S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/06/2018 - 16:04

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నాలుగు రాష్ట్రాలకు డిసెంబర్ 15లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తిచేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఓపి రావత్ వెల్లడించారు. ఇవాల్టి నుంచి ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని తెలిపారు.

10/06/2018 - 12:36

పూణె: సిగ్నల్ వద్ద ఆగివున్న వాహనాలపై భారీ హోర్డింగ్ కుప్పకూలటంతో నలుగురు వ్యక్తులు మృతిచెందారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని షాహిర్ అమర్‌షేక్ చౌక్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మృతిచెందిన వారిని కసర్ (70), షామ్ రావే ధోట్రె (48), శివాజీ పరదేశీ (40), జావేద్ ఖాన్ (40)గా గుర్తించారు.

10/06/2018 - 12:35

న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవికి, కుమారుడు తేజస్వి యాదవ్‌కు ఢిల్లీ కోర్టు సాధారణ బెయిల్ మంజూరుచేసింది. ఐఆర్‌సీటీసీ కుంభకోణం కింది సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని పాటియాల కోర్టులో జరిగిన విచారణకు రబ్రీదేవి, తేజస్వీ యాదవ్ హాజరయ్యారు.

10/06/2018 - 12:32

కోల్‌కతా: దుర్గాపూజకు రూ.28 కోట్లు కేటాయిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తీసుకున్న నిర్ణయానికి హైకోర్టులో చుక్కెదురు అయింది. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అడ్వకేట్ సౌరబ్‌దత్తా వేసిన ప్రజాప్రయోజన వాజ్యం పై హైకోర్టు శనివారంనాడు విచారణ జరిపింది. కోర్టు లేవనెత్తిన ప్రశ్నలకు తదుపరి విచారణలోగా సమాధానాలు చెప్పాలని కోర్టు ఆదేశిస్తూ స్టే విధించింది.

10/06/2018 - 12:30

న్యూఢిల్లీ: కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. తమిళనాడు, పుదుచ్చేరిలలో ఎడతెరప లేకుండా వర్షాలు కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈనెల 7వ తేదీన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు కేరళకు చేరుకున్నాయి. ఎత్తయిన పర్వత ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

10/06/2018 - 06:28

న్యూఢిల్లీ: అమెరికా బెదిరింపులను భారత్ ఏమాత్రం పట్టించుకోలేదు. రష్యాతో ఏకంగా ఎనిమిది ఒప్పందాలను కుదుర్చుకొని, ఈ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల విషయంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. రష్యా అధ్యక్షుడు వ్లాదమీర్ పుతిన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎస్-400 ఆకాశ క్షిపణులు, గగన్‌యాన్ తదితర మొత్తం ఎనిమిది ఒప్పందాలు చేసుకుని చరిత్ర సృష్టించారు.

10/06/2018 - 04:47

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఏగువన ఏర్పాడే నిల్వ జలాలపై మరోసారి అధ్యయనం చేయాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టుకు కేంద్ర స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిలిపివేయాలని ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌తో పాటు, ఇటీవల దాఖలు చేసిన పిటిషన్, రేలా అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ మదన్ బీ.

10/06/2018 - 04:45

గౌహతి, అక్టోబర్ 5: భారత ప్రజల్లో పాతుకుపోయి ఉన్న జాతీయభావం, సాంస్కృతిక అంశాల వల్ల ఆల్‌ఖైదా, ఐసిఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థలను మనం విజయవంతంగా తరిమికొట్టి వారికి స్థానం లేకుండా చేయగలిగామని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు.

10/06/2018 - 04:44

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో ఇరు దేశాలకు చెందిన యువత మధ్య ముఖ్యంగా పాఠశాల స్థాయి విద్యార్థుల మధ్య అన్యోన్యత ఎంతో ప్రధానమయిన పాత్ర పోషిస్తుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాన్ని అసాధారణ స్థాయికి తీసుకెళ్లడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు.

10/06/2018 - 01:32

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: తెలంగాణ అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు స్వేచ్ఛనిచ్చింది.

Pages