S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదుకోండి!

న్యూఢిల్లీ, జూలై 1:ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయాలని కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి విజ్ఞప్తి చేశారు. ఐదు రోజుల చైనా పర్యటన ముగించుకొని గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి శుక్రవారం కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, ఉమాభారతి, రాజ్‌నాథ్ సింగ్‌లతో సమావేశమై చర్చలు జరిపారు.

ఆ చెక్‌డ్యామ్ ఎత్తును 5 అడుగులకు తగ్గించండి

చెన్నై, జూలై 1: అంతర్ రాష్ట్ర పాలార్ నదిపై ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో గల చెక్‌డ్యామ్ ఎత్తు పెంచడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలిత తీవ్రంగా ఖండించారు. చిత్తూరు జిల్లాలోని పెరుంబల్లం గ్రామం వద్ద నిర్మించిన ఈ చెక్ డ్యామ్ ఎత్తును అయిదు అడుగుల నుంచి 12 అడుగులకు పెంచడాన్ని నిరసిస్తూ ఆమె ఏపి సిఎం చంద్రబాబు నాయుడుకు ఒక లేఖ రాశారు. మద్రాస్-మైసూర్ ఒప్పందం- 1892 ప్రకారం ఇది అంతర్ రాష్ట్ర నది అని పేర్కొంటూ, దిగువ రాష్టమ్రైన తమిళనాడు నుంచి ముందస్తు అనుమతి పొందకుండా ఎగువ రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్ ఈ నదిపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీలు లేదని స్పష్టం చేశారు.

‘సర్వ శిక్షా’ ఆఫీసులో 14మంది అటెండర్లు!

హైదరాబాద్, జూలై 1: ఆంధ్రప్రదేశ్ సర్వ శిక్షా అభియాన్‌లో రోజుకో అవినీతి అధికారి బండారం బట్టబయలవుతోంది. రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఐఎఎస్ అధికారి శ్రీనివాస్ వచ్చిన నాటి నుండి ఒక్కో జిల్లాను సమీక్షిస్తున్న కొద్దీ అక్రమార్కుల చిట్టాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా అనంతపురం ప్రాజెక్టు అధికారి దశరథ రామయ్య అవినీతి బండారం బయటపడింది. ఆయన ‘మన ఊరు- మన బడి’ పేరుతో 9 లక్షల రూపాయలు కైంకర్యం చేసినట్టు గుర్తించారు. అలాగే తన కార్యాలయంలో ఆయన 14 మంది అటెండర్లను రికార్డుల్లో చూపించారు.

ఇంటర్నెట్‌లపై నిఘా..?

హైదరాబాద్, జూలై 1: హైదరాబాద్‌లో ఐసిస్ ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు కుట్రపన్నిన నేపథ్యంలో నగరవ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్ కేఫ్‌లపై పోలీసులు నిఘా పెంచారు. ఇప్పటివరకు ఎన్‌ఐఏ, నగర పోలీసులకు చిక్కిన ఐసిస్ సానుభూతిపరుల్లో అధికశాతం ఇంటర్‌నెట్ కేఫ్‌ల నిర్వాహకులు కావడం గమనార్హం. నగరవ్యాప్తంగా 4,376 ఇంటర్నెట్ కేంద్రాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగానే నడుస్తున్నట్టు పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. అయితే అనుమానితులు పట్టుబడ్డప్పుడే ఇంటర్నెట్ కేఫ్‌లపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారే తప్ప..మిగతా సమయాల్లో ఇంటర్నెట్‌లపై నిఘా కరువైందని విమర్శ సర్వత్రా వినవస్తోంది.

ఉరుకులు పరుగులే!

హైదరాబాద్, జూలై 1: మహానగరంలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు రచించిన వ్యూహాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) భగ్నం చేసినా, ఎపుడు ఎం జరుగుతుందోనన్న భయం సామాన్యులను వెంటాడుతూనే ఉంది. ఈ క్రమంలో త్వరలో రానున్న రంజాన్ పండుగ, ఆ తర్వాత 17 నుంచి ప్రారంభమైన వచ్చే నెల 17వరకు కొనసాగనున్న బోనాల జాతర బందోబస్తు కోసం పోలీసులకు ఉరుకులు, పరుగులే. ఉగ్రవాదులు నగరంలో సృష్టించాలనుకున్న బీభత్సానికి సంబంధించిన ప్లాన్ వివరాలు వింటనే ఒళ్లు జలదరిస్తున్న నేపథ్యంలో మున్ముందు ఎలాంటి ఘటనలు జరుగుతాయోననంటూ నగర వాసులు కలవరాన్ని వ్యక్తం చేస్తున్నారు.

