S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/20/2018 - 16:50

న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె వచ్చే 2019 లోకసభ ఎన్నికల్లో పోటీచేయబోనని ప్రకటించారు. అనారోగ్య కారణాల రీత్యా పోటీ చేయటం లేదని, ఇందుకు నా మనసును సిద్ధం చేసుకున్నానని అన్నారు. సిదిశ నియోజకవర్గం నుంచి సుష్మా ఇప్పటి వరకు ఏడుసార్లు ఎంపీగా గెలిచారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. వివిధ కేంద్రమంత్రి పదవులను అధిష్టించారు.

11/20/2018 - 16:49

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్‌పై అనిల్‌కుమార్ అనే వ్యక్తి కారప్పొడితో దాడి చేశాడు. సచివాలయంలో సీఎం భోజనం చేసి గది నుంచి బయటకు వస్తుండగా అనూహ్యంగా ఈ దాడి జరిగింది. పావుకిలో కారప్పొడి పొట్లంతో దాడికి యత్నించాడు. ఈ సందర్భంగా భద్రతా సిబ్బందికి, ఆ వ్యక్తికి తోపులాట జరిగింది. కాగా దాడికి పాల్పడిన అనిల్‌కుమార్ భార్య సెక్రటేరియట్‌లో పనిచేస్తుంది.

11/20/2018 - 13:13

న్యూఢిల్లీ :సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ వాయిదా వేసింది. సీల్డ్ కవర్‌లో ఉన్న నివేదికలోని అంశాలు ఓ జాతీయ ఛానల్‌లో రావటంపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహాం వ్యక్తంచేసింది. సీవీసీ నివేదికపై మాకు వాదనలు వినిపించే అర్హత మీలో ఎవ్వరికీ లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగొయ్ ఆగ్రహాం వ్యక్తంచేశారు.

11/20/2018 - 12:45

జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్‌లో మంగళవారంనాడు భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా బలగాలకు, ఉగ్రవాదుల మధ్య చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పోషియన్ ప్రాంతంలో ఈ ఎదురు కాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో హతమైన ఓ పారా కమాండో ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయినట్లు ఆర్మీ ప్రతినిధి తెలిపారు.

11/20/2018 - 12:44

చెన్నై:ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో వాయుగుండం ముప్పు పొంచి ఉంది. రాగాల 24 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ డైరెక్టర్ బాలచంద్రన్ పేర్కొన్నారు. చెన్నైలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని పేర్కొంది. పుదిచ్చేరి, ఉత్తర తమిళనాడు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

11/20/2018 - 12:34

న్యూఢిల్లీ: ఢిల్లీలో జరుగుతున్న సీబీఐ పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రధాని మోదీ గుజరాత్ మిత్రులకు కోట్లలో ముడుపులు అందుతున్నాయని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందని ఆ ట్విట్టర్ పేర్కొన్నారు.

11/20/2018 - 17:02

ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లో తుదిదశ పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 72 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. లక్షమంది భద్రతా సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఉదయం 10 గంటల సమయానికి 12.54శాతం పోలింగ్ జరిగింది. ఈ ఓటింగ్‌లో మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి, ఆయన కుమారుడు అమిత్ జోగి పెంద్రా ప్రాంతంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 4.30 గంటల సమయానికి 58.47 శాతం పోలింగ్ జరిగింది.

11/20/2018 - 12:29

ముంబయి: మహారాష్ట్ర వార్దాలోని పుల్గాన్ ఆర్మీ డిపోలో సంభవించిన పేలుడులో ఐదుగురు మృతిచెందారు. మందుగుండు సామాగ్రిని నిర్వీర్యం చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా 12మంది గాయపడ్డారు. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

11/20/2018 - 04:02

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీకి ఏ కోశాన పోలికలేదని, పెద్ద నోట్ల రద్దు వంటి తుగ్లక్ నిర్ణయాన్ని ఏమాత్రం తీసుకుని ఉండేవారు కాదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ అన్నారు.

11/20/2018 - 02:40

న్యూఢిల్లీ, నవంబర్ 19: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సోమవారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి రెండు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితుల గురించి వివరించినట్లు తెలిసింది. నరసింహన్ ఈ మేరకు ఒక నివేదికను రాజ్‌నాథ్‌కు అందజేశారు. తెలంగాణలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నరసింహన్ హోం శాఖ మంత్రిని కలిసి నివేదిక ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది.

Pages