S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గళం’తో గాన వర్షం కురిపించిన మంగళంపల్లి

హైదరాబాద్, నవంబర్ 22: ప్రపంచమంతా గర్వించదగిన సంగీత కళానిధి, సంగీత బ్రహ్మ. ‘సళలిత రాగసుధా...’ అంటూ కొత్తకొత్త రాగాలను సృష్టించిన స్వర మాంత్రికుడు, పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణకు భాగ్యనగరంతోవీడని బంధముంది. ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు అని పలువురు జంట నగరాల కళాకారులు, కళాకోవిధులు, వివిధ సాంస్కృతిక సంస్థల నిర్వాహకులు వ్యాఖ్యానించారు.

వంద నోట్లు ..వెయ్యి పాట్లు

హైదరాబాద్, నవంబర్ 22: బ్యాంకు ఖతాల్లో మూలుగుతున్న సొంత డబ్బు... అవసరానికి తగినంత డ్రా చేసుకునే అవకాశం లేదు. ఏటిఎం ద్వారా రోజుకి కేవలం రూ. 2వేలు మాత్రమే డ్రా చేసుకునే అవకాశముండటంతో ఖాతాదారులు వంద నోటు కోసం కోటి కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా పధ్నాలుగు రోజుల క్రితం ఈ నెల 8న పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటంలో విఫలం కావటంతో సామాన్యులకు తిప్పలు తప్పటం లేదు. వెయ్యి, 500 నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగా రూ. 500 కొత్త నోటును అందుబాటులోకి తేకపోవటం, గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.

ధర్మయుద్ధం సభకు పెద్ద ఎత్తున తరలి రండి

నల్లకుంట, నవంబర్ 22: డా.బాబా సాహేబ్ అంబేద్కర్ పోరాడి సాధించిన రిజర్వేషన్లు వారివారి జనాభా దామాషా ప్రకారం అందాలని ఆనాడే అంబేద్కర్ తెలిపారని, రిజర్వేషన్‌ల ఫలాలు అందరికీ సమానంగా అందడం కోసమే ఎమ్మార్పీఎస్ ఉద్యమం చేపట్టిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ నెల 27న మాదిగల ధర్మయుద్ధం పేరిట నిర్వహించ తలపెట్టిన మహాసభను విజయవంతం చేయాలని మాదిగ విద్యార్ధుల సమాయత్త సభ అంబర్‌పేట డిడి కాలనీలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో ఎంఎస్‌ఎఫ్ నగర జిల్లా అధ్యక్షుడు ఈరెంటి విజయ్ మాదిగ అధ్యక్షతన నిర్వహించారు.

‘స్వచ్ఛ’కార్యక్రమాల పర్యవేక్షణకు టాస్క్ఫోర్స్

హైదరాబాద్, నవంబర్ 22: నగరాన్ని మరింత ‘స్వచ్ఛ‘గా తీర్చిదిద్దటంతో పాటు దేశంలోనే నెంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దేందుకు జిహెచ్‌ఎంసి కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే! అయితే స్వచ్ఛ భారత్‌లో భాగంగా చేపడుతున్న కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేక సిటీ టాస్క్ఫోర్సును ఏర్పాటు చేయాలని జిహెచ్‌ఎంసి నిర్ణయించింది. ఈ కమిటీకి మేయర్ బొంతు రామ్మోహన్ చైర్మన్‌గా వ్యవహారించనున్నట్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌పై మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశానికి మయర్ రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డితో పాటు అదనపు, జోనల్ కమిషనర్లు, మెడికల్ ఆఫీర్లు పాల్గొన్నారు.

వరుస సమీక్షలతో సందర్శకులకు తప్పని పాట్లు

హైదరాబాద్, నవంబర్ 22: మెరుగైన సేవల పేరిట జిహెచ్‌ఎంసిలో ఏకంగా 13రోజుల పాటు జరిగే వరుస సమీక్షలు మొదలయ్యాయి. జిహెచ్‌ఎంసి కమిషనర్‌గా డా.బి.జనార్దన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయింది. గడిచిన ఏడాది కాలంలో కమిషనర్ వివిధ విభాగాల పనితీరును క్షుణ్ణంగా గమనించి, సిబ్బంది పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవటం వల్లే మెరుగుపరిచేందుకు ఈ మేదోమథనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు.