నిఘా నీడలో ప్రార్థనలు ప్రశాంతం

చార్మినార్, జూలై 1: ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు నగరంలో భారీ విధ్వంసానికి చేసిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ భగ్నం చేసిన నేపథ్యంలో పాతబస్తీలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నగరానికి ఉగ్రవాదులు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రంజాన్ మాసంలో చివరి శుక్రవారం ప్రార్థనలు, అలాగే శుక్రవారం కావటంతో చార్మినార్‌లోని శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన వారితో పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఒకే చోట పక్కపక్కనే సామూహిక ప్రార్థనలు, మరో వైపు అమ్మవారి దర్శనం కోసం వేలాది రావటంతో బందోబస్తు పోలీసులకు సవాలుగా మారింది. మధ్యాహ్నం ప్రార్థనలు ప్రశాంతంగా ముగియటంతో వారు ఊపరిపీల్చుకున్నారు.

మూడు నెలల్లో రూ. 340 కోట్ల ఆస్తిపన్ను వసూలు

హైదరాబాద్, జూలై 1: జంటనగర ప్రజలకు పౌరసేవలు, అవసరాలకు తగిన విధంగా అభివృద్ధి పనులు చేపట్టే మహానగర పాలక సంస్థ ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను వసూళ్లపై ఈ ఏటా కాస్త ముందుగానే దృష్టి సారించిన సంగతి తెలిసిందే! గడిచిన రెండేళ్ల నుంచి ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే ఎర్లిబర్డ్ స్కీంను అమలు చేస్తూ చెల్లించాల్సిన పనుల్లో బకాయిదారులకు రాయితీ ఇవ్వటం, సక్రమంగా, సకాలంలో పన్ను మొత్తం చెల్లించే వారిలో విజేతలను ఎంపిక చేసి తొలుత రూ.లక్ష, ఆ తర్వాత వారిని రూ. 3లక్షలు చొప్పున ప్రకటిస్తున్న నగదు బహుమతులు సత్ఫలితాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వర్థమాన ఆర్థిక సంవత్సరంలో గడిచిన మూడు నెలల్లో ఆస్తిపన్ను రూ.

న్యాయవాదుల ‘చలో హైదరాబాద్’తోఉద్రిక్తత

ముషీరాబాద్, జూలై 1: ప్రత్యేక హైకోర్టు సాధన.. న్యాయమూర్తుల ఆప్షన్ల రద్దు.. డిమాండ్ చేస్తూ శుక్రవారం ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన మహాధర్నాకు తెలంగాణ వ్యాప్తంగా వేలాదిగా న్యాయవాదులు తరలివచ్చారు. విభిన్న రాజకీయ పార్టీల ఆందోళనలు.. ప్రజా సంఘాల నిరసనలతో నిత్యం రంగు..రంగులు సంతరించుకునే ఇందిరాపార్కు పరిసరాలు శుక్రవారం జరిగిన న్యాయవాదుల మహాధర్నాలో వేలాది మంది న్యాయవాదులు ధరించిన తెల్ల షర్టులు..నల్లకోట్లతో ‘బ్లాక్ అండ్ వైట్’ గామారింది. తెలంగాణ అడ్వకేట్స్ జెఏసి పిలుపుమేరకు జరిగిన ధర్నా భారీ పోలీసు బందోబస్తు.. అడుగడుగునా నిఘా, ఉద్వేగ బరిత వాతావరణం మద్య జరిగింది.

ఐటి కంపెనీల్లో భద్రత డొల్ల

గచ్చిబౌలి, జూలై 1: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటి సంస్థల భద్రత డొల్లతనంగా మారింది. అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన ఐటి సంస్థల భధ్రత విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించకపోవడం దురదృష్టకరం. గచ్చిబౌలి పరిధిలో సుమారు 500 ఐటి సంస్థలు ఉన్నాయి. వీటిలో ఐదు లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సంవత్సరానికి 65వేల కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తోంది. ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్న ఐటి సంస్థలకు భధ్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక చర్యలు చేపట్టలేదు. దీంతో ఆటంకవాదులకు ఆసరాగా మారింది.

హైకోర్టు విభజనలో చంద్రబాబుకు కొమ్ముకాస్తున్న కేంద్రం

వికారాబాద్, జూలై 1: కేంద్ర ప్రభుత్వం హైకోర్టు విభజన విషయంలో ఏపి సిఎం చంద్రబాబుకు కొమ్ము కాస్తోందని టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జి.నాగేందర్‌గౌడ్ విమర్శించారు. శనివారం ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన న్యాయవాదుల మహాధర్నాకు వికారాబాద్ నుండి న్యాయవాదులు తరలివెళ్ళారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిని గెలిపిస్తే నెలలోపే హైకోర్టు విభజన చేస్తామని చెప్పిన కేంద్ర న్యాయశాఖ మంత్రి మాట మార్చారని చెప్పారు. హైకోర్టు ఆప్షన్ పేరిట ఆంధ్ర ప్రాంతం వారిని జడ్జీలుగా తీసుకువచ్చి పెత్తనం చేయించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.

Pages