S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాతాదారుల కాక

కేంద్రం ప్రకటించిన పెద్ద నోట్ల కష్టాన్ని నిన్నటి వరకూ వౌనంగా భరించిన జనంలో క్రమంగా కాక పెరుగుతోంది. రోజుల తరబడిన కష్టాలు, క్యూలు పెరుగుతున్నాయే తప్ప తరగడం లేదన్న

మాజీ ఎయిర్ చీఫ్ త్యాగి అరెస్టు

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: దేశంలోని ప్రముఖుల (వివిఐపిల) కోసం 3,600 కోట్ల రూపాయలతో హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) శుక్రవారం భారత వైమానికదళ మాజీ ప్రధానాధికారి ఎస్‌పి.త్యాగీని అరెస్టు చేసింది. 2007లో పదవీ విరమణ పొందిన త్యాగీని ఈ కేసులో సిబిఐ గతంలోనే తీవ్రంగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ కేసులో త్యాగీతో పాటు అతని బంధువు సంజీవ్ అలియాస్ జూలీ త్యాగీ, న్యాయవాది గౌతమ్ ఖైతాన్‌ను కూడా సిబిఐ అరెస్టు చేసిందని అధికార వర్గాలు వెల్లడించాయి.

ఆరోగ్యశ్రీ పడకేసింది!

ఒంగోలు,డిసెంబర్ 9: ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటు, గృహనిర్మాణం లాంటి సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తూట్లు పొడుస్తున్నారని, ఆయన మెడలు వంచైనా ఆ పథకాలు అమలు చేయిస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆరోగ్యశ్రీ పథకం అమలవుతున్న తీరుకు నిరసనగా రాష్టవ్య్రాప్తంగా నిర్వహిస్తున్న భారీ ధర్నాల్లో భాగంగా శుక్రవారం ప్రకాశం జిల్లా ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద జరిగిన మహాధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆరోగ్యశ్రీ పథకం కోసం తీవ్రస్ధాయిలో ఉద్యమిస్తామని, చంద్రబాబుకు బుద్ధి వచ్చేంతవరకు గడ్డిపెడుతూనే ఉంటామని ఆయన అన్నారు.

మచిలీపట్నంలో క్షిపణి పరీక్ష కేంద్రం

న్యూఢిల్లీ, డిసెంబరు 9: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డీఒ) అధ్వర్వంలో మచిలీపట్నం వద్ద క్షిపణి పరీక్ష కేంద్రంతోపాటు లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం తెలిపింది. ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలోనే ఉందని కేంద్ర రక్షణ శాఖ వెల్లడించింది. క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటుకు సంబంధించి భూ సేకరణ ప్రతిపాదనను ఎపీ ప్రభుత్వానికి పంపినట్టు తెలిపింది. మచిలీపట్నం ఎంపీ కె నారాయణ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ భమరే ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

తవ్విన కొద్దీ నోట్ల కట్టలు

తిరుపతి/చెన్నై, డిసెంబర్ 9: టిటిడి ధర్మకర్తల మండలి సభ్యుడు, అన్నాడిఎంకె నాయకుడు, పారిశ్రామికవేత్త శేఖర్‌రెడ్డి, ఆయన బంధువుల ఇళ్ళలో శుక్రవారం రెండో రోజు కూడా ఎసిబి అధికారులు తనిఖీలు

ఓటుకు నోటు కేసులో బాబుకు ఊరట

హైదరాబాద్, డిసెంబర్ 9:ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఊరట లభించింది. ఈ కేసులో విచారణ జరిపించాలని ఏసిబి ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలపై చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. ఏసిబి కోర్టు ఆదేశాలను కొట్టివేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. వైకాపాకు చెందిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓటుకు నోటు కేసులో విచారణ జరిపించాలని ఏసిబి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేయడంలో ఏసిబి విఫలమైందని ఆయన కోర్టుకు తెలిపారు.

కోస్తాకు వార్ధా ముప్పు

విశాఖపట్నం, డిసెంబర్ 9: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘వార్ధా’ తుపాను స్థిరంగా కొనసాగుతోంది. ఇది రాగల 12 గంటల్లో (శనివారం మధ్యాహ్నానికి) తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి ప్రకటించారు. ప్రస్తుతం విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 950 కిలోమీటర్ల దూరంలోను, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 1,050 కిమీ దూరంగాలోను కేంద్రీకృతమై ఉంది. తుపానుగా మారిన అనంతరం వార్ధా భూ ఉపరితలంపైకి వచ్చి బలహీనపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వార్ధా తుపాను ఈ నెల 12న నెల్లూరు - మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది.

చట్టబద్ధత ఏమైంది?

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: రాష్ట్ర విభజన చట్టం కింద ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్యాకేజీకి వీలున్నంత త్వరగా చట్టబద్ధత కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరినట్లు తెలిసింది. ఆయన శుక్రవారం జైట్లీతో సమావేశమై రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన ప్యాకేజీతోపాటు ఇతర ప్రాజెక్టుల అమలు గురించి చర్చించారు. రాష్ట్రానికి కేటాయించవలసిన నిధులు, విడుదల చేయవలసిన బకాయిల గురించి కూడా జైట్లీతో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు మూలంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను కూడా కేంద్ర మంత్రి ముందు ఏకరువు పెట్టినట్టు తెలిసింది.

అసలు ఆలోచించారా?

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: దేశంలో కరెన్సీ కొరత హాహాకారాలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో కేంద్ర ధోరణిపై సుప్రీం కోర్టు నిప్పులు చెరిగింది. ఏ ఉద్దేశంతో కరెన్సీని ఉన్నపళంగా రద్దు చేశారు? అసలు దీనికో ప్రాతిపదిక అంటూ ఉందా? ఎంత కాలంలో సమస్య పరిష్కారం అవుతుందని భావించారంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. అంతే కాదు..పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అనుకున్నదే తడవుగా చేసేశారా లేక సమస్య తీవ్రతను ఊహించి బుర్రపెట్టి ఆలోచించే తీసుకున్నారా అంటూ అంటూ నిలదీసింది.

కరెన్సీ కష్టాలు తీర్చలేకే ‘కాష్‌లెస్’ ఇచ్చకాలు

అనుభవం అయితేగాని తత్వం బోధపడదు. నల్లకాసురవధ అనుకున్నంత తేలిక కాదని నరేంద్రమోదిగారికి పెద్దనోట్ల అనుభవం తరవాత బోధపడినట్టుంది. నల్ల డబ్బును పెల్లగించడం కోసమే ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లను ఉన్నపళాన రద్దు చేస్తున్నట్టు నవంబర్ 8న ఫెళఫెళార్భాటంతో ప్రకటించిన సర్కారువారి స్వరం అర్ధాంతరంగా మారింది. నగదు రహిత ఆర్థిక స్వర్గం కోసం కొత్త పలవరింత మొదలైంది.

ఎం.వి.ఆర్.శాస్ర్తీ

Pages