ప్రజల సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించాలి

నార్సింగి, నవంబర్ 22: గ్రామాల్లో ఏమైనా సమస్యలుంటే మండల అధికారులు వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కార చర్యలు చేపట్టాలని రంగారెడ్డిజిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు అన్నారు. మండల పరిధిలోని గ్రామాల్లో నెలకొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి వారంవారం నివేదించాలనే సంకల్పంతో (ఎంటిఎం) ప్రతి మంగళవారం నిర్వహించే ప్రత్యేక సమావేశం మొదటిసారిగా గండిపేట మండల కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ విచ్చేశారు. ఈ సమావేశంలో మండలంలో నెలకొన్న సమస్యలను ఆయా శాఖల అధికారులను ముందుగా అడిగి తెలుసుకున్నారు.

రిజిస్ట్రేషన్‌లపై పెద్ద నోట్ల ప్రభావం

నార్సింగి, నవంబర్ 22: కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లు రద్దుతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలపోతున్నాయి. రెండు వారాల క్రితం కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లును రద్దు చేసింది. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా పలు వ్యాపార సంస్థలు అయితే మూతపడే అవకాశాలు వచ్చాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కూడా గత రెండు వారాలుగా రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో వెలవెల బోతున్నాయి. పెద్ద నోట్లు రద్దుతో భూముల అమ్మకాలు, కొనుగోలు కూడా భారీగానే నిలిచిపోయాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా నష్టం వచ్చే ప్రమాదం ఉందని పలువురు పేర్కొన్నారు.

మేడ్చల్ పట్టణ రోడ్లపై చెత్త వేస్తే జరిమానా

మేడ్చల్, నవంబర్ 22: మేడ్చల్ పట్టణంలోని పలు ప్రదేశాల్లో బహిరంగంగా చెత్తవేస్తే జరిమానా తప్పదని నగర పంచాయతీ కమిషనర్ కె. రామిరెడ్డి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బందితో ఆయా ప్రదేశాల్లో సూచికబోర్డులను ఏర్పాటు చేయించారు. పట్టణ ప్రధాన కూడలి అంబేద్కర్ విగ్రహాం నుండి రైల్వేస్టేషన్ వరకు గల రోడ్డుతో పాటు తహశీల్దార్ కార్యాలయం రోడ్డుపై ఎవరైనా బహిరంగంగా చెత్తను పారబోస్తే వారికి రూ. 500 నుండి 5 వేల వరకు జరిమానా విధించనున్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా పెద్ద చెరువుకట్ట, తుమ్మ చెరువు, రామునికుంట ప్రదేశాలలో బహిరంగ మల, మూత్ర విసర్జన చేసిన వారికి రూ. 500 జరిమానా విధిస్తామని వివరించారు.

ప్రముఖుల సంతాపాలు

హైదరాబాద్, నవంబర్ 22: ప్రముఖ సంగీత విద్వాంసుడు బాలమురళీకృష్ణ మరణం తెలుగు రాష్ట్రాలకే కాదు..మొత్తం దేశానికి..సంగీత ప్రపంచానికే తీరనిలోటు అని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇఎస్‌ఎల్‌ఎన్ నరసింహన్ అన్నారు.
భారతీయ శాస్ర్తియ సంగీతం గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి బాలమురళీకృష్ణ అని, ఆయన మృతి సంగీత ప్రపంచానికే తీరని లోటని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు.ప్రపంచానికే గొప్ప సంగీత విద్వాంసుడు బాలమురళీ కృష్ణ అని ఆయన మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని ఏపి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు.
* మంగళంపల్లి తెలుగు జాతికే ఆణిముత్యం.

చిన్నబోయిన శంకరగుప్తం!

మలికిపురం, నవంబర్ 22 : ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు పద్మశ్రీ, పద్మవిభూషణ్, వెనీలియార్, గానగాంధర్వ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ మరణవార్తతో ఆయన స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం శంకరగుప్తంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 1930వ సంవత్సరం జులై 6న మంగళంపల్లి పట్ట్భారామయ్య, సూర్యకాంతం దంపతులకు ఏకైక సంతానంగా జన్మించిన బాలమురళీ తన తాత త్రైయ్యాగ రంగదాసు ప్రొత్సాహంతో 7వ ఏటనే విజయవాడలోని కారుపల్లి రామకృష్ణయ్యపంతులుగారి వద్ద సంగీత సాధనచేశారు. 8వ సంవత్సరం నుండే కచేరీలు ప్రారంభించిన మురళీకృష్ణను బాలమురళీకృష్ణగా పిలుచుకోవడం ప్రారంభించారు.

Pages