S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నన్నూ చంపడానికి నయామ్ గ్యాంగ్ యత్నం

సరూర్‌నగర్, ఆగస్టు 30: సరూర్‌నగర్ మండలంలోని బాలాపూర్‌లో నిర్వహిస్తున్న వందలకోట్ల విలువ చేసే ‘ప్రైడ్ ఇండియా’ రియల్ ఎస్టేట్ సంస్థకు గ్యాంగ్‌స్టర్ నరుూమ్ బినామీ అని ఈ వ్యవహరంపై వెంటనే సిబిసిఐడిచే విచారణ చేపట్టాలని బిజెపి రాష్ట్ర నాయకుడు ఎ.శంకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం బడంగ్‌పేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాలాపూర్‌లో వందల ఎకరాల ప్రభుత్వ భూములు, శిఖం భూములు, దేవాలయాలు, మసీదులకు సంబంధించిన భూములను కబ్జాలు చేసి రియల్ వ్యాపారాలు చేస్తున్నారని ప్రైడ్ ఇండియా సంస్థపై ఆయన ఆరోపణ చేశారు.

ఆ కీచకులను కఠినంగా శిక్షించాలి

ఖైరతాబాద్, ఆగస్టు 30: సోదరునికి రాఖీ కట్టి తిరిగి వెళుతున్న మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డ కీచకులను కఠినంగా శిక్షించాలని ఇంటర్‌నేషనల్ వైశ్ ఫెడరేషన్ (ఐవిఎఫ్) డిమాండ్ చేసింది. మంగళవారం లక్డీకాపూల్‌లోని వాసవీ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఫెడరేషన్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ మేఘమాల, శిరీష మాట్లాడారు. రాఖీపౌర్ణమి రోజు మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ కుడికిల్లకు చెందిన వర్షిణి సోదరునికి రాఖీ కట్టి వస్తుండగా అదే గ్రామానికి చెందిన స్వామి తాను అటే వెళుతున్నానని నమ్మించి వాహనంపై ఎక్కించుకున్నాడని తెలిపారు.

బక్రీద్‌కు బల్దియా ఏర్పాట్లు

హైదరాబాద్, ఆగస్టు 30: వచ్చే నెల 12వ తేదీన జరగనున్న బక్రీద్ పండుగకు బల్దియా తరపున భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉన్నత స్థాయి సమావేశం నిర్ణయం తీసుకుంది. జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం గ్రేటర్ ప్రధాన కార్యాలయంలో సైబరాబాద్ కమిషనర్ నవీన్ చంద్, హఐదరాబాద్ అదనపు కమిషనర్ వివిశ్రీనివాసరావు, స్టీఫెన్ రవీంద్ర, జిహెచ్‌ఎంసి అధికారులు హజరైన ఈ సమావేశంలో కమిషనర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాల మధ్యలో బక్రీద్ పండుగ వస్తున్నందున ఈ పండుగ సాఫీగా, ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్క ప్రభుత్వ శాఖ చక్కటి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరముందని సూచించారు.

శంషాబాద్‌లో భయం భయం

రాజేంద్రనగర్, ఆగస్టు 30: ఎయర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో టాక్సీ వాలాల దురాగతాలతో తీవ్ర భయం నెలకొంది. ఇటీవల ఒంటరి మహిళలను దోచుకోవడం.. ఆపై అత్యాచారాలకు పాల్పడిన సంఘటనలు జరగగా వెలుగులోకి రాకపోవడంతో దుండగులు రెచ్చిపోతున్నారు.అత్యాచారాలు జరిగినా దుండగుల బెదిరింపులు తదితర కారణాలతో బాధితులు భయంతో కుమిలిపోతు న్నారే తప్ప సరైన ఫిర్యాదు చేసేందుకు కూడా ముందుకు రావడంలేదు.
కట్టడి లేని క్యాబ్‌డ్రైవర్‌లు
పలువురు క్యాబ్‌డ్రైవర్‌లు ఆయా సంస్థల్లో పేరు నమోదులో వున్నా వేరే డ్రైవర్లు ఆ వాహనాలను నడపుతున్నట్లు సమాచారం.
ఎయిర్ హోస్టెస్‌ల్లో ఆందోళన

‘మహా’ పాలసీ!

హైదరాబాద్, ఆగస్టు 30: మహానగరంలో యాచకుల సమస్య రోజురోజుకీ పెరిగిపోవటంతో సమస్య పరిష్కారానికి పునరావాసమే ప్రత్యేక మార్గంగా భావిస్తోంది జిహెచ్‌ఎంసి. ఇదివరకు పలు సార్లు ఈ దిశగా వివిధ ప్రభుత్వ శాఖలు చర్యలు చేపట్టినా ఫలించకపోవటంతో, అందుకు క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే అడ్డంకులను సైతం పరిగణలోకి తీసుకుని సరికొత్త పాలసీని అందుబాటులోకి తేవాలని గ్రేటర్ భావిస్తోంది. అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్(యూసిడి) విభాగం ఆధ్వర్యంలో సరికొత్త విధి విధానాలను రూపకల్పన చేసేందుకు కసరత్తు కొనసాగుతోంది.

