S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/25/2016 - 14:03

ముంబయి: రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా ముంబయిలోని ధారవిలో విద్యార్థులు, రాజకీయపార్టీలు చేపట్టిన ఆందోళనలో ఘర్షణ జరిగింది. సంఘ్ కార్యకర్తలు ర్యాలీని అడ్డుకోడానికి ప్రయత్నించారు.

01/25/2016 - 13:47

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం పొగమంచు తీవ్రతతో దాదాపు 30 రైళ్లను అధికారులు రద్దు చేశారు. 75 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలిపారు. ఆదివారం ఉదయం అత్యల్పంగా 6.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో రైళ్లు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

01/25/2016 - 12:07

లక్నో: ఉత్తరప్రదేశ్ గవర్నర్ రాంనాయక్ తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆయనను లక్నోలోని ఎస్.జి.పి.జి.ఐ. ఆస్పత్రిలో చేర్పించారు. 2014 జులై ఆయన యు.పి. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు.

01/25/2016 - 12:05

ఇటానగర్: రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలన సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. అరుణాచల్ అసెంబ్లీలో గత నెల 16న స్పీకర్‌కు ఉద్వాసన పలికేందుకు 21 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు, 11 మంది బిజెపి ఎమ్మెల్యేలు చేతులు కలపడంతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. కేంద్ర మంత్రిమండలి సూచన మేరకు రాష్టప్రతి పాలన విధించారు.

01/25/2016 - 01:39

శ్రీనగర్, జనవరి 24: జమ్మూ, కాశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై పిడిపిలో నెలకొన్న సంక్షోభం త్వరలోనే ఒక కొలిక్క వచ్చేట్లు కనిపిస్తోంది. అధికార పగ్గాలు తమ కుటుంబానికి చెందినవారి చేతుల్లోనే ఉండాలని పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ భావిస్తూ ఉండడమే ప్రభుత్వం ఏర్పాటులో జాప్యానికి అసలు కారణమని భావిస్తున్నారు.

01/25/2016 - 01:38

కోల్‌కతా, జనవరి 24: స్వాతంత్య్ర యోధుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మృతిపై దర్యాప్తుకు భారత్-జపాన్ సంయుక్త దర్యాప్తును ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనకు 1967లో అప్పటి భారత ప్రభుత్వం ఇష్టపడలేదు. జపాన్ ఆర్మీ రిటైర్డ్ అధికారి ఇవయిచి ఫుజివారా ఈ అభ్యర్థన చేశారు. ఫుజివారా కోల్‌కతాలోని నేతాజీ మ్యూజియంకు ఆయనకు చెందిన కత్తిని అందజేయడానికి 1967 మార్చి 19న నగరానికి వచ్చారు.

01/25/2016 - 01:35

న్యూఢిల్లీ, జనవరి 24: ఉత్తర భారతావనిని చలి తీవ్రస్థాయిలో వణికిస్తోంది. దట్టంగా పొగమంచు కమ్మేయడంతో జేవర్ టోల్‌ప్లాజా వద్ద యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం ఉదయం దాదాపు 20 వాహనాలు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టమేమీ సంభవించకపోయినప్పటికీ పలు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

01/25/2016 - 01:29

న్యూఢిల్లీ, జనవరి 24: భారత్‌కు రూ.60వేల కోట్ల విలువ గల రఫాలే యుద్ధ విమానాలను విక్రయించే ఒప్పందం సరయిన పంథాలో సాగుతోందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాన్ స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య అసాధారణ స్థాయిలో రానున్న 40ఏళ్ల పాటు పారిశ్రామిక, సాంకేతిక పరిజ్ఞానం రంగాల్లో ద్వైపాక్షిక సహకారానికి ఇది మార్గం సుగమం చేస్తుందని ఆయన అన్నారు. హోలాన్ భారత పర్యటన ఆదివారం చండీగఢ్ నుంచి మొదలయింది.

01/25/2016 - 01:55

న్యూఢిల్లీ, జనవరి 24: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడుగా అమిత్ షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బిజెపికి చెందిన ఇతర నాయకులెవ్వరూ నామినేషన్ దాఖలు చేయకపోవటంతో అమిత్ షా ఏకక్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. బిజెపి అధ్యక్ష పదవికి మొదటిసారి ఎన్నికైన అమిత్ షా మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.

01/25/2016 - 01:00

న్యూఢిల్లీ, జనవరి 24: ఆపదలో ఉన్న తోటివారి ఆదుకోవాలన్న మానవీయ విలువల్ని చిరు ప్రాయంలోనే కనబరిచిన చిన్నారులను చూసి సమాజం మరింత స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తెలంగాణకు చెందిన రుచితకు ప్రతిష్టాత్మక గీతాచోప్రా అవార్డు సహా 25మందికి సాహస అవార్డులను ప్రదానం చేసిన సందర్భంగా మోదీ మాట్లాడారు.

Pages