S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భుజాల మీదే శవమయ్యాడు!

కాన్పూర్, ఆగస్టు 30:వైద్యో నారాయణో హరి..ప్రాణ భిక్ష పెట్టే వైద్యుడు దేవుడితో సమానమన్న మాట. ఆ మాటకొస్తే వైద్య కేంద్రాలన్నీ దేవాలయాలే..దేవుళ్లతో సమానమైన వైద్యులతో నిండినవే! కానీ ఓ తండ్రి తన పనె్నండేళ్ల కొడుకును కాపాడాలంటూ వైద్యుల చుట్టూ, ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేక పోయింది. కొడుకు పరిస్థితి క్షణక్షణానికీ క్షీణించడంతో అతడ్ని భుజాన వేసుకుని మరీ రోడ్లపై పరుగులు పెట్డాడు. చివరికి వైద్యుడు కరుణించక..తండ్రి భుజాల మీదే ఆ కొడుకు కన్నుమూశాడు! ఈ హృదయ విదారక ఘటన కాన్పూర్‌లో జరిగింది.

ప్రజాస్వామ్య విరుద్ధంగా అమరావతి ల్యాండ్‌పూలింగ్

న్యూఢిల్లీ, ఆగస్టు 30: అమరావతి నిర్మాణం కోసం మూడు పంటలు పండే భూములను ల్యాండ్‌పూలింగ్ పేరుతో ఏపి ప్రభుత్వం భూమిని సమీకరించిందని సామాజికవేత్త మేధాపట్కర్ ధ్యజమెత్తారు. ఢిల్లీలో మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య విధానానికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం నూతన రాజధాని నిర్మాణాన్ని చేపడుతోందని ఆమె విమర్శించారు. భూసమీకరణ పేరుతో రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు భ్రమల్లో ఉంచి వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చారని అవేదన వ్యక్తం చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లో రాజధాని నిర్మించడం వల్ల ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.

మూడో ప్రత్యామ్నాయ శక్తిగా పవన్ కళ్యాణ్

న్యూఢిల్లీ, ఆగస్టు 30: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తే మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశముందని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ అన్నారు. పవన్ కళ్యాణ్ చేతనైతే పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి రావాలనీ, లేనిపక్షంలో రజనీకాంత్‌లా ఇంట్లో కూర్చోవాలని ఆయనకు సలహా ఇచ్చారు. పవన్‌లో కమ్యూనిస్టు భావాలు బాగానే ఉన్నా, ఆయన నడకలో తడబడుతున్నారని నారాయణ వ్యాఖ్యానించారు. ఏపీలో అధికార, ప్రతిపక్షాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయ శక్తికి అవకాశాలు చాలా ఉన్నాయని ఆయన చెప్పారు. అవసరమైతే పవన్‌తో చర్చలకు తాము సిద్ధమేనన్నారు.

‘జిఎస్‌టి నుంచి కూడా మినహాయింపు ఇవ్వాలి’

న్యూఢిల్లీ, ఆగస్టు 30: వ్యాట్, ఎక్సైజ్ పన్నుల నుండి మినహాయించిన వస్తువులకు జిఎస్‌టి నుండి కూడా మినహాయింపు ఇవ్వాలని ఏ.పి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్ర అధ్యక్షతన జరిగిన జిఎస్‌టిఎన్ సాధికారిక కమిటి సమావేశానికి యనమల హాజరయ్యారు. సవరించిన ఆదాయ వ్యవస్థలో జిఎస్‌టిఎన్ వాణిజ్య బ్యాంకుల నుండి తీసుకునే రుణాలకు బ్యాంకులకు చెల్లించే వడ్డీ మాత్రమే విధించాలని యనమల స్పష్టం చేశారు. అసోచాం, ఫిక్కి, సిఐఐ, చిన్న పరిశ్రమల సంఘం, నాస్‌కాం, వ్యాపారస్తుల సంఘం ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరై జిఎస్‌టిపై తమ వాదనలు వినిపించారు.

మా కార్యాలయం మాకివ్వండి

హైదరాబాద్, ఆగస్టు 30: శాసనసభలో తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం కార్యాలయాన్ని తిరిగి తమ పార్టీకే అప్పగించాలని టిడిపి నేతలు ఎ రేవంత్‌రెడ్డి, ఎస్ వెంకట వీరయ్య, ఆర్ కృష్ణయ్యలు స్పీకర్‌ను కోరారు. బిఎసిలో స్పీకర్ నిర్ణయానుసారం తమకు కార్యాలయాన్ని కేటాయించారని, తర్వాత శాసనసభ్యులు పార్టీ ఫిరాయించినపుడు అనర్హత పిటీషన్లు పెండింగ్‌లో ఉండగానే తెలుగుదేశం పార్టీని టిఆర్‌ఎస్‌లో విలీనం చేసినట్టు నోటిఫికేషన్ జారీ చేశారని, అది కూడా కోర్టులో పెండింగ్‌లో ఉందని వారు వివరించారు. ఈ నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ శాసనసభాపక్షం కార్యాలయాన్ని శాసనసభా కమిటీలకు కేటాయించడం సమంజసం కాదని వారు పేర్కొన్నారు.

