S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/20/2018 - 02:19

చిత్రాలు..పార్లమెంట్ హౌస్‌లో మాజీ ప్రధాని ఇందిరగాంధీకి సోమవారం నివాళులు అర్పిస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్.కె. అద్వానీ ప్రభృతులు
*ఇందిరాగాంధీ 101వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఆమె సంస్మరణ మ్యూజియం వద్ద జరిగిన

11/20/2018 - 02:15

గుర్గావ్, నవంబర్ 19: గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వహించడం వల్లే హర్యానా ఎంతో నష్టపోయిందని, ఎన్నో కీలక ప్రాజెక్టులు పూర్తికాకుండా పోయాయని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. కేపీఎమ్ ఎక్స్‌ప్రెస్ వే కుండ్లీ-మానేసర్ విభాగాన్ని సోమవారం నాడిక్కడ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన మోదీ హర్యానా అభివృద్ధి చరిత్రలో ఇది చాలా కీలకమైన రోజని అన్నారు.

11/20/2018 - 02:12

శబరిమల, నవంబర్ 19: అర్థరాత్రి అయ్యప్ప ఆలయం వద్ద అలజడి రేగింది. ప్రభుత్వం విధించిన ఆంక్షలను భక్తులు తీవ్రంగా నిరసించారు. ప్రశాంతంగా ఉండాల్సిన ఈ ప్రాంతంలో పోలీసుల బూట్ చప్పుళ్లు, ఈ పహారాలు ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన సంఘటనలను పురస్కరించుకుని ప్రభుత్వం పలుచోట్ల 144 సెక్షన్‌ను విధించింది. దీంతో ఆదివారం ఆలయ పరిసర ప్రాంతంలోని భక్తులను పోలీసులు ఖాళీ చేయించారు.

11/20/2018 - 02:09

పురుషుల నుంచి వేధింపులకు సంబంధించి ‘మీ టూ’ ఉద్యమం పేరిట మహిళలు పెద్ద సంఖ్యలో బయటికి వస్తున్న నేపథ్యంలో సోమవారం ఢిల్లీలో ఓ ఆసక్తికర ప్రదర్శన జరిగింది. ఈ ‘మీ టూ’ ఉద్యమానికి వ్యతిరేకంగా పురుషుల సంక్షేమ ట్రస్టు కార్యకర్తలు ప్రదర్శన జరిపారు. పురుషుల కోసం ఓ కమిషన్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

11/20/2018 - 02:07

న్యూఢిల్లీ, నవంబర్ 19: శబరిమల ఆలయంలోకి వయసుతో నిమిత్తం లేకుండా మహిళలందరినీ అనుమతించేందుకు మరింత సమయం కావాలని ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) సోమవారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం మహిళా భక్తులకు అవసరమైన కనీస ఏర్పాట్లు లేవనీ ఇటీవల సంభవించిన వరదల కారణంగా ఉన్న కొద్దిపాటి సౌకర్యాలకు కూడా నష్టం వాటిల్లిందని, అందువల్ల మహిళా భక్తులను అనుమతించేందుకు మరింత సమయం కావాలని స్పష్టం చేసింది.

11/20/2018 - 02:04

లక్నో, నవంబర్ 19: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియోజకవర్గమైన అమేథీలో రైతులకు ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన అరటిచెట్ల నారును అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో నుంచి ఎలాగైనా గెలుపొందాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తరచుగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ ఏడాదిలో పదివేల చీరలను మహిళలకు అందజేస్తానని ఆమె హామీ ఇచ్చారు.

11/20/2018 - 01:40

చిత్రాలు.. రాజస్థాన్‌లోని కిసాన్‌పూల్‌లో నామినేషన్ వేయడానికి వస్తున్న అమిన్‌కబ్జీ ( కాంగ్రెస్)

*బికనీర్‌లో నామినేషన్ దాఖలు చేస్తున్న సిద్ధికుమారి (బీజేపీ)

11/20/2018 - 01:37

జైపూర్, నవంబర్ 19: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధిస్తుందని పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు రెండు పార్టీల సిద్ధాంతాల మధ్య జరుగుతున్నాయని ఆయన అభివర్ణించారు. టాంక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న సచిన్ పైలట్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.

11/20/2018 - 01:33

రాయ్‌పూర్, నవంబర్ 19: చత్తీస్‌గఢ్‌లో మంగళవారం జరిగే రెండో దశ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. గిరిజనులు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో అనేక మంది అతిరధమహారథులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి, ఆయన కుటుంబ సభ్యులు ఇద్దరు, మాజీ ఐఏఎస్ ఓపీ చౌదరి, రాజుల కుటుంబానికి చెందిన టీఎస్ సింగ్‌దేవ్ సహా అనేక మంది ప్రముఖులు పోటీలో ఉన్నారు.

11/20/2018 - 01:29

నర్సింఘ్‌పూర్: మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌పై బీజేపీ చీఫ్ అమిత్‌షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘కాంగ్రెస్‌కు మోదీ ఫోబియా’ పట్టుకుందని షా వ్యంగ్యోక్తులు విసిరారు. మధ్యప్రదేశ్‌లోని సోమవారం ఓ ఎన్నికల సభలో ప్రసంగిస్తూ నెహ్రూ-గాంధీ కుటుంబం నాలుగు తరాలు దేశాన్ని పాలించినా అభివృద్ధి ఊసేలేదని ధ్వజమెత్తారు.‘ప్రతిపక్ష కాంగ్రెస్ మోదీ ఫోబియాతో బాధపడుతోంది.

Pages