మెట్రో పిల్లర్లను దృష్టిలో పెట్టుకోండి

హైదరాబాద్, ఆగస్టు 30: నగరంలోని గణేశ మండపాల నిర్వాహకులు మెట్రోపిల్లర్లను దృష్టిలో పెట్టుకొని మండపాల ఏర్పాటు, నిమజ్జనోత్సవాలు జరుపుకోవాలని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి సూచించారు. మంగళవారం సాలార్‌జంగ్ మ్యూజియం సమావేశ మందిరంలో గణేశ మండపాల నిర్వాహకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ కార్యమ్రంలో నగర కమిషనర్‌తోపాటు దక్షిణ మండల డిసిపి సత్యనారాయణ, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ వినాయక నవరాత్రోత్సవాలను మతసామరస్యానికి ప్రతీకగా జరుపుకోవాలని సూచించారు.

మరింత సమర్ధవంతంగా ఐటి వినియోగం

హైదరాబాద్, ఆగస్టు 30: ఆధునిక సాంకేతిక రంగంలో ఎప్పటికపుడు వస్తున్న మార్పులను వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలందించే దిశగా కృషి చేస్తున్న నగర పాలక సంస్థల్లో జిహెచ్‌ఎంసి మొట్టమొదటి స్థానంలో ఉందని, మున్ముందు ఐటిని మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు కృషి చేస్తామని మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. మంగళవారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఐటి విభాగం అధికారులు, అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజీ ఆఫ్ ఇండియా, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు, జిహెచ్‌ఎంసి అదికారులతో మేయర్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం లబ్ధిదారులను గుర్తించాలి

హైదరాబాద్, ఆగస్టు 30: నగరంలో నిలువనీడ లేని పేదల కోసం గత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద నిర్మించిన ఇళ్లకు అర్హులైన లబ్దిదారులను త్వరితగతిన గుర్తించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ఆర్టీవోలు, గృహానిర్మాణ శాఖాధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన మంగళవారం తన ఛాంబర్‌లో జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకంపై సమీక్ష నిర్వహించారు.

ఆరోగ్యకరమైన సమాజంతోనే అద్భుత క్రీడాకారుల ఆవిర్భావం

ఖైరతాబాద్, ఆగస్టు 30: ఆరోగ్యకరమైన సమాజాన్ని సృష్టిస్తేనే అద్భుతమైన క్రీడాకారులను తయారు చేయగలమని ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్ అన్నారు. మంగళవారం సోమాజిగూడ తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం రాష్టప్రతి నుంచి ద్రోణాచార్య అవార్డును అందుకున్న రమేష్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి ప్రోత్సాహంతోనే తనకీ అవార్డు అందిందని అన్నారు. భారత రాష్టప్రతి చేతుల మీదుగా అవార్డును అందుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. 15 ఏళ్ల పాటు కుటుంబానికి దూరంగా ఉంటూ చేసిన తన ప్రయత్నానికి సంతృప్తినిచ్చిన ఆ క్షణాలను ఎన్నటికీ మరువలేనని చెప్పారు.

పులకించిన సీమ

హైదరాబాద్, ఆగస్టు 30: నెలరోజులుగా వర్షాలు లేక అల్లల్లాడి పోతున్న రాష్ట్రానికి బంగాళాఖాతంలో అల్పపీడనం రూపంలో వరుణుడు కరుణించాడు. తీవ్ర కరవు బాధతో కనాకష్టం పడుతున్న సీమ రైతుకు వర్షం ఒక్కసారిగా ఊరట కలిగించింది. రాయలసీమలోని నాలుగు జిల్లాలు మంగళవారం వాన రాకడతో పులకించిపోయాయి. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో పొలాలన్నీ ఒక్కసారిగా తడిసాయి. మరోవైపు గుంటూరు నుంచి నెల్లూరు దాకా భారీ వర్షపాతం నమోదైంది. ప్రకాశం, నెల్లూరు, ఉభయగోదావరి జిల్లాల్లో కరవుదీరా వాన కురిసింది. నెల రోజుల క్రితం నైరుతి రుతుపవనాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. అప్పట్నుంచీ రైతన్న చినుకు కోసం ఆకాశంవైపు ఎదురుచూస్తూనే ఉన్నాడు.

Pages