S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/08/2015 - 05:16

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి-మండి కుల్లు రోడ్డు మార్గం మీదుగా బియాస్ నదిలోకి కొండచరియలు విరిగిపడిన దృశ్యం

12/07/2015 - 18:37

ఢిల్లీ : వీకే సింగ్‌ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పార్లమెంటు భవనం ఆవరణలో గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎంపీలు ఆందోళనకు చేశారు. మంత్రి వీకే సింగ్‌ దళితులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండు చేశారు.

12/08/2015 - 00:06

చండీఘడ్ : కొండ చరియలు విరిగి పడటంతో చండీఘడ్‌-మనాలీ జాతీయ రహదారి నెం.21ని సోమవారం తాత్కాలికంగా మూసివేశారు. హిమాచలప్రదేశ్‌ మండీ జిల్లాలోని హనోగీ దేవాలయం సమీపంలో ఈ తెల్లవారుజామున భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ జాతీయ రహదారిని మూసివేశారు.

12/07/2015 - 18:35

చెన్నై : వర్షాలు, వరదలతో అస్తవ్యస్తమైన చెన్నై నగరంలో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ సహా నేవీ, వైమానిక దళాలు రామాపురం ప్రాంతంలో దీప్తి వెల్‌చామి(28) అనే నిండు గర్భిణిని హెలికాప్టర్‌ సహాయంతో ఆస్పత్రికి తరలించారు. ఇంటి పైకప్పు నుంచి ఆమెను హెలికాప్టర్‌లో తాంబరం ఎయిర్‌బేస్‌కు తరలించారు. అక్కడి నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లారు.

12/07/2015 - 17:01

ఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తుల కేసు విచారణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దాఖలుచేసుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. విచారణకు కోర్టులో హాజరుకావాలని కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని సోనియా, రాహుల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.

12/07/2015 - 17:00

ముంబయి : ముంబయిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కాండివిలి ప్రాంతంలోని ఓ గోడౌన్‌లో నుంచి మంటల చెలరేగాయి. అకుర్లిరోడ్‌లో ఉన్న మురికివాడలో ఈ గోడౌన్ ఉంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. పలుమార్లు గ్యాస్ సిలెండర్లు పేలిన శబ్దాలు కూడా వినిపించాయని స్థానికులు తెలిపారు.

12/07/2015 - 14:11

చెన్నై : కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు ఈరోజు చెన్నై విమానాశ్రయాన్ని పరిశీలించారు. ఇటీవల సంభవించిన వరదల కారణంగా విమానాశ్రయం నీట మునిగిన విషయం తెలిసిందే. అనంతరం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వరదల కారణంగా విమానాశ్రయానికి కలిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు.

12/07/2015 - 14:07

న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో సోమవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.2గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీ సహా పంజాబ్, జమ్ము కశ్మీర్ ఇతర రాష్ట్రాల్లో భూప్రకంపనలు వచ్చాయి.తజకిస్థాన్లో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం లేదు.

12/07/2015 - 11:51

దిల్లీ: సిపిఐ సీనియర్ నాయకుడు ఎ.పి.బర్దన్ అస్వస్థతకు గురవడంతో ఆయనను సోమవారం ఉదయం ఇక్కడి రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు గమనించిన వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు.

12/07/2015 - 11:49

శ్రీనగర్: అనంతనాగ్ జిల్లా బిజ్‌బిహారా ప్రాంతంలో సోమవారం ఉదయం ఉగ్రవాదులు సిఆర్‌పిఎఫ్ జవాన్ల వాహనాలపై ఆకస్మికంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు.

Pages