ఇదేం న్యాయం..బాబూ?

మార్కాపురం/మనుబోలు, ఆగస్టు 30: పంటలు ఎండిపోతున్న అనంతపురం రైతులను ఆదుకునేందుకు ప్రకాశం, నెల్లూరు జిల్లాలనుంచి వాటర్ ట్యాంకర్లను పంపించాలని స్థానిక అధికారులకు సోమవారం రాత్రి ఆదేశాలు అందాయి. దీనితో ప్రకాశం జిల్లా మార్కాపురం మార్కాపురం ఆర్డీఓ చంద్రశేఖరరావు, ఎంవిఐ రాంబాబు, పట్టణ ఎస్సై సుబ్బారావుల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ట్యాంకర్లను నిలుపుదల చేసి అనంతపురం తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. అలాగే నెల్లూరు జిల్లా మనుబోలునుంచి ఎంవిఐ అధికారులు వందలాది లారీలను సేకరించారు.

ఎన్‌డిఏ ఏడాది పాలనలో 9 లక్షల ఇళ్ళ మంజూరు

న్యూఢిల్లీ, ఆగస్టు 30: ఆంధ్రప్రదేశ్‌కు ఒక లక్షా 93వేల ఇళ్లు, తెలంగాణ రాష్ట్రానికి 84 వేల ఇళ్లను ఇప్పటివరకు మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 9 లక్షల 35వేల ఇళ్లను మంజూరుచేసినట్టు వెల్లడించారు. పదేళ్ల యూపీఏ పాలనలో కేవలం పదిలక్షల ఇళ్లు మాత్రమే మంజూరు చేసిందని విమర్శించారు. ప్రధాని అవాస్ యోజన కింద ఒక్క ఏడాదిలోనే వీటిని మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మారుస్తామని వెంకయ్య స్పష్టం చేశారు.

నగరానికి ఆవల... (కథ)

కృష్ణపక్షం.. మసక వెనె్నల.. చీకట్ని మింగిన కొండచిలువలా నగరం అచేతనంగా వుంది. ఎవరూలేని ఏకాంతంలో చీకటి ఎన్నో ఊసులు చెబుతుంది. నిశ్శబ్దంలాగా ఎంతో అందమైనది. రెండు చేతులు ప్యాంటు జేబులో వేసుకొని, అప్పుడప్పుడూ చలికి చేతులు రుద్దుకుంటూ తిరిగి జేబులో పెట్టుకుని విశ్రాంతిగా నడుస్తున్నాడు. ఇంతలో సైరన్ మోగించుకుంటూ పోలీసుజీపు అతనిని దాటుకుంటూ వెళ్లిపోయింది. వాళ్లు తనలా ఏదో ఆలోచిస్తూ వెళుతున్నారేమోనని తనలో తనే గొణుక్కున్నాడు. అలానే నడుస్తూ చిన్న గోతిలో కాలు పట్టుతప్పి తూలి పడబోయి తమాయించుకున్నాడు. నగరానికి ఆవలగా నడక సాగుతోంది. అయినా ఇంకా నగరంలోనే వున్నాడు.

పుష్కర స్నానం..బాగుంది (స్పందన)

గతవారం మెరుపులో కృష్ణ పుష్కరాల సందర్భంగా ప్రచురించిన పుష్కర స్నానం..అనంత పుణ్యఫలం బాగుంది. పుష్కరాల గురించి చాలా తెలియని విషయాలను విపులంగా వివరించినందుకు విష్ణుబొట్ల రామకృష్ణ గారికి ధన్యవాదములు. అసలు పుష్కరస్నానం ఎలా చేయాలి, ఎలాంటి పుణ్యఫలం దక్కుతుంది, ఎలాంటి నియమనిబంధనలు పాటించాలి అంటూ వర్ణించిన తీరు బాగుంది. మంచి విషయాలను పాఠకులకు అందించిన విష్ణుబొట్ల గారికి ధన్యవాదములు.
- రావి పద్మజ, తిరుపతి
- అనంతబొట్ల సుబ్బారావు, కందుకూరు
- సజ్జా హైమావతి, గూడూరు

జిఎస్టీతో మేలే

హైదరాబాద్, ఆగస్టు 30: వస్తు సేవా పన్ను (జిఎస్టీ) విధానంతో అన్ని రాష్ట్రాలకూ మేలు జరుగుతుందని, సంస్కరణలతో కేంద్ర, రాష్ట్రాల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని సిఎం చంద్రశేఖర్ రావు చెప్పారు. జిఎస్టీ సరిగా అమలయ్యేలా చూస్తామంటూనే, రాష్ట్రానికి వచ్చే లబ్ధి విషయంలో అప్రమత్తమై కేంద్రం నుంచి రావాల్సిందంతా రాబడతామని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు వస్తు సేవా బిల్లును సమర్ధించాయని, ఏ రాష్ట్రం కూడా తన ప్రయోజనాలను వదులుకునేందుకు సిద్ధంగా ఉండదన్నారు.

Pages