ‘నా తండ్రి అమరుడయ్యాడు. ఆయన తలను శత్రువులు నరికారు. వారిపై ప్రతీకారం తీర్చుకోవలసిందే. ఒక్కో తలకు 50 తలలు తీసుకురావాలి. ఏ ఒక్కరినీ వదలవద్దు. ఊహించని రీతిలో గుణపాఠం చెప్పాలి’ పాకిస్తాన్ సైన్యం అత్యంత కిరాతకంగా హతమార్చిన అమర జవాను కూతురు వ్యక్త చేసిన ఆగ్రహమిది.

Pages