S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/29/2016 - 17:05

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రైవేటు మెంబర్ ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ అనంతరం రాజ్యసభ సోమవారానికి వాయిదాపడింది. ఈ బిల్లుపై ఓటింగ్ పెట్టాలంటూ కాంగ్రెస్ ఎంపి కెవిపి రామచంద్రరావు కోరగా, కోరం లేనందున సభను వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు.

04/29/2016 - 17:05

దిల్లీ: రాష్ట్ర విభజన సమయంలో అలనాడు కాంగ్రెస్ నేతలు అనాలోచితంగా వ్యవహరించినందునే నేడు ఎపి ప్రజలు నానాకష్టాలు పడుతున్నారని టిడిపి ఎంపి సిఎం రమేష్ శుక్రవారం రాజ్యసభలో ఆవేదన వ్యక్తం చేశారు. ఎపికి ప్రత్యేక హోదా కోసం ఓ ప్రైవేటు మెంబర్ బిల్లుపై ఆయన మాట్లాడుతూ, విభజన చట్టంలో ఎన్నో లోపాలున్నందున వాటిని సవరించాలన్నారు. తగినన్ని నిధులిచ్చి ఎపిని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.

04/29/2016 - 17:04

దిల్లీ: విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడమే గాక, ఎపి ప్రజలను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని కాంగ్రెస్ ఎంపి ఎంఎ ఖాన్ రాజ్యసభలో విమర్శించారు. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఓ ప్రైవేటు మెంబర్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విభజన చట్టంలో పలు హామీలుండాలని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన వారు ఇపుడు వౌనం వహిస్తున్నారన్నారు.

04/29/2016 - 17:04

దిల్లీ: మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ‘నీట్’ (జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష)ను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ‘నీట్’పై గురువారం ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఈరోజు తిరస్కరించింది. ముందు ప్రకటించినట్లు రెండు విడతలుగా పరీక్ష జరపాలని ఆదేశించింది.

04/29/2016 - 17:03

ముంబయి: ముంబయిలో వివాదాస్పదంగా మారిన ఆదర్శ్ హౌసింగ్ సౌసైటీ భవంతిని కూల్చివేయాలంటూ బాంబే హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. కార్గిల్ యుద్ధంలో పోరాడిన జవాన్లు, అమరులైన సైనికుల భార్యలకు బహుళ అంతస్థుల భవనాన్ని ఆదర్శ్ హౌసింగ్ సౌసైటీ నిర్మించింది.

04/29/2016 - 17:01

దిల్లీ: ఛాతి నొప్పితో బాధపడుతూ ఇక్కడి ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె త్వరితంగా కోలుకుంటున్నందున త్వరలోనే డిశ్చార్జి చేస్తామని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.

04/29/2016 - 16:58

దిల్లీ: పీఎఫ్‌పై వడ్డీని 8.8 శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. గతంలో పీఎఫ్‌ఫై వడ్డీని 8.7 శాతానికే పరిమితం చేయడంపై దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. వడ్డీని 8.8శాతానికి పెంచాల్సిందేనని డిమాండ్‌ చేశాయి.

04/29/2016 - 16:04

న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ మరణ మిస్టరీకి సంబంధించిన మరో 25 రహస్య పత్రాలను www.netajipapers.gov.in అనే వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి మహేష్ శర్మ శుక్రవారం తెలిపారు. నేతాజీ 119వ జయంతి సందర్భంగా ఈ ఏడాది జనవరి 23న వంద రహస్య పత్రాలను బయటపెట్టారు.

04/29/2016 - 14:01

విజయనగరం: భోగాపురం మండలంలోని ఓ ప్రైవేటు రిసార్ట్సులో శుక్రవారం ఉదయం నాలుగు రాష్ట్రాల డిజిపిల భేటీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సమీప ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. విలేఖరులు రిసార్ట్సు వద్దకు అనుమతించలేదు.

04/29/2016 - 13:59

గాంధీనగర్: ఆరులక్షల రూపాయల లోపు వార్షికాదాయం ఉన్నవారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం మే 1నుంచి అమలులోకి వస్తుందని సిఎం ఆనందీబెన్ శుక్రవారం ప్రకటించారు. రాష్టల్రో మైనార్టీలకు ఇదివరకే రిజర్వేషన్ల విధానాన్ని అమలు చేశారు. రిజర్వేషన్ల కోసం ఇటీవల పటేల్ కులస్థులు ఆందోళనలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.

Pages