S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంపీల జీతాల పెంపుపై ప్రభుత్వం పరిశీలన

న్యూఢిల్లీ, ఆగస్టు 30: పార్లమెంట్ సభ్యుల జీతాల్ని పెంచే అంశాన్ని ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోంది. ఎంపీల జీతాలు, అలవెన్స్‌ల పెంపుపై ఏర్పాటయిన సంయుక్త పార్లమెంటరీ ప్యానల్ ముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన తుది ముసాయిదాపై కసరత్తు మొదలైందని, ఈ తతంగం పూర్తయిన తర్వాత ప్రధాన మంత్రి పరిశీలనకు జీతాలు పెంపు నివేదికను పంపుతామని అధికార వర్గాలు తెలిపాయి.

ఫోన్ ట్యాపింగ్ దుర్మార్గం

హైదరాబాద్, ఆగస్టు 30: చంద్రబాబునాయుడు కార్యాలయం మీద, అధికారుల మీద, వ్యక్తిగత సిబ్బంది మీద టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిన విధానం దుర్మార్గమైనదని టిడిపి నేత జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు. ఇలాంటి కేసులు గతంలో కొన్ని ప్రభుత్వాలనే కూల్చివేశాయని, తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంపై పనిచేస్తున్న నేపథ్యంలో టిడిపి ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి టిఆర్‌ఎస్ చేసిన ఆకృత్యాలు అందరికీ తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 1999లో రామకృష్ణహెగ్డే ప్రభుత్వం కూలిపోలేదా? తప్పుడు కేసులు ఎన్ని పెట్టాలని చూసినా వారే జై లుకు వెళ్తారని గుర్తుంచుకోవాలని ప్రభాకర్ పేర్కొన్నారు.

వారానికి రెండు సార్లు అగ్రిగోల్డ్ కేసు విచారణ: హైకోర్టు

హైదరాబాద్, ఆగస్టు 30: అగ్రిగోల్డ్‌కేసును త్వరితగతిన పరిష్కరించేందుకు వీలుగా వారానికి రెండు సార్లు కేసును విచారిస్తామని హైకోర్టు మంగళవారం ప్రకటించింది. దీని వల్ల డిపాజిటర్లకు వెంటనే వారి సొమ్ము చెల్లించేందుకు వీలవుతుందని కోర్టు పేర్కొంది. జస్టిస్ వి రామసుబ్రహ్మణియన్, జస్టిస్ ఎస్‌బి భట్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. అగ్రిగోల్డ్‌తరఫున సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ వాదనలు వినిపిస్తూ, తమ సంస్థ ఆస్తులను తాము వేలం వేస్తే ఎక్కువ సొమ్ము వస్తుందని, దీనికి అనుమతి ఇవ్వాలని కోరారు. దీని వల్ల డిపాజిటర్లకు వెంటనే సొమ్ము చెల్లించేందుకు వెసులుబాటు కలుగుతుందన్నారు.

అమరావతి నిర్మాణంపై విచారణ

న్యూఢిల్లీ, ఆగస్టు 30: కృష్ణానది కరకట్ట అనుకుని రాజధాని నిర్మాణం ప్రమాదకరమని, కృష్ణానదికి, కొండవీటి వాగుకు వరదలొస్తే అమరావతికి పెనుముప్పు వాటిల్లుతుందని రాజధాని నిర్మాణానికి వ్యతిరేకంగా దాఖలై పిటిషన్ల తరఫున న్యాయవాది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి)లో వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కేసు విచారణను గ్రీన్ ట్రిబ్యునల్ సెప్టెంబర్ 9 తేదీకి వాయిదా వేసింది. నూతన రాజధాని నిర్మాణంపై శ్రీమన్నారాయణ, కమలాకర్, బొలిశెట్టి సత్యనారాయణ, శర్మలు పిటిషన్లు దాఖలు చేశారు.

వ్యూహాత్మకంగా ముందుకు

హైదరాబాద్, ఆగస్టు 30: ఆంధ్రప్రదేశ్‌లో కాపు సమాజానికి రిజర్వేషన్లు సాధించేంత వరకూ ఉద్యమాన్ని ఆపేది లేదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తేల్చిచెప్పారు. తమ ఆందోళనను కొత్త పంథాలో ముందుకు తీసుకు వెళ్లేందుకు గత రెండు నెలలుగా ముమ్మరంగా కాపు నేతలతోనూ, ఇతర కులాల నేతలతో చర్చలు జరుపుతున్న ముద్రగడ పద్మనాభం మంగళవారం నాడు దాసరి నారాయణ రావు, చిరంజీవి, బొత్స సత్యనారాయణ, మాజీ కేంద్రమంత్రి పల్లంరాజు, అంబటి రాంబాబులతో సమావేశం అయ్యారు. తనతో పాటు కాపునేతలు యేసుదాసు వాసిరెడ్డి, ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, తోట రాజీవ్ తదితరులను తీసుకువెళ్లారు.

