S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

20నుంచి అసెంబ్లీ

హైదరాబాద్, ఆగస్టు 30: శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 20నుంచి నిర్వహించాలని బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బిఎసి) నిర్ణయించింది. వర్షాకాల సమావేశాలు పది పని దినాలకు తగ్గకుండా నిర్వహించాలని కూడా ప్రభుత్వం వెల్లడించింది. జిఎస్టీ బిల్లు ఆమోదానికి అసెంబ్లీ ప్రత్యేకంగా మంగళవారం సమావేశమైంది. బిల్లు ఆమోదం తర్వాత సభను స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అరగంటపాటు వాయిదావేసి తన ఛాంబర్‌లో బిఏసి నిర్వహించారు.

తొలిరోజు నుంచే పాలన

హైదరాబాద్, ఆగస్టు 30: దసరా నుంచి కొత్త జిల్లాలు ఉనికిలోకి రానున్నందున అధికారిక కార్యకలాపాలు ఆరోజు నుంచే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్టోబర్ 11నాటికి రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే నూతన జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్‌పిలతో పాటు అన్ని శాఖల కార్యాలయాలు తమ కార్యకలాపాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

పుష్కర కృష్ణవేణి (మనోగీతికలు)

నాగరికతకి ఆధారమైన
జీవకోటికి ప్రాణాధారమైన
మానవ వౌన నేస్తాలు
పవిత్ర నదీనదాలు

అనాదిగా సాగే సంబంధం
విడదీయలేని అనుబంధం
కష్టసుఖాల అనుభవాల సారం
మనిషి చదవాల్సి‘నది’ గ్రంథం

మహారాష్ట్రంలోని
మహాబలేశ్వరంలో పుట్టి
ఆశలెన్నో మూటగట్టుకొని
ఆనందాలతో అడుగులేస్తోంది

అలుపెరగక సాగిపోయే
కృష్ణమ్మ పరవళ్లు
సోయగాల లోగిళ్లు
ప్రకృతి పరవశించే ముంగిళ్లు

తాగునీరు, సాగునీరు అందిస్తూ
బంగారు పంటలను పండిస్తూ
అలల గలగల సవ్వడులు
సంగీత సప్తస్వరాలు

ఏం చేద్దాం?

హైదరాబాద్, ఆగస్టు 30: ‘ఓటుకు నోటు’ కేసు పునర్విచారణకు ఏసిబి కోర్టు ఆదేశించిన నేపథ్యంలో సిఎం కెసిఆర్, ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఎకె ఖాన్, అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి మంగళవారం గవర్నర్‌తో సమావేశం కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. శాసనసభలో జిఎస్టీ బిల్లు ఆమోదం పొందగానే సిఎం నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. తర్వాత కొద్దిసేపటికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఏసీబీ డిజి ఎకె ఖాన్, తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు.

అం‘ద’రి శ్రేయోభిలాషి! (ఉరుము కథ)

మీకు తెలుసా!.. ఉరుము ఎలాంటి శబ్దాన్ని మనకి వినిపిస్తుందో? అలాగే అది ఎలాంటి సందేశాన్ని మనకి పంపిస్తోందో కూడా తెలియదు కదూ? ఇప్పుడు తెలుసుకుందాం!
యుగాలకి ముందు మన దేశంలో నివసించిన మహర్షులు గొప్ప తపస్సు చేసి ఆకాశంలో మెరుపులతో కలిసి ఉరిమే ఉరుము అసలు మనకి దేని గురించి చెప్తోందో తెలుసుకోడానికి ప్రయత్నించి చివరికి ఫలితాన్ని సాధించారు. ఉరుము ద్వారా సృష్టికర్త మనకి ఒక సందేశాన్ని ఇస్తున్నాడని తెలుసుకున్నారు. అదే ఈ ఉరుము కథ.

భమిడిపాటి బాలాత్రిపురసుందరి, విజయవాడ. చరవాణి : 9440174797

ఎయిర్ హోస్టెస్‌పై అత్యాచార యత్నం

హైదరాబాద్, ఆగస్టు 30: ప్రైవేట్ విమానయాన సంస్థలో పనిచేస్తున్న ఎయిర్ హోస్టెస్‌పై క్యాబ్‌డ్రైవర్ అత్యాచార యత్నానికి ఒడిగట్టిన సంఘటన వెలుగుచూసింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రముఖ విమానయాన సంస్థలో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తున్న యువతి సోమవారం అర్ధరాత్రి ఉప్పర్‌పల్లి హ్యాపీ హోమ్స్‌కాలనీ రోడ్డుపై క్యాబ్‌ను పికప్ చేసుకుంది. ట్యాక్సీ డ్రైవర్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లాల్సి ఉండగా, యువతిని జనసంచారం లేని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. అప్పటికే అప్రమత్తమైన యువతి అరుపులు, కేకలు వేసింది.

