S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/24/2015 - 07:26

భారతదేశ అణు పితామహుడిగా ఎనలేని సేవలందించి రాష్టప్రతిగా కూడా సమున్నత విలువలు పాదుకొల్పిన అబ్దుల్ కలాం జూలై 27న తుది శ్వాస విడిచారు. తన ఆలోచనలతోనూ, తన జీవన విధానంతోనూ ఇటు యువతనూ, అటు అన్ని తరగతుల వారినీ విశేషంగా ప్రభావితం చేసిన కలాం మరణాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. భారతదేశ 11వ రాష్టప్రతిగా ఆయన పనిచేసిన కాలం చరిత్రలో తిరుగులేనిదిగా నిలిచిపోయింది.

12/24/2015 - 07:24

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రెండు జాతీయ రాజకీయ పార్టీలకు విఘాతకరంగా పరిణమించడమే కాకుండా అతి స్వల్ప వ్యవధిలోనే కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ విజయదుందుభి మోగించింది. 2014లోనే స్వల్ప వ్యవధితోపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్ ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాల్లో 67 సీట్లను గెలుచుకుని ప్రాంతీయ పార్టీలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.

12/24/2015 - 07:23

దేశవ్యాప్తంగా అత్యంత విస్మయకరమైన దిగ్భ్రాంతికరమైన నేర ఘట్టాల్లో షీనా బోరా కేసును ప్రధానంగా పేర్కొనాలి. నేరం, హత్య కలగలసిన ఈ కేసు రోజురోజుకూ కొత్త మలుపు తిరుగుతూ దర్యాప్తు సంఘాలకే సవాలు విసురుతోంది. దాదాపు అన్ని చానళ్లలోనూ ఆగస్టునుంచి నేటి వరకూ కూడా షీనాబోరా కేసుకు సంబంధించిన మిస్టీరీలు మారుమోగుతూనే ఉన్నాయి.

12/24/2015 - 07:21

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎనలేని ఆసక్తిని కలిగించాయి. కనీసం బిహార్‌లోనైనా విజయం సాధించాలనుకున్న బిజెపికి నితీష్ సారథ్యంలోని మహాకూటమి నుంచి పెను సవాలే ఎదురైంది. జెడియు, ఆర్‌జెడి, కాంగ్రెస్ పార్టీలు సంయుక్తంగా పోటీచేసి బిహార్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించాయి.

12/24/2015 - 07:12

బెంగళూరు, డిసెంబర్ 23: తక్కువ ధరకు వైద్య చికిత్స అనేది ఇప్పటికీ ఒక పెద్ద సవాలుగానే ఉందని, క్యాన్సర్ చికిత్స ఖర్చును అందరికీ అందుబాటులో ఉండేలా చేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైన కృషి చేస్తున్నాయని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. భరించగలిగే వైద్య చికిత్స అనేది మన దేశంలో ఇప్పటికీ సవాలుగానే ఉంటోంది.

12/24/2015 - 07:10

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: పాత వి మానాలను ఎందుకు ఉపయోగిస్తున్నారని, జవాన్ల ప్రాణాలను ఎందుకు ప్రమాదంలోకి నెట్టుతున్నారంటూ మంగళవారం ఢిల్లీలో కూలిన బిఎస్‌ఎఫ్ విమానం ప్రమాదంలో మృతి చెందిన జవాన్ల బంధువులు బుధవారం హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ప్రశ్నల వర్షంతో నిలదీశారు.

12/24/2015 - 07:08

అమేథి, డిసెంబర్ 23: విపరీతంగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల విషయంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మో దీపై విరుచుకుపడ్డారు. ‘అచ్ఛే దిన్’ (మంచి రోజులు) ప్రధానమంత్రికే వచ్చాయని, సామాన్య ప్రజలకు రాలేదని ఆయన విమర్శించారు. రాహుల్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథి లోక్‌సభ నియోజవర్గంలో రెండు రోజుల పాటు పర్యటించడానికి బుధవారం ఇక్కడికి వచ్చారు.

12/24/2015 - 07:05

ముంబయి, డిసెంబర్ 23: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మళ్లీ చిక్కుల్లో పడే అవకాశాలు ఉన్నాయి. 2002 నాటి ఢీకొట్టి పారిపోయిన (హిట్ అండ్ రన్) కేసులో సల్మాన్ ఖాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ బొంబా యి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

12/24/2015 - 06:51

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: బోనస్ సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలపటం పట్ల కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు ఉద్దేశించిన బోనస్ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

12/24/2015 - 06:08

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: దాదాపు నెల రోజుల పాటు గొడవ, గందరగోళం మధ్య కొనసాగిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. సభ్యుల గొడవ, గందరగోళం మూలంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు దాదాపుగా వృథా అయ్యాయని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ చెప్పకనే చెప్పారు.

Pages