S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/14/2020 - 01:19

న్యూఢిల్లీ, జనవరి 13: పౌరసత్వ సవరణ చట్టం అమలులోకి వచ్చిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షాలను దెబ్బ తీసేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం ఏర్పాటు చేసిన ప్రతిపక్ష పార్టీల సమావేశం తుస్సుమన్నది. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమానికి నాంది పలికే లక్ష్యంతో సోనియా ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల కీలక సమావేశం ఏర్పాటు చేయ డం తెలిసిందే.

01/14/2020 - 01:12

న్యూఢిల్లీ, జనవరి 13: జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ సోమవారం బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డాతో సమావేశమై సమాలోచనలు జరిపారు.

01/13/2020 - 17:15

న్యూఢిల్లీ: రాజ్యాంగ పరిరక్షణకు దేశవ్యాప్త ప్రచారం నిర్వహించనున్నామని సీపీఐ కార్యదర్శి రాజా అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ జనవరి 26 నుంచి 30వ తేదీవరకు ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టానికి, ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా ఆందోళన ఉద్ధృతం చేస్తామని చెప్పారు. రాజ్యాంగంలోని ముందుమాటను చదివించి ప్రతిజ్ఞ చేయిస్తామని చెప్పారు.

01/13/2020 - 17:15

న్యూఢిల్లీ: హాస్టళ్ల ఫీజుల పెంపును నిరసిస్తూ జేఏన్‌యూ విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. ఇటీవల యూనివర్శిటీలో చోటుచేసుకున్న ఆందోళనల నేపథ్యంలో విద్యార్థుల హాస్టల్ ఛార్జీలు పెంచబోమని, కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని యూనివర్శిటీ యాజమాన్యం కోరింది. రిజస్ట్రేషన్ వెబ్‌సైట్ ఓపెన్‌కాకపోవటంతో యూనివర్శిటీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

01/13/2020 - 17:14

న్యూఢిల్లీ: పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేసే ఆందోళనకారులు ప్రజా ఆస్తులను ధ్వంసం చేసేవారిని కాల్చిపారెయ్యాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ అన్నారు. గత నెలలో బెంగాల్‌లో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఈ ఆందోళన హింసాత్మకంగా మారింది. దీనిపై బీజేపీ చీఫ్ స్పందిస్తూ నిరసనకారులపై ఫైరింగ్‌కుకానీ లాఠీఛార్జీకిగానీ మమత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయలేదని అన్నారు.

01/13/2020 - 17:12

న్యూఢిల్లీ: వారణాసిలో కాశీ విశ్వనాధుడ్ని దర్శించుకునే భక్తులకు డ్రెస్ కోడ్ అమలుచేయనున్నారు. ఆలయంలోని గర్భగుడిలోకి ప్రవేశించే భక్తులు మగవారు ధోవతి, కుర్తా, స్ర్తిలు చీర ధరించి రావాలనే నియమం పెట్టాలని కాశీ విద్వత్ పరిషద్ నిర్ణయం తీసుకుంది. ఫ్యాంట్, షర్ట్, జీన్స్ ధరించేవారు కొంతదూరం నుంచి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. డ్రెస్‌కోడ్ అమలు తేదీని త్వరలో ఖరారు చేయనున్నారు.

01/13/2020 - 17:11

పాట్నా: సీఏఏపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బీహార్ సీఎం నితీశ్‌కుమార్ అన్నారు. పార్లమెంటులో సీఏఏకు మద్దతు పలికిన జేడీయూ పౌరసత్వం చట్టంపై పునరాలోచాణ చేయాలని కోరారు. బీహార్ అసెంబ్లీ ఒకరోజు సమావేశం నిర్వహించారు. ఎన్‌ఆర్‌సీని ఎట్టి పరిస్థితుల్లోనూ తమ రాష్ట్రంలో అమలుచేయబోమని స్పష్టం చేశారు. అవసరమైతే సీఏఏ చట్టంపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

01/13/2020 - 13:26

న్యూఢిల్లీ: శబరిమల వివాదంపై సుప్రీం కోర్టు న్యాయవాదులతో ఈనెల 17న ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఈ మేరకు ఈ కేసుపై నేడు తొమ్మిది మంది సభ్యులు గల ధర్మాసనం విచారణ చేపట్టింది. కాగా గతంలో వేసిన రివ్యూ పిటిషన్లను సమీక్షించటం లేదని, గత ధర్మాసనం వేసిన ఏడు ప్రశ్నల గురించి వాదనలు నిర్వహించనున్నట్లు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే తెలిపారు.

01/13/2020 - 13:15

న్యూఢిల్లీ: ఆందోళనకారులను చంపవద్దని, ఉక్రెయిన్ విమానాన్ని కూల్చివేత తరువాత ఇరాన్‌లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్‌కు చర్చలు జరపాల్పిసిన పరిస్థితులు ఏర్పడ్డాయని, ఆ దేశంతో చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

01/13/2020 - 13:14

న్యూఢిల్లీ: సీఏఏ, ఎన్‌ఆర్సీలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ నేడు ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశానికి కొన్ని విపక్ష పార్టీలు డుమ్మాకొడుతున్నాయి. సమావేశానికి హాజరుకావటం లేదని అమ్ ఆద్మీ, బీఎస్పీ ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశానికి తాను హాజరుకావటం లేదని ఇంతకుముందే తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించాయి.

Pages