S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వామపక్ష ప్రభావిత జిల్లాల్లో డేగ కన్ను?

హైదరాబాద్, నవంబర్ 22: వామపక్ష పార్టీల ప్రభావిత జిల్లాల్లో పెద్ద నోట్ల మార్పిడికి ముమ్మర యత్నాలు సాగుతున్నాయి. రద్దయిన పాత నోట్లు చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు తరలుతున్నట్టు తెలుస్తోంది. కరెన్సీ మార్పిడిపై తెలంగాణ, ఆంధ్రా పోలీసులు దృష్టి సారిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రధానంగా మావోయిస్టుల ఆధిపత్యం ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టులు పెద్ద నోట్లు మార్చుకునేందుకు గిరిజన కూలీలను వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. బ్యాంకుల్లో లావాదేవీలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్టు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

స్టేట్‌బ్యాంక్‌కు కొత్త నోట్లు ఫుల్

హైదరాబాద్, నవంబర్ 22: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఎస్‌బిఐ, ఎస్‌బిహెచ్‌లకు కొత్త కరెన్సీ కట్టలు వచ్చిపడుతుండగా, ఇతర బ్యాంకులు నగదు లేక వెలవెలపోతున్నాయి. వారంలో 24 వేల రూపాయల వరకు విత్‌డ్రా చేసుకునే సౌకర్యం కల్పించినప్పటికీ, ఈ విధానం ఎస్‌బిఐ, ఎస్‌బిహెచ్‌లలోనే అమలవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఎస్‌బిఐ, ఎస్‌బిహెచ్‌లతో పాటు ఆంధ్రబ్యాంక్, ఐడిబిఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బిఓబి, కరూర్ వైశ్యాబ్యాంక్ తదితర పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు 25 వరకు ఉన్నాయి. అలాగే యాక్సిస్, ఐసిఐసిఐ తదితర ప్రైవేట్ బ్యాంకులు 19 వరకు ఉన్నాయి.

గ్రాఫిక్ డిజైనరే లీక్ వీరుడు

హైదరాబాద్, నవంబర్ 22: అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న బాహుబలి-2 చిత్రానికి సంబంధించిన ఓ వీడియో ఇటీవల లీకైంది. కొన్ని రోజులుగా ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. దాదాపు తొమ్మిది నిమిషాల నిడివి గల బాహుబలి-2 సన్నివేశాలు తస్కరించింది గ్రాఫిక్ డిజైనర్ కృష్ణ అని పోలీసుల దర్యాప్తులో తేలింది. అన్నపూర్ణ స్టూడియోలో బాహుబలి-2 ఎడిటింగ్ విభాగంలో కృష్ణ గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. వీడియో లీక్‌కు సంబంధించి చిత్ర నిర్మాతలు ఇటీవల జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డిజైనర్ కృష్ణను మంగళవారం విజయవాడలో అరెస్టు చేశారు.

నోట్ల మార్పిడికి యత్నించిన ఇద్దరు పోలీసుల అరెస్టు

హైదరాబాద్, నవంబర్ 22: నేరాలు, అవినీతిని అరికట్టాల్సిన వారే దారితప్పుతున్నారు. నగరంలోని పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సుబ్బయ్య, సునీల్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు భారీ మొత్తంలో రూ. 1000, రూ. 500 పెద్ద నోట్లు మార్చుతూ అడ్డంగా దొరికిపోయారు. వీరిద్దరినీ అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పంజగుట్ట పోలీసులు తెలిపారు.

నోట్ల రద్దుపై అఫిడవిట్

హైదరాబాద్, నవంబర్ 22:పెద్దనోట్ల రద్దుపై కేంద్రం రెండు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు మంగళవారం కేంద్రాన్ని ఆదేశించింది. నగరానికి చెందిన సయ్యద్ రియాజుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం విచారించింది. పెద్దనోట్లను రద్దు చేయడంవల్ల ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. అనేకమంది క్యూల్లో నిలబడి వత్తిడి తట్టుకోలేక మరణిస్తున్నారని పిటిషనర్ తరఫున న్యాయవాది తెలిపారు. కాగా ఈ అంశంపై రెండు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రంతోపాటు ఏపి, తెలంగాణ ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది.

