S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రిజర్వేషన్లతో పేద ఓసి విద్యార్థులకు తీవ్ర నష్టం

సిరిసిల్ల, జూలై 1: విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల కారణంగా ఓసి కులాలలోని రెడ్డి, వైశ్య, వెలమ, బ్రాహ్మణ కులాలలోని పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని జిల్లా ఓసి జెఎసి అధ్యక్షులు చెన్నమనేని పురుషోత్తంరావు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం టిఎస్ ఓసి జెఎసి విద్యార్థి (యువసేన) ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. సిరిసిల్ల ఆర్య వైశ్య సంఘ భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జెఎసి అధ్యక్షుడు పురుషోత్తమరావు, రాష్ట్ర సలహాదారు పెండ్యాల కేశవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన ఓసిలకు 19 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

జిల్లా ఉద్యమం..ఉధృతం..

జనగామ టౌన్, జూలై 1: జనగామను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా శాంతియుతంగా సాగిన ఉద్యమం ఉద్రిక్త స్థాయికి చేరుకుంది. ధర్నాలు, నిరసనలతో ఇన్నాళ్లు ఆందోళన చేసిన ఉద్యమకారుల ఆగ్రహం కట్టలు తెంచుకొని విధ్వంసానికి దారితీసింది. శుక్రవారం జిల్లా సాధన ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ పలు విధ్వంసాలతో విజయవంతమైంది. పట్టణ ప్రజలతో పాటు వివిధ మండలాలకు చెందిన వేలాది మంది స్థానిక ఆర్టీసి చౌరస్తా చేరుకొని ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటల వరకు రాస్తారోకో నిర్వహించారు.

ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు నియంత్రించాలని డిప్యూటీ సిఎం ఇంటి ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం

వరంగల్, జూలై 1: ప్రయివేట్ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రించడంలో డిప్యూటీ సిఎం, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విఫలమయ్యారని ఆరోపిస్తూ శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, ఐద్వా ఆధ్వర్యంలో విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి ఇంటి ముట్టడికి విఫలయత్నం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు పెద్దఎత్తున అక్కడికి చేరుకొని విద్యార్థులను అడ్డుకున్నారు. ఈ సంఘటనలో విద్యార్థులు, పోలీసులకు మధ్య వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది.

న్యాయవాదుల సమస్యలపై గవర్నర్ చొరవ చూపాలి

వడ్డేపల్లి, జూలై 1: గత కొన్ని రోజులుగా హైకోర్టు విభజన అంశంలో జరుగుతున్న న్యాయ వివాదంలో ఇరు రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరిస్తున్న నరసింహన్ తక్షణమే చొరవ తీసుకుని, సమస్య పరిష్కారానికి కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం జిల్లాపార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో పొందపరచిన విధంగానే న్యాయ వాదుల సమస్యను పరిష్కరించుకునే దిశగా కొనసాగాలని, ఇందుకు గాను గవర్నర్ తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

కెయులో అట వీ కోర్సులను ప్రారంభించాలి

నక్కలగుట్ట, జూలై 1: కాకతీయ విశ్వవిద్యాలయంలో ఫారెస్ట్రీ, పర్యావరణానికి సంబందించిన కోర్సులను ప్రారంభించడానికి ప్రణాళికలను తయారుచేయాలని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు సీతారాంనాయక్ సూచించారు. శుక్రవారం ఆయన గతంలో పని చేసిన బాటనీ విభాగాన్ని సందర్శించి బాటనీ విభాగం అద్యాపకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బాటనీ విభాగం అంతర్జాతీయ సదస్సును నిర్వహించాలని కోరుతూ ఇందుకు తన వంతు సహాయం చేస్తానని అన్నారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జవదేవకర్‌ను సదస్సును ఆహ్వానిస్తానని హామి ఇచ్చారు.

