S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/24/2017 - 05:53

న్యూఢిల్లీ, జనవరి 23: జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు వారం రోజుల్లోగా డైరెక్టర్ జనరల్‌ను నియమించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె ఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం స్పందిస్తూ డిజిని వారం రోజుల్లో నియమించాలని, కమిషన్ సభ్యులను నాలుగు వారాల్లోగా నియమించాలని స్పష్టం చేసింది.

01/24/2017 - 05:53

బెంగళూరు, జనవరి 23: తమిళనాడును కుదిపేస్తున్న జల్లికట్టు తరహా క్రీడ కర్నాటకలో తెరమీదకొచ్చింది. కర్నాటకలో ‘కంబాలా’ పేరుతో దున్నల పోటీలను ప్రతిఏటా నిర్వహిస్తుంటారు. కంబాలా క్రీడ కోర్టు వివాదంలో ఉంది. సుప్రీం కోర్టు జల్లికట్టును నిషేధించిన నేపథ్యంలో 2016 నవంబర్‌లో పెటా కార్యకర్తలు కర్నాటక కోర్టును ఆశ్రయించి తాత్కాలిక స్టేను తీసుకొచ్చారు.

01/24/2017 - 05:51

న్యూఢిల్లీ, జనవరి 23: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అధినాయకత్వం తమ పార్టీ నాయకులతోపాటు కాంగ్రెస్, బిఎస్‌పి నుంచి వచ్చి చేరిన వారికి, వారి పిల్లలకు టికెట్లు కేటాయించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మంత్రులు, పార్టీ ఎంపీల పిల్లలకు టికెట్లు కేటాయించకూడదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచన ప్రాయంగా చేసిన హితవును బిజెపి అధినాయకత్వం పట్టించుకున్న సూచనలు కనిపించటం లేదు.

01/24/2017 - 06:02

న్యూఢిల్లీ, జనవరి 23: సాహసమనేది మానసిక స్థితేనని, ఆరోగ్యవంతమైన శరీరం ఇందుకు దోహదం చేసినప్పటికీ మనిషిని ప్రధానంగా ముందుకు నడిపే శక్తి మనసేనని, కనుక ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.

01/24/2017 - 05:48

పనాజీ, జనవరి 23: ఎన్నికల సంఘానికి దాఖలు చేసిన అఫిడవిట్‌లో గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ గత ఐదేళ్లలో తన సంపద తరిగిపోయినట్టు చూపించారు. ఆయనతోపాటు మరో నలుగురు ఎమ్మెల్యేలూ ఆస్తులు తరిగిపోయాయని పేర్కొన్నారు. మాండ్రెమ్ నియోజకవర్గం నుంచి బిజెపి టికెట్‌పై పోటీ చేస్తున్న పర్సేకర్ 2012తో పోల్చుకుంటే 1.76 కోట్ల రూపాయలు సంపాదన క్షీణించిందని అన్నారు.

01/24/2017 - 01:14

న్యూఢిల్లీ, జనవరి 23: కేంద్రం నిర్ణయించినట్టుగా ఫిబ్రవరి ఒకటో తేదీనే కేంద్ర బడ్జెట్ ప్రతిపాదన జరుగుతుందని సుప్రీం కోర్టు రూలింగ్ ఇచ్చింది. ఉత్తర ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాతే కేంద్ర బడ్జెట్‌ను ప్రవేవ పెట్టాలన్న వాదనను కొట్టివేసింది.

01/24/2017 - 01:13

న్యూఢిల్లీ, జనవరి 23: బొగ్గు గనుల కుంభకోణానికి సంబంధించిన కేసుల దర్యాప్తును ప్రభావితం చేసేందుకు సిబిఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హా ప్రయత్నిస్తున్నట్లు వచ్చిన ఆరోపణల్లో నిజాన్ని నిగ్గు తేల్చేందుకు సుప్రీం కోర్టు సోమవారం సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.

01/24/2017 - 01:12

చెన్నై, జనవరి 23: రాష్టవ్య్రాప్తంగా నిరాటంకంగా జల్లికట్టు నిర్వహణకు వీలుకల్పిస్తూ తమిళనాడు అసెంబ్లీ సోమవారం సవవరణ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించింది. 1960 నాటి జంతు హింస నిరోధక చట్టాన్ని సవరిస్తూ రెండు రోజుల క్రితం జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానే ఈ బిల్లును ప్రవేశ పెట్టింది. సిఎం పనీర్‌సెల్వం ప్రవేశ పెట్టిన సవరణ బిల్లుకు అన్ని పార్టీల సభ్యులు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించారు.

01/24/2017 - 01:07

న్యూఢిల్లీ, జనవరి 23:కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సాయంత్రం నార్త్‌బ్లాక్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిసి, డిమాండ్ చేశారు. డిజిటల్ చెల్లింపులకు జనామోదం పొందేందుకు అనుసరించవలసిన వ్యూహాన్ని సిద్ధం చేసేందుకు ఏర్పాటైన కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు చంద్రబాబు సోమవారం దేశ రాజధానికి వచ్చారు.

01/24/2017 - 01:04

న్యూఢిల్లీ, జనవరి 23: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర సాధారణ బడ్జెట్‌పై జనంలో ఆశలు మరింతగా పెరిగాయి. అర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఏకరమైన తాయిలాలు అందించనున్నారన్న దానిపై మధ్యతరగతి వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీరితోపాటు ఇతర వర్గాల ఆకాంక్షలనూ ఈడేర్చే విధంగానే కొత్త 2017 బడ్జెట్ రూపుదిద్దుకునే అవకాశం కనిపిస్తోంది.

Pages