S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం

నల్లగొండ, జూలై 1: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మూడు నెలల విరామానంతరం రేపు శనివారం చైర్మన్ నేనావత్ బాలునాయక్ అధ్యక్షతన సమావేశం కానుంది. మంత్రులు కెటిఆర్, జగదీష్‌రెడ్డిలు ఈ సమావేశానికి హాజరుకానుండగా వారు ఐదుకోట్ల వ్యయంతో నిర్మించే జిల్లా పరిషత్ నూతన భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జరిగే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వారు పాల్గొంటారు. కాగా జిల్లా ప్రజల సమస్యలపై వాడివేడి చర్చలతో దద్ధరిల్లిపోయే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలు గత రెండేళ్లుగా మొక్కుబడిగా నామమాత్ర చర్చలకే పరిమితమవుతుండటం విమర్శలకు గురవుతుంది.

భువనగిరి కేంద్రంగా సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్ కార్యాలయం

నల్లగొండ, జూలై 1: నల్లగొండ జిల్లా భువనగిరి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని భువనగిరి టౌన్, రూరల్, బీబీనగర్, పోచంపోల్లి, బొమ్మలరామారం, వలిగొండ, చౌటుప్పల్ టౌన్ పోలీస్ స్టేషన్లతో కూడిన సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్ కార్యాలయం పనులు శుక్రవారం నుండి భువనగిరి కేంద్రంగా అధికారికంగా ప్రారంభమైనట్లుగా జిల్లా ఎస్పీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. ఆయా పోలీస్ స్టేషన్లతో భువనగిరి కేంద్రంగా సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటిదాకా భువనగిరి డిఎస్పీ కార్యాలయం కొనసాగిన భవనంలో సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్ కార్యాలయం పనిచేస్తుందన్నారు.

కార్పొరేట్‌కు దీటుగా గురుకుల విద్య

సూర్యాపేట, జూలై 1: కార్పోరేట్ విద్యాసంస్ధలకు ధీటుగా అన్నివర్గాల విద్యార్ధులకు మెరుగైన ప్రమాణాలతో విద్యనందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యాలయాలను ఏర్పాటుచేస్తుందని రాష్ట్ర విద్యుత్, దళిత అభివృద్ది,సంక్షేమశాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. డివిజన్ కేంద్రమైన సూర్యాపేటలో ఈ విద్యాసంవత్సరం నూతనంగా ఏర్పాటుచేసిన మైనార్టీ గురుకుల పాఠశాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు.

మాతాశిశు సంక్షేమానికి ప్రాధాన్యత

నల్లగొండ, జూలై 1: రాష్ట్ర ప్రభుత్వం మాతాశిశు సంక్షరణకు అధిక ప్రాధాన్యతనిచ్చి అవసరమై నిధులు అందిస్తున్నందునా స్ర్తి, శిశు సంక్షేమశాఖ సిబ్బంది సంబంధిత పథకాలను సక్రమంగా అమలు చేసేందుకు కృషి చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునితామహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్మన్ చింతల వరలక్ష్మీ అధ్యక్షతన జరిగిన ఐదవ స్థాయి సంఘం మహిళా శిశు సంక్షేమ శాఖ సమావేశంలో ఆమె మాట్లాడుతు అంగన్‌వాడీ యంత్రాంగం ఆరోగ్య లక్ష్మీ, సమగ్ర శిశు సంరక్షణ, అభివృద్ధి పథకాలు, ఇందిరా మాతృత్వ సహాయోగ్ యోజన పథకాల లబ్ధిని పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు చేరేలా పారదర్శకంగా పనిచేయాలన్నారు.

