S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/20/2018 - 00:56

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏకి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయాలనుకున్న ప్రతిపక్షాల మహాకూటమిలో నాయకత్వ విభేదాలు నెలకొన్నట్లు తెలిసిందే. ఇందుమూలంగానే కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 22న ఢిల్లీలో నిర్వహించాలనుకున్న మహాకూటమి నేతల భేటీ వాయిదా పడింది.

11/20/2018 - 01:10

న్యూఢిల్లీ: సీబీఐలో అంతర్గత కమ్ములాటలు మరింత ముదిరి పాకాన పడ్డాయి. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ అస్థానాపై జరుగుతున్న దర్యాప్తులో కేంద్ర మంత్రి హరీభాయ్ పత్త్భీయ్ చౌదరి, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అలాగే సీవీసీ కేవీ చౌదరి జోక్యం చేసుకుంటున్నారని సీబీఐ డీఐజీ ఎంకే సిన్హా తీవ్ర ఆరోపణలు చేశారు. సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో సిన్హా అనేక సంచలనాత్మక ఆరోపణలు చేశారు.

11/19/2018 - 06:00

ఎన్నికల భూమి
==========
* మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి సానుకూల పరిస్థితులు

11/19/2018 - 05:57

ఎన్నికల భూమి
==========

11/19/2018 - 01:29

న్యూఢిల్లీ, నవంబర్ 18: తెలంగాణ శాసనసభకు పోటీ చేసే ఆరుగురు అభ్యర్థుల చివరిజాబితాను ఆదివారం రాత్రి ఏఐసీసీ విడుదల చేసింది. సీనియర్‌నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డికి టికెట్ లభించలేదు. వెనుకబడిన తరగతుల సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు మిర్యాలగూడ టికెట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.

11/19/2018 - 01:20

అమృతసర్, నవంబర్ 18: పంజాబ్‌లోని అమృతసర్‌లో ఆదివారం ఒక ప్రార్థనా మందిరం వద్ద బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా, పది మంది వరకు గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం అమృతసర్ జిల్లా రాజసన్సి గ్రామంలో స్థానిక ప్రార్థనా మందిరమైన నిరంకరి వద్దకు ఆదివారం సుమారు 200 మంది భక్తులు వచ్చారు.

11/19/2018 - 00:09

మహాసముంద్ (చత్తీస్‌గఢ్), నవంబర్ 18: దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ హయాంలో ఎంరో నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తులే కాక బయటివారు ఎందరో కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేశారన్న కాంగ్రెస్ వాదనను ప్రధాని నరేంద్ర మోదీ అపహాస్యం చేశారు.

11/19/2018 - 00:01

న్యూఢిల్లీ, నవంబర్ 18: దేశ వ్యాప్తంగా ఆరు హైకోర్టులకు 34 మంది న్యాయమూర్తులను నియమించినట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరిలో 28 మంది న్యాయమూర్తులను అలహాబాద్ హైకోర్టులో నియమించినట్లు తెలిపింది. ఈ మేరకు గత శనివారం నియామకాలు జరిగాయని, దేశంలో 24 హైకోర్టులకు 430 మంది న్యాయమూర్తుల కొరత ఉందని సంబంధిత అధికారులు తెలిపారు.

11/19/2018 - 00:00

న్యూఢిల్లీ, నవంబర్ 18: కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదని, ఒక వారసత్వ రాజకీయాలు, కుటుంబ పెత్తనంతో నడుస్తున్న సంస్థని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ధ్వజమెత్తారు. సంక్షేమ విధానాలు కాంగ్రెస్‌కు అవసరం లేదని, అధికార దాహం తప్ప మరొక ధ్యాస లేదని ఆయన అన్నారు. చిదంబరంతో సహా అనేక మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు ఏదో విధంగా తమ విధేయతను గాంధీ కుటుంబం పట్ల ప్రదర్శించేందుకు పోటీపడుతున్నారన్నారు.

11/18/2018 - 23:59

న్యూఢిల్లీ, నవంబర్ 18: భారత్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. పౌరుల ఆరోగ్యవంతమైన జీవితానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదం చేస్తోందని కితాబునిచ్చింది. ప్రపంచదేశాలన్నీ ఈ రకమైన స్వచ్ఛ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉందని, అందుకు భారత్ చేపట్టిన స్వచ్ఛ్భారత్ విజయమే ఉదాహరణ అని తెలిపింది.

Pages