S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/17/2018 - 05:00

* తెరచుకున్న అయ్యప్ప ఆలయం * తృప్తి దేశాయ్‌ని అడ్డుకున్న పోలీసులు, భక్తులు

11/16/2018 - 23:46

న్యూఢిల్లీ, నవంబర్ 16: ఢిల్లీలో జరుగుతున్న మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో కొసోవో బాక్సర్ డొంజెటా సడికుకు ప్రాతినిధ్యం కల్పించనందున 2021లో నిర్వహించే పురుషుల వరల్డ్ చాంపియన్‌షిప్ నుంచి తాము వైదొలగుతామని ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఫెడరేషన్ (ఏఐబీఏ) భారత్‌ను హెచ్చరించింది. వాస్తవానికి ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ చాంపియన్‌షిప్‌లో 60 కేజీల విభాగంలో కొసోవో అథ్లెట్ డొంజెటా పాల్గొనాల్సి ఉంది.

11/16/2018 - 23:31

* కొన్ని అంశాలపై విచారణకు గడువు కావాలన్న సీవీసీ *19లోగా నివేదిక ఇవ్వాలని అలోక్‌వర్మకు ఆదేశం

11/17/2018 - 02:10

అంబికాపూర్ (చత్తీస్‌గఢ్), నవంబర్ 16: ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే నిజంగా నమ్మకం ఉంటే కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ కుటుంబం వెలుపల ఉన్న వ్యక్తిని అధ్యక్షుడిగా చేయగలరా అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధ్వజమెత్తారు.

11/16/2018 - 23:28

సాగర్ (మధ్యప్రదేశ్), నవంబర్ 16: దేశ భద్రత, శాంతి భద్రతలంటే కాంగ్రెస్‌కు పట్టవని, ఈ అంశం పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శించడం ఆ పార్టీకి అలవాటైందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దశాబ్ధాల తరబడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భద్రత అంశాన్ని తేలికగా తీసుకుందన్నారు.

11/16/2018 - 23:27

న్యూఢిల్లీ, నవంబర్ 16: అందరినీ అలరించిన కార్టూన్ కేరెక్టర్ మిక్కీవౌస్ ఆవిర్భవించి తొంబై సంవత్సరాలైన సందర్భంగా వాల్ట్‌డిస్సీ సంస్థ ప్రపంచలోనే అతిపెద్ద మాస్ పార్టీ (సామూహిక ఉత్సవాలు)ని నిర్వహించాలని నిర్ణయించింది. మిక్కీవౌస్ తొలుత 1928లో ‘స్టీమ్ బోట్ విల్లే’ అనే కార్టూన్ సినిమాతో వెండితెరపై హోయలొలికింది.

11/17/2018 - 02:12

కోల్‌కతా, నవంబర్ 16: దేశంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సీబీఐ, ఆర్‌బీఐ లాంటి వ్యవస్థలను మోదీ ప్రభుత్వం నాశనం చేస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సీబీఐ దర్యాప్తు అనుమతిని నిరాక రించాలని నిర్ణయంచడాన్ని ఆమె ప్రకటించారు. తాము కూడా సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వబోమని ఆమె తెలిపారు.

11/16/2018 - 17:43

న్యూఢిల్లీ: గజ తుపానుతో అల్లాడుతున్న తమిళనాడు రాష్ట్రానికి అండగా ఉంటామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. తమిళనాడు పరిస్థితులను సమీక్షించాల్సిందిగా కేంద్ర హోం సెక్రటరీ రాజీవ్ గౌబాను ఆదేశించామని అన్నారు. ఇదిలా ఉండగా గజ తుపాను మృతులకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల పరిహారాన్ని ప్రకటించింది.

11/16/2018 - 17:43

కోల్‌కతా: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రాష్ట్రంలో దాడులు, దర్యాప్తు చేసే అధికారాన్ని నిరాకరిస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత మద్దతు పలికారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సరైందేనని అన్నారు.

11/16/2018 - 17:42

కొచ్చి: అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటానని వచ్చిన సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ కొచ్చి విమానాశ్రయంలోనే ఉండిపోయారు. విమానాశ్రయం బయట వేలాది మంది భక్తులు బైఠాయించి అయ్యప్ప న్మామస్మరణ చేస్తూ ఆమెను విమానాశ్రయం నుంచి బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. ఆమె, ఆమె వెంట వచ్చిన బృందం ట్యాక్సీలను బుక్ చేసుకున్నా డ్రైవర్లు సైతం ముందుకు రాలేదు.

Pages