S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/24/2015 - 05:59

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: జాతీయ వెనుకబడిన కులాల కమిషన్ అధికారాలను పెంచటంతోపాటు క్రీమీలేయర్ విధానాన్ని తొలగించాలని రాజ్యసభ సభ్యుడు, వెనుకబడిన కులాల పార్లమెంటు సభ్యుల సంఘం కన్వీనర్ వి.హనుమంతరావు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. హనుమంతరావు ఈమేరకు ప్రధానమంత్రికి బుధవారం లేఖ రాశారు. 27 శాతం రిజర్వేషన్లు వెనుకబడిన కులాల వారికి అందాలంటే తాము కోరిన విధంగా చేయాలని హనుమంతరావు అభిప్రాయపడ్డారు.

12/24/2015 - 05:00

న్యూఢిల్లీ, డిసెంబర్ 23:దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని ఓ కోర్టు గదిలోనే సుపారీ హంతకులు బుధవారం సినిమా ఫక్కీలో తెగబడ్డారు. రెండు గ్యాంగుల మధ్య జరిగిన ఘర్షణలకు కోర్టు గదే కేంద్రమైంది. కోర్టుకు వస్తున్న తన ప్రత్యర్థిని హతమార్చేందుకు మరో ముఠా నాయకుడు ఈ మైనర్లను ఉపయోగించుకున్నాడు. ఢిల్లీలోని దక్షిణ్‌పురి, మదన్‌గిర్‌లకు చెందిన ఈ మైనర్లు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ హెడ్‌కానిస్టేబుల్ మరణించాడు.

12/24/2015 - 04:59

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: అమెరికాలోని సాన్‌జోస్ పరిధిలోని సిలికాన్ వ్యాలీ వర్శిటీ, ఫ్రెమోంట్‌లోని నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ వర్శిటీలో ఉన్నత చదువులకు వెళ్లాలనుకునే వారు తమ ప్రయాణాన్ని కొంతకాలం వాయిదా వేసుకోవాలని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. విదేశీ వ్యవహారాల శాఖ బుధవారం ఈమేరకు ప్రకటన విడుదల చేసింది.

12/24/2015 - 04:55

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడ్డారంటూ బహిరంగ ఆరోపణలు చేసిన పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్‌ను బిజెపి సస్పెండ్ చేసింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిన రోజే కీర్తి ఆజాద్‌ను బిజెపి అధినాయకత్వం పార్టీ నుంచి సస్పెండ్ చేయటం గమనార్హం.

12/23/2015 - 16:48

దిల్లీ: 2019 జాతీయ క్రీడలను ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహిస్తారు. ఇక్కడ బుధవారం జరిగిన భారత ఒలింపిక్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జాతీయ క్రీడలను నిర్వహించే హక్కుల్ని ఎపి కైవసం చేసుకుంది. నెల్లూరు జిల్లా మొగళ్లపాలెంలో ఈ క్రీడలను నిర్వహించేందుకు సుమారు 150 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియంలను నిర్మిస్తారు.

12/23/2015 - 11:34

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజులపాటు పర్యటనకు ఈ రోజు రష్యా బయల్దేరి వెళ్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఆయన అణుశక్తి, రక్షణ, వాణిజ్య రంగాల్లో సహకారంపై కీలక విషయాలు చర్చించే అవకాశం ఉంది.

12/23/2015 - 07:44

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో మంగళవారం ఉదయం బిఎస్‌ఎఫ్ విమానం కూలిపోయి 10 మంది దుర్మరణం చెందారు. సూపర్‌కింగ్ సంస్థకు చెందిన విమానం ఉదయం 9.50 గంటల ప్రాంతంలో విమానాశ్రయ ప్రహరీగోడను బలంగా ఢీకొంది. సాంకేతిక నిపుణులతో విమానం రాంచీ వెళ్లడానికి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అధికారులు, ముగ్గురు సాంకేతిక నిపుణులు మృతి చెందారు.

12/23/2015 - 07:35

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళుతున్న భారతీయ విద్యార్థులు, ముఖ్యంగా తెలుగు విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామమోహన్‌రావు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కోరారు.

12/23/2015 - 07:20

న్యూఢిల్లీ, డిసెంబర్ 22:తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం చేసే విషయం పరిశీలిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు.

12/23/2015 - 07:19

న్యూఢిల్లీ, డిసెంబర్ 22:ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్మాగారంతోపాటు దేంలోని మూతపడిన అన్ని సిమెంట్ కార్మాగారాలను తెరిపించేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత గేతే తెలంగాణా అటవీ, పర్యావరణ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నకు హామీ ఇచ్చారు. జోగు రామన్న మంగళవారం అనంత గీతేను కలిసి ఆదిలాబాద్‌లోని సిసిఐ సిమెంట్ కార్మాగారాన్ని తిరిగి ప్రారంభించటం గురించి చర్చించారు.

Pages