S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/19/2018 - 04:07

జమ్మూ, మే 18: జమ్మూలోని భారత్-పాకిస్తాన్ సరిహద్దులో పాక్‌దళాలు జరిపిన కాల్పుల్లో ఒక బిఎస్‌ఎఫ్ జవాన్, నలుగురు పౌరులు మృతి చెందగా, 12మంది గాయపడ్డారు. పాకిస్తాన్ దళాలు భారత్ సరిహద్దు గ్రామాలు, బోర్డర్ అవుట్‌పోస్టులపై గుళ్ల వర్షం కురిపించాయి. ఈనెల 19న ప్రధాని నరేంద్రమోదీ జమ్మూకాశ్మీర్ పర్యటన నేపథ్యంలో ఈ దాడులు జరగడం గమనార్హం.

05/19/2018 - 04:06

న్యూఢిల్లీ, మే 18: కర్నాటక అసెంబ్లీలో సీనియర్ శాసన సభ్యుడికి బదులు జూనియర్ ఎమ్మెల్యే కేజీ బోపయ్యను ప్రొటెం స్పీకర్‌గా నియమించడాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని కాంగ్రెస్ రణదీప్‌సింగ్ సుర్జేవాలా వెల్లడించారు. బోపయ్యను ప్రోటెం స్పీకర్‌గా నియమించటం ద్వారా గవర్నర్ వాజుభాయ్ వాలా మరోసారి రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని శుక్రవారం ఇక్కడ విరుచుకుపడ్డారు.

05/19/2018 - 01:46

కర్నాటకంలో ఎవరిది గెలుపు.. ఎవరికి కుదుపు? అన్నది గంటల్లో తేలిపోనుంది. సుప్రీం కోర్టు ఆదేశంతో సీను మారడంతో, గత రెండు రోజుల రాజకీయ పరిణామాలు సరికొత్త ఆవిష్కరణకు తెరతీశాయి. బలం లేకపోయినా గద్దెనెక్కిన సీఎం యెడ్యూరప్ప శనివారం సాయంత్రం మెజార్టీని నిరూపించుకోవాల్సిన పరిస్థితి సుప్రీం ఆదేశంతో ఏర్పడింది. పదిహేను రోజుల గడువు తగ్గిపోవడంతో ఆయన మద్దతు వేటలోపడ్డారు.

05/18/2018 - 17:29

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం తనయుడు కార్తి చిదంబరానికి సుప్రీంకోర్టులో గొప్ప ఊరట లభించింది. ఆయన విదేశాలకు వెళ్ళేందుకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 19 నుంచి 27 వరకు బ్రిటన్, జర్మనీ, స్పెయిన్లలో పర్యటించేందుకు అనుమతించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది.

05/18/2018 - 17:06

బెంగళూరు: రేపు జరుగనున్న బల పరీక్షకు ముందు కర్ణాటకలో గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే బోపయ్యను నియమించారు. గతంలో బోపయ్య వ్యవహారశైలిని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. సభలో అత్యంత సీనియర్‌గా ఉన్న సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమించాలనే నిబంధన ఉన్నా గవర్నర్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారని కాంగ్రెస్ విమర్శించింది. విరాజ్‌పేట్ నుంచి బోపయ్య గెలిచారు.

05/18/2018 - 16:53

డెహ్రడూన్: ఉత్తరాఖండ్‌లో దైవదర్శనానికి వెళ్తున్న భక్తులను లారీ ఢీకొన్న ఘటనలో 11 మంది మృతిచెందగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చంపావత్ జిల్లాలోని తనక్‌పూర్‌లో జరిగింది. ప్రమాదం అనంతరం ట్రక్ డ్రైవర్ పారిపోయాడు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

05/18/2018 - 13:08

బెంగళూరు: మాజీ సీఎం సిద్ధరామయ్య నిరంకుశ వైఖరి, అహంకారం, కులతత్వం వల్లే కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిందని కర్ణాటక అసెంబ్లీ మాజీ స్పీకర్ కృష్ణప్ప భీమప్ప కొలివాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యానించారు. సీనియర్ 73ఏళ్ల కృష్ణప్ప భీమప్ప స్వతంత్ర అభ్యర్థి శంకర్ చేతిలో పరాజయం పాలయ్యారు. లింగాయత్ లకు మైనారిటీ హోదా కల్పించవద్దని తాను కోరినా సీఎం వినలేదని ఆయన అన్నారు.

05/18/2018 - 12:51

బెంగళూరు: అసెంబ్లీలో బలనిరూపణకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సీఎం యడ్యూరప్ప తెలిపారు. బలపరీక్షపై సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పుపై ఆయన స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు అమలుపరుస్తాం. రేపు అసెంబ్లీ సమావేశంపై చీఫ్ సెక్రటరీతో సంప్రదించనున్నట్లు చెప్పారు. సభలో మెజారిటీని నిరూపిస్తామని యెడ్యూరప్ప పేర్కొన్నారు.

05/18/2018 - 12:49

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లోని ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లో పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందారు. బీఎస్‌ఎఫ్ జవాన్ సీతారం ఉపాధ్యాయ కూడా ప్రాణాలు కోల్పోయాడు. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతుంది.

05/18/2018 - 12:39

బెంగళూరు: కర్నాటకలో యడ్యూరప్ప ప్రభుత్వం శనివారంనాడే బల పరీక్ష నిరూపించుకోవాలని సుప్రీం కోర్టు పేర్కొంది. కాంగ్రెస్, జేడీఎస్ దాఖలుచేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈరోజు విచారణ ప్రారంభించి ఈ ఆదేశాలు జారీ చేసింది. యడ్యూరప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని కోరుతూ గవర్నర్‌కు సమర్పించిన లేఖను కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించటంతో ఏజీ రోహిత్గి ప్రవేశపెట్టారు.

Pages