S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పన్న సేవలో కంచిస్వామి

సింహాచలం, నవంబర్ 22: కంచి కామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి మహాస్వాములు మంగళవారం సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో కె. రామచంద్రమోహన్ అర్చక పరివారంతో కలిసి స్వాములకు సంప్రదాయంగా స్వాగతం పలికారు. ఆలయం బేడమండపంలో ప్రదక్షిణ చేసిన స్వాములు అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. గోదాదేవి సన్నిధిలో స్వాములు హారతులు స్వీకరించారు. అనంతరం నాదస్వర వాయిద్యాలు, పండితుల మంత్రోచ్చరణల నడుమ అర్చకులు వేద స్వస్తి పలికారు. ఈవో స్వామీజీలకు ప్రసాదాలను, శేషవస్త్రాలను, సింహాచలేశుని చిత్రపటాన్ని అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు.

బాలమురళితో రామదాసుకు జీవం

భద్రాచలం, నవంబర్ 22: భక్తరామదాసు ఆ రాముడిపై కీర్తనలు రచిస్తే వాటికి తన శ్రావ్యమైన గొంతుతో మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రాణం పోశారు. 2011లో వాగ్గేయకారోత్సవాల సందర్భంగా ఆయన భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ఆస్థాన విద్వాంసులుగా నియమితులయ్యారు. రామదాసు కీర్తనలకు వ్యాప్తి, కీర్తి తీసుకువచ్చిన వారు బాలమురళే. రామదాసు కీర్తనలను అనేకం స్వరపరచి మృదుమధురంగా ఆలపించి లోకానికి అందించిన స్వరబ్రహ్మ మంగళంపల్లి. ఆయన ఆలపించిన అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి, పలుకే బంగారమాయెనా, తారక మంత్రము కోరిన దొరికెను, సీతమ్మకు చేయిస్తి లాంటి ఎన్నో రామదాసు కీర్తనలు భద్రాచల గోదావరీ తీరంలో ఎప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి.

జాతీయ ఉన్నత విద్యాసంస్థల్లో సీట్ల కేటాయింపునకు ప్రత్యేక బోర్డు

హైదరాబాద్, నవంబర్ 22: దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటిలు, ఎన్‌ఐటిలలో అడ్మిషన్ల వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కేంద్రప్రభుత్వం ఐదుగురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీకి మాలవీయ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎన్‌ఐటి) డైరెక్టర్ డాక్టర్ ఆర్ వై ఉదయ్‌కుమార్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో మానవ వనరుల మంత్రిత్వశాఖలో ఐఐటిల వ్యవహారాలు చూసే డైరెక్టర్, ఎన్‌ఐటిల వ్యవహారాలు చూసే డైరెక్టర్, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నామినీ, సిబిఎస్‌ఇ ప్రతినిధి, అఖిల భారత సాంకేతిక విద్యాసంస్థ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు.

హైదరాబాద్‌లో 25నుంచి డిజిపిల సదస్సు

హైదరాబాద్, నవంబర్ 22: ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మూడురోజుల పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో దేశంలోని వివిధ రాష్ట్రాల డిజిపిల సదస్సు జరుగుతుంది. ఈ సదస్సును 25వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించే అవకాశాలున్నాయి. ఒక వేళ ప్రధానమంత్రి రాని పక్షంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వస్తారు. ఈ సదస్సులో ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదంతో పాటు దేశం అంతర్గత భద్రతాపరంగా ఎదుర్కొంటున్న పలు సవాళ్లపై పోలీసు ఉన్నతాధికారులు చర్చించనున్నారు. మూడు రోజుల పోలీసు డిజిపిల సదస్సు నేపథ్యంలో పోలీసు అకాడమీని పోలీసు బలగాలు, ఎన్‌ఎస్‌జి బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పిటిషన్‌పై ముగిసిన వాదనలు

హైదరాబాద్, నవంబర్ 22: ఓటుకు నోటు కేసులో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. ఏసిపి ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. ఏసిబి కోర్టులో ఈ కేసును విచారించాలంటూ వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు తాజా దర్యాప్తుకు ఆదేశించింది. దీనిని సవాలు చేస్తూ ఏపి సిఎం చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి కోర్టు ఏసిబి కోర్టు ఆదేశాలపై స్టే విధించింది.