అందరూ అందరే.. (చిన్న కథ)

అదో చిన్న పల్లెటూరు. ఏకోపాధ్యాయ పాఠశాల వుందా ఊళ్ళో. ఒకటి నుండి మూడు తరగతులకు ఓ యాభైమంది విద్యార్థులున్నారు. శ్యాంసుదర్ ఆ ఊరి బడి ఉపాధ్యాయుడు. ప్యూన్ నుంచి హెడ్‌మాస్టర్ వరకు అన్ని పనులు తానే చేసుకోవాలి. తన హాజరు పట్టిక, విద్యార్థుల హాజరు పట్టిక, తదితర అన్ని రికార్డులు తన సంచిలోనే ఉంటాయి. మధ్యాహ్న భోజనం వండిపెట్టడానికో వంటమనిషి వుంది. శ్యాంసుందర్ ఎప్పుడొస్తాడో, ఎప్పుడు వెళతాడో ఎవ్వరూ పట్టించుకోరు. పిల్లలు బడికి వచ్చి ఆడుకుంటారు. అప్పుడప్పుడూ కొట్టుకుంటారు. శ్యాంసుందర్ వచ్చినరోజు అందరినీ ఒక గదిలో కూర్చోబెట్టి ఏవేవో కథలు చెబుతుంటాడు. పిల్లలు ఆసక్తిగా వింటుంటారు.

- మండవ సుబ్బారావు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లా.

తాండూరు పేరుతోనే జిల్లా ఏర్పాటు చేయాలి: ధారాసింగ్

తాండూరు, ఆగస్టు 30: రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు నిర్ణయం ఆహ్వానించదగిన అంశమేనని, తాండూరు పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్ కాంగ్రేస్ నేత, ప్రముఖ గిరిజన నాయకుడు ధారాసింగ్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాలకులు రూపొందించిన నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియ హేతుబద్ధంగా లేదని చెప్పారు. మంగళవారం ధారాసింగ్ తాండూరులోని తమ నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, నూతన జిల్లాల ఏర్పాటు, ప్రజలకు పరిపాలన సౌలభ్యం అనే విధానంలో లోటుపాట్లు ఉన్నందున జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై పలు అభ్యంతరాలు, ఆందోళనలు ఎగిసి పడుతున్నాయంటూ ధారాసింగ్ ఉదాహరించారు.

10వ తేదీ కల్లా నిమజ్జనం కొలనుల నిర్మాణం పూర్తి

హైదరాబాద్, ఆగస్టు 30: రసాయనాలతో తయారు చేసిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయటంతో చెరువులు, కుంటలు కలుషితం కాకుండా ఉండేందుకు ఈ ఏటా గ్రేటర్ కొత్తగా నిర్మిస్తున్న నిమజ్జన కొలనులు నిర్ణీత గడువు కన్నా కాస్త ముందుగానే సిద్దం చేయాలని మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన మంగళవారం నిమజ్జనం కొలనుల నిర్మాణ పనులపై ఇంజనీర్లతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రూ. 6 కోట్ల 35 లక్షల వ్యయంతో నగరంలోని పది ప్రాంతాల్లో పది ప్రత్యేక కొలనులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. వీటన్నింటిని నిర్మాణం వచ్చే నెల 10వ తేదీ కల్లా పూర్తి చేయాలని ఆయన ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు.

మహిళాలోకానికి రాణి రుద్రమదేవి ఆదర్శం

తార్నాక, నాచారం, ఆగస్టు 30: రాణి రుద్రమదేవి ధైర్యసాహసాలతో రాజ్యపాలన చేసి నారీలోకానికే ఆదర్శంగా నిలిచిందని ఎన్‌బిటి ఇండియా చైర్మెన్ బల్ధేవ్‌బాయ్ పేర్కొన్నారు. మంగళవారం కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ నేతృత్వంలో నేషనల్ బుక్ ట్రస్టు ఇండియా ప్రచురించిన రాణి రుద్రమదేవి పుస్తకావిష్కరణ సభ ఆంధ్రమహాసభ క్యాంపస్‌లో ఎన్‌బిటి పుస్తక వికాస కేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బల్ధేవ్‌బాయ్ మాట్లాడుతూ భారతదేశ చరిత్ర సంస్కృతి సాహిత్యాన్ని రానున్నతరాలకు అందించడానికి ఎన్‌బిటి ఎన్నో పుస్తకాలను ప్రచురించిందని తెలిపారు.

Pages