S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/19/2019 - 23:07

జైపూర్, ఆగస్టు 19: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజస్థాన్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు మదన్ లాల్ సైనీ మృతితో ఖాళీ ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆ స్థానానికి నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మన్మోహన్ సింగ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు.

08/19/2019 - 23:01

జైపూర్, ఆగస్టు 19: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడాన్ని మునిగిపోతున్న నౌకను దాని కెప్టెన్ వదిలివేయడంగా బీజేపీ సీనియర్ నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్ అభివర్ణించారు. అధ్యక్ష పదవి బాధ్యతను సోనియా గాంధీకి అప్పగించడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. పదవుల మార్పిడిపై మాట్లాడిన ఆయన ‘ఇది అహ్మద్ టోపిని మహ్మద్‌కు...మహ్మద్ టోపిని అహ్మద్‌కు’ మార్చినట్లుగా ఉందన్నారు.

08/19/2019 - 22:58

జైపూర్, ఆగస్టు 19: ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ 2014లో అధికారం చేపట్టినప్పటి నుంచే దేశం అభివృద్ధి చెందుతోందన్న వ్యాఖ్యలను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోమవారం తీవ్రంగా ఖండించారు. ‘ఇది ఒక్కరోజులో వచ్చిన అభివృద్ధి కాదు.. మాజీ ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఆధునిక భారత్ కోసం పునాది రాయి వేశారని.. అప్పటి నుంచి దేశం అభివృద్ధి సాధిస్తూ వచ్చిందన్న సంగతిని గుర్తుంచుకోవాలని’ గెహ్లాట్ అన్నారు.

08/19/2019 - 22:56

పాట్నా, ఆగస్టు 19: బిహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా సోమవారం మృతి చెందారు. మిశ్రా సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. 82 ఏళ్ల పాతతరం నాయకుడైన మిశ్రాకు క్యాన్సర్ వ్యాధి రావడంతో దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స చేశారు. కాగా సోమవారం ఉదయం మిశ్రా తుది శ్వాస విడిచారు. ఈ వార్త తెలియగానే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దిగ్భ్రాంతి చెందారు.

08/19/2019 - 22:53

శ్రీనగర్, ఆగస్టు 19: జమ్మూ-కాశ్మీర్ క్రమంగా కుదుటపడుతోందని, శాంతి-భద్రతల ఉల్లంఘనకు సంబంధించి ఎలాంటి సంఘటనలు జరగలేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. క్రమంగా పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయని, ముఖ్యంగా కాశ్మీర్ లోయ ప్రాంతంలో కూడా శాంతి-భద్రతలు బలపడుతున్నాయని ప్రభుత్వ సీనియర్ అధికారి సయ్యద్ అస్గర్ సోమవారం నాడిక్కడ మీడియాకు తెలిపారు.

08/19/2019 - 22:51

చండీగఢ్, ఆగస్టు 19: ఢాకా హిమాలయ పర్వతశ్రేణుల్లో 1968లో కుప్పకూలిన భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-12 ట్రాన్స్‌పోర్టు విమాన శకలాల్ని ఎట్టకేలకు గుర్తించారు. 13రోజుల విస్తృత గాలింపు చర్యల అనంతరం ఆర్మీ ఈ శకలాలను గుర్తించింది. జూలై 26న డోగ్రా స్కౌట్ ఈ సాహస యాత్రకు నడుం బిగించించాలని నిర్ణయించింది. కులూ జిల్లాలోని రోహతంగ్ పాస్‌లోని మంచు కొండల్లో 1968 సంవత్సరం ఫిబ్రవరి ఏడో తేదీన కుప్పకూలిపోయింది.

08/19/2019 - 17:39

న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో ఏయిర్ ఇండియాకు నష్టం కలిగిస్తూ జరిగిన భారీ కుంభకోణం, అక్రమ నగదు చెలామణి కేసులో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంకు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈ కేసులో దర్యాప్తు నిమిత్తం ఈనెల 22న అధికారుల ఎదుట హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. 2008-09 మధ్య కాలంలో విదేశీ ప్రయివేటు విమాన సంస్థలకు ఎయిర్‌ స్లాట్స్‌ కేటాయించడంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి.

08/19/2019 - 17:38

న్యూఢిల్లీ: రిజర్వేషన్లపై ప్రస్తుతం ఎలాంటి చర్చ అవసరం లేదని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవతే చేసిన సూచనను ఆయన తోసిపుచ్చారు. ఏ వర్గాలు రిజర్వేషన్లు పొందుతున్నాయో ఆ రిజర్వేషన్ల జోలికి పోరాదని ఆయన అన్నారు. రిజర్వేషన్లు ఉండాలా?వద్దా? అనే అంశంపై చర్చ అవసరం లేదని అన్నారు.

08/19/2019 - 17:38

న్యూఢిల్లీ: రాజ్యసభకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన రాజస్థాన్ నుంచి నామినేషన్ వేశారు. ఎవ్వరూ నామినేషన్ దాఖలు చేయకపోవటంతో సోమవారంనాడు మన్మోహన్ సింగ్ ఎన్నికైనట్లు ప్రకటించారు. కాగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికవ్వటం పట్ల ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ అభినందిస్తూ ట్వీట్ చేశారు.

08/19/2019 - 17:37

జమ్మూకశ్మీర్: ఆర్టికల్ 370 రద్దు తరువాత అక్కడ నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అత్యున్నత సమావేశం నిర్వహించారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత దాదాపు రాష్ట్రంలో 11 రోజులు పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులపై జాతీయ భద్రతా సలహదారు అజిత్ దోవల్ నివేదిక సమర్పించారు. అలాగే అక్కడ విద్యాసంస్థలు, పలు కార్యాలయాలు తెరుచుకున్న తరువాత నెలకొన్న పరిస్థితులపై సమావేశంలో చర్చించారు.

Pages