S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/12/2017 - 00:18

న్యూఢిల్లీ, మే 11: ఫుడ్ పాయిజనింగ్‌తో అస్వస్థతకు గురై ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉంది. ఆమెను త్వరలోనే డిశ్చార్జి చేయనున్నట్టు ఆసుపత్రి బోర్డు చైర్మన్ డాక్టర్ డిఎస్ రానా వెల్లడించారు. 69 ఏళ్ల సోనియా ఈ నెల 7న ఆసుపత్రిలో చేరారని ఆయన అన్నారు. ‘సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.

05/12/2017 - 00:18

న్యూఢిల్లీ, మే 11: ప్రజలు తమ పర్మనెంట్ అకౌంట్ నంబర్ (పాన్)కు ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేసుకోవడానికి ఆదాయపు పన్ను శాఖ ఒక కొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది. దీని ప్రకారం, ఎవరయినా ఆన్‌లైన్‌లో (ఇ-ఫెసిలిటి) తమ ఆధార్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. ఇకనుంచి ఐటి రిటర్న్స్ దాఖలు చేయడానికి ఎవరయినా తమ పాన్‌కు ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయడం తప్పనిసరి.

05/11/2017 - 23:37

న్యూఢిల్లీ, మే 11: ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంటు ఆవరణలో స్థాపించే అంశం విగ్రహాలు, చిత్రపటాల ఏర్పాటుకు సంబంధించిన పార్లమెంటు సంయుక్త కమిటీ పరిశీలనకు వచ్చిందని వైఎస్‌ఆర్‌సిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి తెలిపారు.

05/11/2017 - 23:36

న్యూఢిల్లీ, మే 11: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ నియమ, నిబంధనలు తయారు చేసేందుకు కేంద్ర న్యాయ శాఖ ఆమోదం తెలిపిందని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ వేణుగోపాలచారి, టిఆర్‌ఎస్ ఉపాధ్యాయ సంఘం నాయకులు, విధాన మండలి సభ్యులు కె.జనార్దన్ రెడ్డి, పి.రవీందర్, సరోత్తం రెడ్డి, మోహన్ రెడ్డి తెలిపారు.

05/11/2017 - 03:02

న్యూఢిల్లీ, మే 10: వేసవి సెలవుల్లోనూ కేసులను విచారించాలని నిర్ణయం తీసుకున్న న్యాయ వ్యవస్థను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. న్యాయ వ్యవస్థ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలలో వారి విధులపట్ల బాధ్యతా భావనను బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కేసుల డిజిటల్ ఫైలింగ్‌కు వీలు కల్పించే ‘కేసుల సమీకృత నిర్వహణ వ్యవస్థ’ను సుప్రీంకోర్టులో బుధవారం ప్రధాని ప్రారంభించారు.

05/11/2017 - 03:00

న్యూఢిల్లీ, మే 10: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శ్రీలంక వెళ్లనున్నారు. అక్కడ జరిగే అంతర్జాతీయ బుద్ధిస్ట్ ఫెస్టివల్‌లో మోదీ పాల్గొంటారు. రాజధాని కొలంబోలో ఈ నెల 12 నుంచి 14 వరకూ అంతర్జాతీయ వేసక్ దినోత్సవ వేడుకలు జరుగుతాయి. వంద దేశాల నుంచి 4వేల మందికి పైగా ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరవుతున్నారు. బౌద్ధులకు వేసక్ ఓ పవిత్ర దినం.

05/11/2017 - 02:57

చిత్రం..భారత పర్యటనకు వచ్చిన రష్యా ఉప ప్రధాని డిమిత్రీ రొగొజిన్
బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన దృశ్యం

05/11/2017 - 02:54

లక్నో, మే 10: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో ముస్లిం నేత నసీరుద్దీన్ సిద్దిఖీ, ఆయన కుమారుడిపై బిఎస్పీ అధినేత్రి మాయావతి వేటు వేశారు. ఇద్దర్నీ పార్టీనుంచి బహిష్కరించారు.

05/11/2017 - 02:53

లక్నో, మే 10: భారత్‌ను పాలించిన మొఘల్ పాలకులను ఈ దేశంపైకి ‘దండెత్తివచ్చిన వారు’గా ప్రజలు అంగీకరిస్తే దేశంలో ఉన్న సమస్యలన్నీ సమసిపోతాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విశ్వసిస్తున్నారు. ఆదిత్యనాథ్ మంగళవారం ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఒక ఆంగ్ల దినపత్రిక బుధవారం సంచికలో ఈ విషయం వెల్లడించింది.

05/11/2017 - 02:16

చెన్నై, మే 10: కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు సుఅపీంకోర్టు ఆరు నెలల జైలుశిక్ష విధించిన కలకత్తా హైకోర్టు జడ్జి సిఎస్ కర్ణన్‌ను అరెస్టు చేయడానికి పోలీసులు బుధవారం తమిళనాడులోని వివిధ నగరాలను జల్లెడ బట్టారు కానీ ఆయన మాత్రం వారికి చిక్కలేదు.

Pages