బాల్యంనుంచి చివరి దాకా..

విజయవాడ (కల్చరల్), నవంబర్ 22: స్వర మాంత్రికుడు పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గానం మూగవోయింది. ఏకసంతాగ్రాహి అయిన ఆయనను వరించని బిరుదు, అవార్డులు, పురస్కారాలు లేవనే చెప్పుకోవాలి. దాదాపు ఏడు, ఎమినిది సంవత్సరాల వయసులోనే విజయవాడ నగరానికి వచ్చి గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య పంతుల వారి వద్ద శిష్యునిగా చేరారు. అప్పటికే ఆయన సంగీత కచేరీలు చేస్తూ బాలగంధర్వునిగా అందరి ప్రశంసలను పొందుతున్నారు.

అపర త్యాగరాజు మంగళంపల్లి

చెన్నై, నవంబర్ 22: బాల్యంలోనే మొగ్గ తొడిగిన విద్వత్తు ఆయన. సంగీతం అంటే ఏమిటో తెలియని వయసులోనే రాగం, తానం, పల్లవిని ఆయన ఔపోసన పట్టారు. సంగీతానికి సంబంధించిన సమస్త ప్రక్రియల్లోనూ అందెవేసిన చెయ్యిగా విశ్వవిఖ్యాతినార్జించిన సంగీత స్రష్ట మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ఏ ప్రక్రియ చేపట్టినా స్వరం మాధుర్యం కరతలామలకమయ్యేది. ప్రపంచవ్యాప్తంగా కోటానుకోట్ల మంది రసజ్ఞుల హృదయాలను తనదైన గాత్రమాధుర్యంతో అలరించటంతో పాటు ఎన్నో వినూత్న ప్రక్రియలకు శ్రీకారం చుడుతూ, ఇది తన స్వరం, తన గళం, తన గాత్రం అంటూ చాటి చెప్పిన నవ్య రాగ సృష్టికర్త ఆయన.

నోట్ల రద్దు..ఓ కుట్ర

గుంటూరు, నవంబర్ 22: కేంద్రప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెనుక పెద్ద కుంభకోణమే ఉందని ఎపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ఆరోపించారు. మంగళవారం గుంటూరు మార్కెట్ సెంటర్‌లో ఎటిఎం కేంద్రాలను పరిశీలించి, చిరువ్యాపారుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్య ప్రజానీకంతో పాటు చిరువ్యాపారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రద్దు కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

బాధితులకు అండగా ఉంటా

కాకినాడ, నవంబర్ 22: దివీస్ మందుల కంపెనీని ప్రజా నిరసనల మధ్య బలవంతంగా నిర్మించిన పక్షంలో తాను అధికారంలోకి వచ్చిన తరువాత ఫ్యాక్టరీని తొలగిస్తానని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు. దివీస్ యాజమాన్యం తక్షణం నిర్మాణ పనులు మానుకుని వేరేచోటకు తరలిపోవాలని, లేని పక్షంలో బాధితుల పక్షాన నిలబడి, పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేట గ్రామంలో మంగళవారం సాయంత్రం దివీస్ మందుల ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిర్వహించిన బహిరంగ సభకు జగన్ హాజరయ్యారు. పెద్ద ఎత్తున దివీస్ బాధితులు ఈ బహిరంగ సభకు తరలిరాగా జగన్ ప్రసంగించారు.

చిల్లర ఎక్కడ?

కాకినాడ, నవంబర్ 22: పెద్దనోట్ల రద్దుతో చిల్లర సమస్యను తీర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందిన ప్రభుత్వం, బ్యాంకులు ఇందుకు ప్రత్యామ్నాయంగా రూపే, డెబిట్ కార్డులను తప్పనిసరిగా వాడాలంటూ ప్రజలపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. నగర, పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగ, వ్యాపార వర్గాల వద్ద మాత్రమే చలామణీలో ఉన్న డెబిట్ కార్డులను ఒక్కసారిగా పేద, మధ్య తరగతి వర్గాలపై రుద్దాలని చూడటం ఎంతమాత్రం సబబు కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నోట్ల రద్దు, చిల్లర నోట్లు లభించకపోవడంతో దిగాలు పడ్డ సామాన్యులకు ఈ సాంకేతిక ప్రయోగం శిరోభారంగా మారిందని వాపోతున్నారు.

Pages