S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/23/2016 - 01:12

గాంధీనగర్, జనవరి 22: పార్లమెంటులో సభాకార్యక్రమాలు స్తంభించిపోతున్న దృష్టాంతాలు రోజురోజుకు పెరుగుతుండటం పట్ల లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామిక సంస్థల పట్ల ప్రజల విశ్వాసం క్రమంగా సన్నగిల్లుతోందని ఆమె అన్నారు.

01/23/2016 - 01:11

న్యూఢిల్లీ, జనవరి 22: కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ విషప్రభావం వల్లనే మృతి చెందిందని అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్) మెడికల్ బోర్డు భావిస్తోంది. సునంద శరీరంలోని అవయవాలను పరీక్షించి ఎఫ్‌బిఐ ఇచ్చిన నివేదికపై మెడికల్ బోర్డు తన అభిప్రాయాన్ని తెలియజేసింది.

01/23/2016 - 01:11

న్యూఢిల్లీ, జనవరి 22: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి మొదటి వారంలో మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించే అవకాశాలున్నాయి. అమిత్ షాను బిజెపి పూర్తి స్థాయి అధ్యక్షుడుగా ఎన్నుకున్న తరువాత మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించాలని మోదీ ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నరేంద్ర మోదీ శనివారం రాత్రి బిజెపి ప్రస్తుత కార్యవర్గ సభ్యులకు విందు ఏర్పాటు చేసినట్లు తెలిసింది.

01/23/2016 - 01:10

లక్నో, జనవరి 22: ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత దేశాన్ని తీర్చిదిద్దాలన్నదే తన ప్రభుత్వ ఆశయమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆర్థిక వ్యవస్థను శక్తివంతంగా తీర్చిదిద్దడమే కాకుండా పేదల జీవితాల్లో మార్పు తేవడం కూడా తమ ధ్యేయమని స్పష్టం చేశారు. పేదల జీవితాల్లో మార్పు తెస్తే వారికి ఉపాధి అవకాశాలు పెంపొందుతాయని, తమ సొంతకాళ్లపై నిలబడగులుగుతారని మోదీ అన్నారు.

01/23/2016 - 01:30

న్యూఢిల్లీ, జనవరి 22: తెలంగాణలో దాదాపు ఆరు లక్షల మంది యువతకు ఉపాధి కల్పించే పెట్టుబడులు, వస్తుతయారీ జోన్, ఫార్మానిమ్జ్,్ధన్యం ప్రాసెసింగ్ క్లస్టర్‌తో పాటు నాలుగు ఎస్‌ఇజడ్‌లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం సాయంత్రం విలేఖరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణకు మంచి రోజులు వచ్చాయంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

01/23/2016 - 00:43

న్యూఢిల్లీ/ బెంగళూరు/ హైదరాబాద్, జనవరి 22: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలో పెద్ద ఎత్తున దాడులకు పాల్పడాలన్న ఉగ్రవాదుల కుట్ర భగ్నమయింది. కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఎన్‌ఐఎ శుక్రవారం ఏకకాలంలో దాడులు జరిపి 13మంది ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులను అరెస్టు చేయడంతో పెద్ద ముప్పు తప్పింది.

01/23/2016 - 00:42

న్యూఢిల్లీ, జనవరి 22: హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర మానవ వనరుల శాఖ శుక్రవారం నిర్ణయించింది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని దళిత, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల ప్రయోజనాలు కాపాడేందుకు, వివక్షతను కఠినంగా అరికట్టేందుకు మనవ వనరుల శాఖ పలు నిర్ణయాలను ప్రకటించింది.

01/22/2016 - 16:45

దిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందన్న హెచ్చరికలతో పలు నగరాల్లో నిఘా బృందాలు తనిఖీలను ముమ్మరం చేశాయి. దిల్లీ, ముంబయి, హైదరాబాద్, అహ్మదాబాద్,బెంగళూరు, చండీగఢ్, కోల్‌కత తదితర నగరాల్లో సోదాలు చేస్తూ అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పలు నగరాల్లో కొందరిని అరెస్టు చేశారు.

01/22/2016 - 16:45

లక్నో: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రీసెర్చి స్కాలర్ రోహిత్ ఆత్మహత్య ఉదంతం తనను తీవ్రంగా కలచివేసిందని, ఈ ఘటనపై రాజకీయాలు అనవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన శుక్రవారం ఇక్కడ అంబేద్కర్ వర్సిటీ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ, రోహిత్ తల్లిని ఓదార్చవలసిన సమయం ఇది అన్నారు. రోహిత్ మృతితో దేశం ఓ ముద్దుబిడ్డను కోల్పోయిందన్నారు.

01/22/2016 - 12:11

దిల్లీ: దిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పట్టడంతో విపరీతంగా పొగమంచు కురుస్తోంది. దీంతో రోడ్లపై వాహనాలే కాక రైళ్లు, విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతోంది. దిల్లీ ఎయిర్‌పోర్టులో 11 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దాదాపు 25 రైళ్లు ఆలస్యంగా బయల్దేరాయి.

Pages