విద్యార్థులకు నీలిచిత్రాలు చూపుతున్న ఉపాధ్యాయుడు

హైదరాబాద్, నవంబర్ 22: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే ఏకంగా నీలిచిత్రాలు చూపిస్తూ విద్యాపోషకుల ఆగ్రహాన్ని చవిచూశాడు. ఎల్‌బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోల్‌లో మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. నాగాల్‌లోని జనప్రియ ఒలంపియాడ్ స్కూల్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు వర్మ యూట్యూబ్‌లో విద్యార్థులకు నీలి చిత్రాలు చూపెడుతున్నాడు. ఈ విషయాన్ని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెలుపగా, వారు విద్యార్థి సంఘాలకు తెలిపారు. దీంతో ఆగ్రహం చెందిన విద్యార్థి సంఘాల ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయుడు వర్మను చితకబాదారు.

ప్రధాని మోదీ స్పందించారు

హైదరాబాద్, నవంబర్ 22: నోట్ల రద్దువల్ల రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం, సామాన్య ప్రజలు, రైతులు, అసంఘటిత వ్యాపారులు, చిరు వ్యాపారులకు తలెత్తిన ఇబ్బందులను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఇబ్బందులు తొలగించడానికి కేంద్రం చర్యలు చేపట్టిందని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు ఢిల్లీ పర్యటన విశేషాలను వివరించారు. నోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఆదాయ వనరులు ఏవిధంగా దెబ్బతిన్నాయో వివరించడంతో అధ్యయనానికి కేంద్ర బృందాలను రాష్ట్రాలకు వెంటనే పంపించాల్సిందిగా ప్రధాని ఆదేశించారని గవర్నర్‌కు వివరించారు.

అనుకరిస్తూ..అనంతలోకాలకు..

కరీంనగర్, నవంబర్ 22: రియాల్టీషో మోజు ఓ బాలుడి ప్రాణం తీసింది. యూట్యూబ్‌లో ఉన్న ఓ వీడియో సాహస దృశ్యాన్ని అనుకరిస్తూ చేసిన ప్రయోగం వికటించి తిరిగిరాని అనంతలోకాలకు వెళ్లిన సంఘటన విషాదాన్ని నింపిం ది. మంటల్లో చిక్కుకుని కాలిన గాయాలతో ఐదురోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన కోడూరి ఘనశ్యాం (12) అనే బాలు డు చివరకు మంగళవారం ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన కరీంనగర్‌లో కలకలం రేపింది.

మావోల నగదు పట్టివేత

చర్ల, నవంబర్ 22: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని తాలిపేరు ప్రాజెక్టు వద్ద మంగళవారం ఇరువురు మావోయిస్టు సానుభూతపరులను అరెస్టు చేసినట్లు వెంకటాపురం సిఐ సాయిరమణ తెలిపారు. వారివద్ద నుంచి మావోయిస్టులకు సంబంధించిన రూ.70వేల నగదుతో పాటు ఇతర వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు.

కరవు తీరాలంటే కాలువలు తీయాల్సిందే..

రామాయంపేట, నవంబర్ 22: వలసల బతుకులు మారాలన్నా..కరవు బాధలు తీరాలన్నా కాలువలు తవ్వాల్సిందేనని మంత్రి హరీశ్‌రావు అన్నా రు. మంగళవారం మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి సిసి రోడ్డు, ఫీడర్‌చానల్, కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపనలు, సబ్ మార్కె ట్ యార్డు ప్రారంభోత్సవం చేసి సమావేశంలో మంత్రి మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను బాగుచేయాలని ప్రభుత్వం సంకల్పించి ప్రాజెక్ట్‌లు నిర్మించి కాలువల ద్వారా రైతాంగానికి నీరందించే ప్రయత్నం చేస్తుందన్నారు.

Pages