సామర్థ్యంపై నమ్మకమే విజయానికి సోపానం

నక్కలగుట్ట, జూలై 1: యువత తమ శక్తి సామర్థ్యాలపై నమ్మకాలతో ముందుకు వెళితే విజయం సాధించడం సులభం అవుతుందని పోలీసు కమీషనర్ సుధీర్‌బాబు అన్నారు. శుక్రవారం జెఎన్‌ఎస్ మైదానంలో పోలీసు విభాగంలో సబ్ ఇన్స్‌పెక్టర్ల నియామక ప్రిలిమినరి పరీక్షలలో అర్హత సాధించిన అభ్యర్థులకు పలురకాల పరీక్షలు నిర్వహించారు. 11 వందల మంది అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన, శారీరక కొలతల పరీక్షలు నిర్వహించడంతోపాటు 800,100 మీటర్ల పరుగు, లాంగ్, హై జంప్ క్రీడాంశాలలో పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.

రూ.480 కోట్లతో మిషన్ భగీరధపనులు

నర్సంపేట, జూలై 1: నర్సంపేట నియోజకవర్గంలో రూ. 480 కోట్లతో మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని టిఆర్‌ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. నర్సంపేటలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడారు. ప్రతి ఇంటికి శుద్ధి చేసి మంచినీటిని నల్లాల ద్వారా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మిషన్‌భగీరద పథకాన్ని టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పారు. నర్సంపేట నియోజకవర్గానికి కృష్ణ జలాలను అందించేందుకు పాలమూరులో మొదటి దశ పనులను పూర్తి అయ్యాయని తెలిపారు.

న్యాయవాదుల ఆందోళన ఉధృతం

వరంగల్, జూలై 1: తెలంగాణలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న ఆందోళనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. శుక్రవారం జిల్లా న్యాయస్థానం ఎదుట న్యాయవాదులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సీమాంధ్ర జడ్జిల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ సీమాంధ్ర జడ్జిల ఆప్షన్ విధానం రద్దు చేసి వెంటనే తెలంగాణలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయమూర్తుల సస్పెషన్స్‌ను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా జ్యూడిషనల్ ఉద్యోగులు కూడా సమ్మె చేపట్టారు. దీంతో శుక్రవారం జిల్లా న్యాయస్థాన డోర్లు కూడా తెరుచుకోలేని పరిస్థితి ఏర్పడింది.

ఆర్టీసీ బస్సు లారీ ఢీ

కేతేపల్లి, జూలై 1: హైదరాబాద్- విజయవాడ జాతీయరహదారిపై మండలంలోని చీకటిగూడెం స్టేజీవద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో తొమ్మిదిమంది బస్సు ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం మియాపూర్-1 డిపోకు చెందిన ఆర్టీసి బస్సు(నెంబరు ఎపి 29జెడ్ 3385) డీలక్స్‌బస్సు హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్తుండగా చీకటిగూడెం శివారులోని పవర్‌ఫ్లాంటువద్ద ముందు వెళ్తున్న లారీని అధిగమించే క్రమంలో అదుపుతప్పి లారీని ఢీకొట్టింది.

ప్రైవేటు బస్సు బోల్తా..

కట్టంగూర్, జూలై 1: హైదరాబాద్- విజయవాడ 65వ నెంబరు జాతీయ రహదారిపై మండల పరిధిలోని ముత్యాలమ్మగూడెం గ్రామ అవాసం తూర్పుబావిగూడెం స్టేజివద్ద గురువారం అర్ధరాత్రి ప్రైవేటు ట్రావెల్స్ వోల్వోబస్సు అదుపుతప్పి ఫల్టీకొట్టడంతో పదిమంది ప్రయాణీకులకు తీవ్ర గాయాలుకాగా మరో పదిమందికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు, స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం సితార ట్రావెల్స్‌కు చెందిన ఎపి 16టిహెచ్ 9 నెంబరుగల వోల్వోబస్సు 46మంది ప్రయాణీకులతో గురువారం రాత్రి 11.30లకు హైదరాబాద్ నుండి రాజమండ్రికి బయలుదేరింది.

Pages