ఓటుకు నోటు కేసు

హైదరాబాద్, ఆగస్టు 30: తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఏసిబి కోర్టు దర్యాప్తుపై నివేదిక కోరడంతో, తెలంగాణ ఏసిబి కేసు విచారణకు కసరత్తు చేపట్టింది. సెప్టెంబర్ 29లోగా విచారణ పూర్తిచేసి సమగ్ర నివేదికను సమర్పించేందుకు అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఏసిబి కోర్టు ఆదేశానుసారం తాజాగా చార్జిషీట్ దాఖలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఏపి సిఎం చంద్రబాబు స్వరపరీక్షకు కోర్టు ద్వారా నోటీసు ఇవ్వాలని ఏసిబి యోచిస్తున్నట్లు తెలిసింది.

ఆ ఐదుగురే కీలకం?

హైదరాబాద్, ఆగస్టు 30: గ్యాంగ్‌స్టర్ నరుూమొద్దీన్ అలియాస్ నరుూం అక్రమ వ్యవహారాలపై సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నరుూం ఎన్‌కౌంటర్ తరువాత నరుూం అనుచరుల కోసం సిట్ అధికారులు వేటాడుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు అరెస్టయిన 50 మందిలో నరుూం అనుచరులు, బంధువులు మాత్రమే ఉన్నారు. కానీ ముఖ్య అనుచరుడు శేషన్నతోపాటు మరో నలుగురే ఈ కేసులో కీలకమని సిట్ అధికారులు తేల్చేశారు. వీరు దొరికితే నరుూం కేసు ఓ కొలిక్కి వచ్చినట్టేనని సిట్ అధికారి ఒకరు తెలిపారు.

‘కరవుపై యుద్ధానికి విద్యార్థులు’

కర్నూలు, ఆగస్టు 30: రాష్ట్రంలో ఎక్కడ కరవు పరిస్థితులు నెలకొన్నా ఎదుర్కొని పోరాడేందుకు రైతులకు తోడుగా విద్యార్థులను రంగంలోకి దించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంటర్ నుంచి పోస్టు గ్రాడ్యుయేట్ వరకు చదివిన విద్యార్థులు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతను కరవుపై యుద్ధ సైనికులుగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కరవుకాలంలో పంటలను కాపాడేందుకు వినియోగించే రెయిన్‌గన్లపై ఆయా కళాశాలల్లోని ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులకు అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఏపీ తరఫున వాదించనున్న అటార్నీ జనరల్

హైదరాబాద్, ఆగస్టు 30: స్విస్‌చాలెంజ్ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తారని ఏపి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది డి రమేష్ హైకోర్టుకు తెలిపారు. మంగళవారం హైకోర్టు ఆదిత్య హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్విస్ చాలెంజ్ విధానాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించింది. ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, స్విస్‌చాలెంజ్‌పై సవరణలతో కూడిన నోటిఫికేషన్‌ను సిఆర్‌డిఏ జారీ చేసినట్లు చెప్పారు. బిడ్స్‌ను సమర్పించేందుకు గడువును సెప్టెంబర్ 13 వరకు పొడిగించామన్నారు.

విజయవాడ మెట్రోపై ఒప్పందం

విజయవాడ, ఆగస్టు 30: విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు కదలిక వచ్చింది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌ల మధ్య మంగళవారం ఒప్పందం జరిగింది. నాలుగేళ్లలో మెట్రో ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఈ ఎంవోయు అమల్లో ఉంటుంది. ఏడాదికాలంగా ఈ అగ్రిమెంట్ కుదరనందునే రైల్వేస్టేషన్ - నిడమానూరు కారిడార్ నిర్మాణం కోసం రూ.780 కోట్ల వ్యయంతో పిలువబడిన టెండర్లను కూడా రద్దు చేశారు. ఇక టెండర్ల ప్రక్రియ వేగవంతం కానుంది. ఇక జైకా నిబంధనలతో మెట్రో ప్రాజెక్టు ముందుకు సాగేలా లేదు. అందుకే ఇతర సంస్థలతో మరోవైపు సంప్రదింపులు సాగుతున్నాయి.

Pages