ఉద్యమ ఫలితమే యాదాద్రి జిల్లా ప్రకటన

యాదగిరిగుట్ట రూరల్, జులై 1: తెలంగాణలో ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పేర యాదాద్రి జిల్లాగా ప్రకటించటం హర్షణీయమని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహ్మలు అన్నారు. శుక్రవారం యాదాద్రి జిల్లాగా ప్రకటించిన నేపథ్యంలో స్థానిక సింహద్వారం వద్ద అఖిల పక్షం ఆధ్వర్యంలో 10 వేల పోస్టుకార్డులతో ఒకొక్క పోస్టుకార్డుపైన 10 మంది చొప్పున లక్ష మందితో సంతకాల సేకరణను ప్రారంభించారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

నల్లగొండ రూరల్, జూలై 1: నల్లగొండ పట్టణ శివారులోని హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఆర్టీసి బస్సు బైక్‌ను ఢీ కొట్టడంతో దానిపై ప్రయాణిస్తున్న ఒకరు దుర్మరణం చెందారు. ఎస్‌ఐ డానియల్ కుమార్ తెలిపిన వివరాల మేరకు బైక్‌పై వెలుతున్న అప్పాజిపేట వాసి కాసర్ల లింగస్వామి(38), తవిటి కృష్ణయ్యలు బైక్‌పై వస్తుండగా ఆర్టీసీ బస్సు వారిని ఢీ కొట్టడంతో లింగస్వామి అక్కడికక్కడే చనిపోయాడు. గాయపడిన కృష్ణయ్యను చికిత్స నిమిత్తం నల్లగొండ ఆసుపత్రికి తరలించారు.

నలుగురు డిఎస్పీల బదిలీ

నల్లగొండ, జూలై 1: జిల్లాలో మిర్యాలగూడ, సూర్యాపేట, సిసిఎస్ నల్లగొండ, స్పెషల్ బ్రాంచ్ నల్లగొండ డిఎస్పీలను బదిలీ చేస్తు డిజిపి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మిర్యాలగూడ డిఎస్పీ జి.సందీప్‌ను బదిలీ చేస్తు హైద్రాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్థానంలో మిర్యాలగూడ డిఎస్పీగా ఇంటలిజెన్స్ డిఎస్పీ ఎస్.రాంగోపాల్‌రావును నియమించారు. సూర్యాపేట డిఎస్పీ అబ్ధుల్ రశీద్‌ను బదిలీ చేస్తు హైద్రాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. ఆయన స్థానంలో నల్లగొండ సిసిఎస్ డిఎస్పీ వి.సునీతాచంద్రమోహన్‌ను సూర్యాపేట డిఎస్పీగా బదిలీ చేశారు.

అన్నింటా ఉల్లంఘనే

విజయవాడ, జూలై 1: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రోజు రోజుకూ తలెత్తుతున్న విభేదాలను పరిష్కరించడంలో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోపోవడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. వీటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కూడా ఖండించారు. చైనా పర్యటన ముగించుకుని శుక్రవారం విజయవాడ వచ్చిన చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. విభజన చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, కృష్ణా జలాల పంపిణీ, హైకోర్టు విభజన, ఢిల్లీలో ఆంధ్రాభవన్ వివాదం వంటి అంశాలపై తెలంగాణ ప్రభుత్వ ధోరణిని ఎండగట్టారు.

త్వరలో బాబు రష్యా పర్యటన

విజయవాడ, జూలై 1: రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎపిని భ్రష్టు పట్టించిందని అన్నారు. ఎపి పెట్టుబడిదారులంటే అవినీతిపరులన్న ముద్ర వేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మన పారిశ్రామికవేత్తలపై ఉన్న మచ్చను తొలగించి, వారిని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నానని చంద్రబాబు చెప్పారు. పెట్టుబడులే లక్ష్యంగా జరిగిన తమ చైనా పర్యటన విజయవంతమైందని అన్నారు.

కేంద్రం ఇచ్చేది ఇక 1500 కోట్లే!

విజయవాడ, జూలై 1: రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం సాయం చేస్తుందని కొండంత ఆశలు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిరాశే మిగిలింది. రాజధాని నిర్మాణానికి కేంద్రం అందించే సాయం పెద్దగా లేదని తేలిపోయింది. అమరావతికోసం కేంద్రం కేవలం 2500 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తానందని శుక్రవారం విలేఖరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే ఇచ్చిన 1000 కోట్లు కూడా అందులో భాగమేనని ఆయన అన్నారు. ఈ మేరకు కేంద్రం నుంచి వచ్చేది మరో 1500 కోట్ల రూపాయలు మాత్రమేనని ఆయన కుండబద్దలు కొట్టారు.

Pages