S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/25/2018 - 02:08

ఛత్తార్‌పూర్ (మధ్యప్రదేశ్), నవంబర్ 24: గరీబీ హఠావో తప్పుడు వాగ్దానమని, బ్యాంకుల జాతీరుూకరణ కూడా పేదల పేరుతో జరిగిన ఓ పెద్ద దగా అంటూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారంనాడిక్కడ జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన మోదీ ‘పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పిన వారంతా అబద్దాలకోరులు కాదా..’అంటూ ప్రజల్ని ప్రశ్నించారు.

11/24/2018 - 16:05

జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. మాజీ ఎస్పీఓ బషత్ అహ్మద్‌ను ఉగ్రవాదులు శుక్రవారం అర్థరాత్రి కిడ్నాప్ చేసి హత్య చేశారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఎస్పీఓతో కిడ్నాప్ చేసిన మరో ఇద్దరు స్థానికులను విడిచిపెట్టారు.

11/24/2018 - 16:04

భోపాల్: గత 17ఏళ్ల నుంచి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న తనను ఎదిరించే దమ్ములేక తన తల్లిపై విమర్శలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనను, తన నాలుగేళ్ల పాలనను బేరీజు వేసుకుని ఓటు వేయాలని, ప్రతికూల రాజకీయాలను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్‌ను ఓడించాలని అన్నారు.

11/24/2018 - 16:01

భోపాల్: దేశంలోని ప్రతి భారతీయుడు గర్వించేలా పాక్‌పై మెరుపుదాడులు నిర్వహించామని కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మీడియా సమావేశంలో ఓ విలేకరి ఈ మెరుపుదాడులపై వ్యంగంగా ప్రశ్నించటంపై ఆమె మండిపడ్డారు. ఆ విలేకరి హిందీలో అడిగిన ప్రశ్న నాకు తెలుసని, నాకు హిందీ వచ్చునని అన్నారు.

11/24/2018 - 16:00

హుబ్లీ: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కాలువలోకి బస్సు దూసుకుపోయ 25 మంది జల సమాధి అయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది స్కూలు పిల్లలు ఉండటం గమనార్హం. మాండ్య నుంచి పాండవపుర వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు కనగణమరడి గ్రామంలో అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో 25మంది చనిపోయనట్లు భావిస్తున్నారు. తొమ్మిది మృతదేహాలను వెలికి తీశారు.

11/24/2018 - 12:45

లక్నో: ప్రధాని మోదీ తన వాగ్ధానాలను 50 శాతం కూడా నెరవేర్చలేకపోయారని, అందుకే మళ్లీ రామాలయ నిర్మాణాన్ని ముందుకు తెస్తున్నారని యూపీ మాజీ సీఎం మాయావతి ఆరోపించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఒకవేళ ఆలయ నిర్మాణం చేపట్టాలనే చిత్తశుద్ధి ఉంటే ఐదేళ్లలో నిర్మించేదని అన్నారు. కేవలం రాజకీయ ఉద్దేశ్యంతోనే మళ్లీ రామాలయ నిర్మాణాన్ని తెరపైకి తీసుకువస్తున్నారని ఆమె విమర్శించారు.

11/24/2018 - 12:53

వారణాసి: అయోధ్యలో ఆలయ నిర్మాణం మళ్లీ తెరపైకి వస్తుంది. విశ్వహిందూ పరిషత్‌తో పాటు శివసేన కూడా రంగంలోకి దిగింది. ఈ మేరకు ఆదివారంనాడు శివసేన భారీ ర్యాలీ నిర్వహించనున్నది. ఈ నేపథ్యంలో శివసేన చీఫ్ థాకరే అయోధ్యకు వస్తుండటంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

11/24/2018 - 07:13

కొచి: శబరిమల ఆలయంలో అన్ని వయస్సుల మహిళలకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రవేశం కల్పించేందుకు కేరళ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఈ ప్రతిపాదన ప్రకారం రెండు రోజుల పాటు మహిళా భక్తులకు ఆలయంలో ప్రవేశించి పూజలు చేసుకునేందుకు వీలు కల్పిస్తామని కేరళ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

11/24/2018 - 02:36

* అచ్చేదిన్ పారిశ్రామికవేత్తలకే * నిర్వేదంలో రైతులు, యువత
* ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభంజనమే * మధ్యప్రదేశ్ ర్యాలీల్లో రాహుల్ గాంధీ

11/23/2018 - 23:42

లాంగ్లే(మిజోరం), నవంబర్ 23: ఈశాన్య రాష్ట్రామైన మిజోరంలో శుక్రవారం ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను కాంగ్రెస్ ధ్వంసం చేసిందని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ విభజించి పాలించు విధానాన్ని దేశం యావత్తూ అర్థం చేసుకుందని లాంగ్లే జరిగిన ఎన్నికల సభలో మోదీ విరుచుకుపడ్డారు.

Pages