S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/25/2016 - 00:27

న్యూఢిల్లీ/ ఇటానగర్, జనవరి 24: గత నెల రోజులుగా రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలన విధించాలని కేంద్ర మంత్రివర్గం ఆదివారం సిఫార్సు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అప్పటికప్పుడు జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచాలని కూడా కేబినెట్ నిర్ణయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

01/25/2016 - 00:26

చండీగఢ్, జనవరి 24: మానవత్వ విలువలను మంటగలుపుతున్న ఉగ్రవాద శక్తులపై భారత్ - ఫ్రాన్స్‌లు ఉమ్మడి పోరాటం సాగిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాన్‌తో కలిసి ఇక్కడ సంయుక్త వ్యాపార శిఖరాగ్ర సదస్సులో మాట్లాడిన మోదీ మానవత్వ విలువలను హరించే శక్తులను ఉమ్మడిగా ఎదుర్కొంటామని వెల్లడించారు.

01/25/2016 - 00:25

న్యూఢిల్లీ, జనవరి 24:రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఆత్మాహుతి దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. మోదీపై 12-15 సంవత్సరాల పిల్లల్లే ఆత్మాహుతి బాంబర్లుగా ప్రయోగించే అవకాశం ఉందని స్పష్టం చేశాయి.

01/24/2016 - 18:21

హైదరాబాద్ : దక్షిణాది సినీ పరిశ్రమలో తొలిసారిగా హైదరాబాద్ వేదికగా ఐఫా అవార్డుల ప్రదానోత్సవం అంగరంగవైభవంగా ప్రారంభమైంది. ఆది, సోమవారాలలో రెండురోజులపాటు జరిగే ఈ వేడుకకు దక్షిణాది సినీతారలు తరలివచ్చారు. గచ్చిబౌలి ఔట్‌డోర్ స్డేడియంలో అట్టహాసంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల ద్వారా సేకరించిన మొత్తాన్ని ఇటీవల చెన్నైలో వచ్చిన తుపాను బాధితులకు అందజేయనున్నారు.

01/24/2016 - 16:29

చెన్నై: తమిళనాడులోని విల్లుపురంలోని ఎస్‌విఎస్ యోగా, నేచురోపతి వైద్య కళాశాలలో ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం రాష్ట్రంలో కలకలం రేపింది. మనీషా, ప్రియాంక, శరణ్య అనే మెడిసిన్ విద్యార్థినుల మృతదేహాలను ఆదివారం ఉదయం కళాశాల వద్ద బావిలో కనుగొన్నారు. వీరు శనివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు.

01/24/2016 - 15:59

దిల్లీ: బిజెపి ప్రస్తుత అధ్యక్షుడు అమిత్ షా రెండోసారి అదే పదవికి ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి ఆయన ఒక్కరి పేరు మాత్రమే ప్రతిపాదనకు రావడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.ఆయన పేరును ప్రధాని మోదీ ప్రతిపాదించగా పలువురు కేంద్ర మంత్రులు సమర్ధించారు. ఈ ఎన్నికకు పార్టీ అగ్రనేతలు అద్వానీ, మురళీమనోహర్ జోషీ దూరంగా ఉండడం గమనార్హం.

01/24/2016 - 02:30

జైపూర్, జనవరి 23: దేశంలో అసహనం పరాకాష్ఠకు చేరిందనడానికి హైదరాబాద్ యూనివర్శిటీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనే నిదర్శనమని ప్రముఖ కవి, రచయిత అశోక్ వాజ్‌పాయి స్పష్టం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఘటన తరవాత తనకు వచ్చిన డి.లిట్ పురస్కారాన్ని వాజ్‌పాయి వాపసు చేశారు.

01/24/2016 - 02:30

లక్నో, జనవరి 23: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్‌లాగా ఏ దళిత విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకోకుండా చూడడానికే తాము ఆ పని చేశామని శుక్రవారం ఇక్కడ అంబేద్కర్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఇద్దరు విద్యార్థులు చెప్పారు.

01/24/2016 - 02:28

న్యూఢిల్లీ/ హైదరబాద్, జనవరి 23: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు అనుబంధంగా పనిచేస్తున్న గ్రూపులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)తో పాటు కేంద్ర భద్రతా సంస్థలు శనివారం వరుసగా రెండో రోజూ ఉక్కుపాదం మోపాయి. గణతంత్ర దినోత్సవానికి ముందు దాడులకు కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణలతో వివిధ రాష్ట్రాల్లో 14మందిని అరెస్టు చేసి స్థానిక కోర్టుల్లో హాజరుపరిచాయి.

01/24/2016 - 01:17

పాట్నా, జనవరి 23: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతం చేయడం వెనుక బిజెపికి ఒక దురుద్దేశం ఉందని, స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా రకరకాల సిద్ధాంతాల మధ్య ఉన్న వైరుద్ధ్యాలను ముందుకు తీసుకురావాలన్నది దాని ఉద్దేశమని బిహార్ ముఖ్యమత్రి నితీశ్ కుమార్ శనివారం ఆరోపించారు. ‘స్వాతంత్య్ర పోరాటంతో బిజెపికి ఎలాంటి సంబంధం లేదు.

Pages