S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/17/2018 - 13:35

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ కాంగ్రెస్ పాఠ్టీపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత చిదంబరం సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గాంధీ కుటుంబేతర వ్యక్తిని నియమించవచ్చు కదా అని మోదీ చేసిన వ్యాఖ్యలపై చిదంబరం ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చారు.

11/17/2018 - 13:34

ముంబయ: ప్రముఖ నటుడు, యాడ్ ఫిల్మ్ మేకర్ అలెక్యూ షడసీ (93) ముంబయలో కన్నుమూశారు. ప్రముఖ చిత్రం గాంధీలో జిన్నా పాత్ర పోషించిన అలెక్యూ యాడ్ ఏజెన్సీ స్థాపించి ప్రఖ్యాతనొందారు. 2000 సంవత్సరంలో పద్మ శ్రీ దక్కింది. ఆయన మృతికి రాష్టప్రతి సంతాపం తెలిపారు. ఎన్నో ప్రముఖ యాడ్స్ రూపొందించారు.

11/17/2018 - 12:43

కర్నాటక: హుబ్లీ వద్ద జాతీయ రహదారి 63పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు చనిపోయారు. బస్సు, లారీ ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

11/17/2018 - 17:02

తిరువనంతపురం: కేరళలో బంద్ ప్రశాంతంగా జరుగుతుంది. సంఘ పరివార్‌కు చెందిన ఓ సీనియర్ మహిళ అయ్యప్ప దర్శనానికి వెళుతుండగా ఆమెను అరెస్టు చేశారు. ఆమె అరెస్టును నిరసిస్తూ సంఘ పరివార్, హిందూ సంస్థలు అందోళనకు దిగాయి. ఇదిలా ఉండగా అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించటం లేదని సంఘ పరివార్ నేతలు తెలిపారు.

11/17/2018 - 12:34

హైదరాబాద్: కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని శనివారంనాడు నామినేషన్ దాఖలు చేశారు. కూకట్‌పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఆమె రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వెంట నందమూరి బాలకృష్ణ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఉన్నారు.

11/17/2018 - 05:15

ఎన్నికలభూమి
===========
* ఆయన ప్రేమంతా పారిశ్రామికవేత్తలపైనే * మిగిలిన వారికీ రూ. 12 లక్షల కోట్ల రుణమాఫీకి యత్నం
* మధ్యప్రదేశ్ ఎన్నికల సభలో రాహుల్ విసుర్లు

11/17/2018 - 05:11

ఎన్నికలభూమి
===========

11/17/2018 - 01:33

నాగపట్నం/చెన్నై, నవంబర్ 16: ‘గజ’ తుఫాను నాగపట్నం-వేదారణ్యం వద్ద శుక్రవారం తెల్లవారుజామున తీరం దాటింది. దీని ప్రభావం వల్ల తమిళనాడు తీరం అల్లకల్లోలంగా మారింది. పలు ప్రాంతాల్లోకి వరద వచ్చింది. 13మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. కోస్తా ప్రాంతమంతా భారీ వర్షాలు కురిశాయి. రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

11/17/2018 - 01:30

న్యూఢిల్లీ, నవంబర్ 16: తెలంగాణ శాసనసభకు పోటీ చేసే మిగతా 19 మంది పార్టీ అభ్యర్థుల పేర్లను శనివారం ప్రకటిస్తామని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ కుంతియా ప్రకటించారు. కుంతియా శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు న్యాయం చేస్తామని అన్నారు.

11/17/2018 - 01:23

న్యూఢిల్లీ, నవంబర్ 16: తెలంగాణ శాసన సభకు జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆ పార్టీ నాయకురాలు, మాజీ ఎంపీ రేణుకా చౌదరి ఆరోపించారు. రేణుకాచౌదరి శుక్రవారం తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ కురుమ, యాదవ తదితర వెనుకబడిన కులాలు, కమ్మ సామాజిక వర్గానికి టిక్కెట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. ఒకే వర్గానికి పెద్ద పీట వేశారని ఆమె తీవ్ర ఆరోపణ చేశారు.

Pages