S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/21/2017 - 02:52

న్యూఢిల్లీ, జనవరి 20: నేరం చేసిన వాడు కన్న కొడుకైనా సరే శిక్షనుంచి తప్పించుకోకూడదని ఢిల్లీకి చెందిన ఓ పోలీసు అధికారి నిరూపించాడు. తన కొడుకు నేరం చేశాడని తెలియడంతో తానే స్వయంగా అతడ్ని పట్టుకోవడంలో పోలీసులకు సాయపడి విధి నిర్వహణ పట్ల తన నిబద్ధతను చాటుకోవడమే కాక ఎంతో మంది పోలీసులకు ఆదర్శంగా నిలిచాడు ఏఎస్సై రాజ్ సింగ్.్ఢల్లీలో ఇటీవల 23 ఏళ్ల యువతిపై ఇద్దరు యువకులు దాడి చేశారు.

01/21/2017 - 02:48

శ్రీనగర్, జనవరి 20: ప్రజలెవరూ గణతంత్ర వేడుకల్లో పాల్గొనవద్దని హెచ్చరిస్తూ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ ఒక వీడియోను విడుదల చేసింది. అంతేకాదు ధైర్యం ఉంటే 15 నిమిషాల పాటు తన సొంత ఇంట్లో కానీ, సొంత ఊరులో కానీ ఎలాంటి భద్రతా లేకుండా ఉండాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, ఇతర రాజకీయ నాయకులను సవాలు చేసింది.

01/21/2017 - 02:22

న్యూఢిల్లీ, జనవరి 20: తమిళనాడును కుదిపేస్తున్న జల్లికట్టు సమస్య పరిష్కారానికి కేంద్రం చొరవ తీసుకుంది. జల్లికట్టును చట్టబద్ధం చేసేందుకు ప్రభుత్వం జారీ చేసే ఆర్డినెన్స్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన ఆర్డినెన్స్ ముసాయిదా ప్రతిని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి పంపించారు.

01/21/2017 - 02:21

న్యూఢిల్లీ, జనవరి 20:అమెరికా 45వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక పెంపొందించుకోవడంతో పాటు పరస్పర సహకారాన్ని మరింత విస్తృతం చేసుకునేందుకు కలిసి పనిచేయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

01/20/2017 - 05:24

న్యూఢిల్లీ, జనవరి 19: రాజధాని ఢిల్లీలోని టెన్త్ రాజాజీ మార్గ్‌లోని కేంద్ర మంత్రి మహేశ్ శర్మ అధికార నివాసాన్ని జూలైలో రిటైర్‌కానున్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి కేటాయించనున్నారు. టెన్త్ రాజాజీ మార్గ్‌లోని భవనంలో మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలామ్ ఉండేవారు. ఆయన మరణించేవరకూ అందులోనే ఉన్నారు. తరువాత కేంద్ర మంత్రి మహేశ్ శర్మకు దాన్ని కేటాయించారు.

01/20/2017 - 05:21

ఎటా( ఉత్తరప్రదేశ్), జనవరి 19: ఉత్తరప్రదేశ్‌లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదంలో అభం శుభం తెలియని 12మంది చిన్నారులు చనిపోయారు. 35మంది పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. అలియాగంజ్, పలియాలి రోడ్‌లో ఉదయం స్కూలు పిల్లల్ని తీసుకెళ్తున్న బస్సు పొగమంచులో ఎదురుగా ఉన్న ట్రక్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

01/20/2017 - 03:39

లక్నో, జనవరి 19: తమదే అసలైన సమాజ్‌వాది పార్టీ అని ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో పూర్తిస్థాయిలో రంగంలోకి దిగిన యుపి ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఇప్పుడు పార్టీ అధ్యక్షుడి హోదాలో ఇంతకుముందు తన చిన్నాన్న, యుపి పార్టీ అధ్యక్షుడు శివపాల్ యాదవ్ క్రమశిక్షణా చర్య కింద సస్పెండ్ చేసిన 9 మందిపై సస్పెన్షన్ ఎత్తివేశారు.

01/20/2017 - 03:30

న్యూఢిల్లీ, జనవరి 19: తమిళనాడులో అగ్గి రాజేస్తున్న జల్లికట్టు నిషేధంపై కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువస్తే న్యాయపరంగా పోరాడాలని జంతుపరిరక్షణ సంస్థ పెటా నిర్ణయించింది. ‘మా పోరాటం జంతువులను హింసించటంపైనే. ఒకవేళ ఆర్డినెన్స్ కనుక వస్తే మా న్యాయవాదులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటాం’ అని పెటా ప్రతినిధి మనీలాల్ వల్లియత్ తెలిపారు.

01/20/2017 - 03:28

న్యూఢిల్లీ, జనవరి 19: సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్‌ఎస్‌పిఏ) తొలగించాలనే డిమాండ్‌తో దాదాపు పదహారేళ్లపాటు నిరాహారదీక్ష చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఇరోమ్ చాను షర్మిల ఎన్నికల బరిలోకి దిగటంతో మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

01/20/2017 - 03:25

అమృత్‌సర్, జనవరి 19: రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర మంత్రి బిక్రమ్ సింగ్ మఝితియాకు సిట్ క్లీన్‌చిట్ ఇచ్చిన డ్రగ్ రాకెట్ కేసు పునర్విచారణకు ఆదేశిస్తామని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ ప్రకటించారు. సిద్దూ ఎలాంటి షరతులు లేకుండా పార్టీలో చేరారని, పార్టీకోసం ప్రచారం చేస్తారని చెప్పారు.

Pages