S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/19/2018 - 00:11

న్యూఢిల్లీ, నవంబర్ 18: మనవాళ్లు ఎక్కడికి వెళ్లినా తమదైన ముద్రతో రాణించేస్తారు! ఎలాంటి అంతర్జాతీయ కంపెనీకైనా సారథ్యం వహించి ఔరా అన్న రీతిలో వాటిని లాభాల బాట పట్టిస్తారు. ఇందుకు గూగుల్‌లో సుందర్ పిఛాయ్, మైక్రోసాఫ్ట్‌లో సత్య నాదెళ్ల, పెప్సీ సారథి ఇంద్రా నూయితో పాటు ఎందరో భారతీయులు నిలువుటద్దంగా నిలుస్తున్నారు.

11/19/2018 - 06:18

న్యూఢిల్లీ: సీబీఐలో కుమ్ములాటలు మరోసారి బహిర్గతమయ్యాయి. తనను తన మాతృ సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరోకు బదిలీ చేయడాన్ని సవాలు చేస్తూ ఒక సీబీఐ అధికారి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు అన్యాయం చేశారని, దురుద్దేశ్యంతో బదిలీ చేశారని ఆయన ఆరోపించారు. డిప్యూటీ ఎస్పీ హోదాలో పనిచేస్తున్న ఆ అధికారి పేరు అశ్విని కుమార్ గుప్తా.

11/18/2018 - 23:54

శబరిమల, నవంబర్ 18: మండల పూజ, తదుపరి మకర విళక్కు బ్రహ్మోత్సవాలు, పడిపూజల కోసం రెండు నెలలపాటు సాగే అత్యంత కీలకమైన సీజన్ కోసం మళ్లీ తెరుకున్న శబరిమల అయ్యప్ప కేత్రంలో రెండో రోజైన ఆదివారం సైతం ప్రశాంత వాతావరణం కనిపించింది.

11/18/2018 - 05:47

భోపాల్: నిజాన్ని దాచేవారే సీబీఐ దర్యాప్తుకు భయపడతారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.దాడులు, దర్యాప్తుకు సంబంధించి సీబీఐకి సాధారణ అనుమతి నిరాకరించాలని ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు నిర్ణయించిన నేపథ్యంలో శనివారంనాడిక్కడ మాట్లాడిన జైట్లీ ‘అవినీతి కేసుల్లో ఏ రాష్ట్రానికీ సార్వభౌమత్వం ఉండదు’అని అన్నారు.

11/18/2018 - 01:26

న్యూఢిల్లీ, నవంబర్ 17: పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, యువ నాయకుడు సుధీర్ రెడ్డి తమ పంతం నెగ్గించుకున్నారు. లక్ష్మయ్య, సుధీర్ రెడ్డి వాదనతో ఏకీభివంచిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జనగామ, ఎల్‌బీ నగర్ శాసనసభ సీట్లను ఇరువురు నాయకులకు కేటాయించారు. ఇదేవిధంగా తుంగతుర్తి ఎస్సీ టికెట్‌ను అద్దంకి దయాకర్‌కు ఇచ్చారు.

11/18/2018 - 04:58

రాయ్‌పూర్, నవంబర్ 17: చత్తీస్‌గఢ్‌లో అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే రైతుల రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. దీని కోసం అవసరమైన నిధులు విజయ్‌మాల్యా, నీరవ్ మోదీ, అనిల్ అంబానీ నుంచే లభిస్తాయని శనివారం ఇక్కడ ఓ ఎన్నికల సభలో స్పష్టం చేశారు.

11/17/2018 - 23:02

న్యూఢిల్లీ, నవంబర్ 17: ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్ పార్టీ రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోళ్లపై సంధించిన ప్రశ్నలకు బదులివ్వకుండా కాంగ్రెస్ చరిత్ర, అధ్యక్షుల పేర్ల గురించి అసందర్భంగా మాట్లాడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం అన్నారు. రాఫెల్ ఒప్పందంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని, దీనిపై నోరుమెదపాలన్నారు.

11/17/2018 - 22:36

న్యూఢిల్లీ, నవంబర్ 17: కోర్టు ఆదేశాల మేరకే పశ్చిమ బెంగాల్‌కు సంబంధించిన కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తోందని, ఏ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఆపలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.

11/17/2018 - 16:58

న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవజ్యోతి సింగ్ సిద్దూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సిద్ధూ చత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గోద్రా అల్లర్లలో పేర్లు ఉన్న వ్యక్తులకు తన దేశభక్తి గురించి వివరించాల్సిన అవసరం లేదని అన్నారు.

11/17/2018 - 16:58

కోల్‌కతా: దేశంలో మతవాదాన్ని రెచ్చగొట్టి విభజన రాజకీయాలకు బీజేపీ పాల్పడుతుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అన్నారు. ఆమె తృణమూల్ కాంగ్రెస్ ఏర్పాటుచేసిన కోర్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. బీజేపీ చేసేది రథయాత్ర కాదని రావణ యాత్ర అని అన్నారు. బీజేపీ రథయాత్ర పూర్తియిన వెంటనే దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో తాము పవిత్రయాత్ర చేస్తున్నామని వెల్లడించారు.

Pages