S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11 నుండి రెండవ విడత హరితహారానికి శ్రీకారం

ఆదిలాబాద్, జూలై 1: వచ్చే నెల 11 నుండి రెండవ విడత హరితహారానికి శ్రీకారం చుట్టడం జరుగుతుందని, ఇందుకు అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు గావించాలని జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపిడీవోలు, డ్వామా, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో హరితహారం, ఓడిఎఫ్, అమ్మనాన్నకు చదువు, ఇంకుడు గుంతలు మొదలగు అంశాలపై మండలాలవారీగా కలెక్టర్ సమీక్షించారు. హరితహారం పథకం విజయవంతం చేసేందుకు గ్రామ స్థాయిలో హరితరక్షణ కమిటీలతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, మొక్కలు నాటుటకు గుంతలుతీసి సిద్దంగా ఉంచుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

‘పచ్చ’దనమే లక్ష్యం..!

కరీంనగర్, జూలై 1: ‘పచ్చ’దనమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం రెండో విడత కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఈ నెల 8నుంచి రెండో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి, రెండువారాల పాటు నిర్వహించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించడంతో జిల్లా అధికార యంత్రాంగం హరితహారంపై అంతా సిద్ధం చేసుకుంటోంది. జిల్లాలో ఈ యేడాది సుమారు 4కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో పాటు ప్రభుత్వ శాఖలకు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే హరితహారంపై పలుమార్లు మంత్రులు, కలెక్టర్ నీతూప్రసాద్ ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా, అవగాహన సదస్సులు కూడా నిర్వహించారు.

రాజన్న ఆలయంలో భద్రత కట్టుదిట్టం

వేములవాడ, జూన్ 1: హైదరాబాద్ ఐటి కారిడార్, షాపింగ్ మాల్స్, ప్రార్థన మందిరాలకు సమీపంలో బాంబులతో విధ్వంసం సృష్టించేందుకు ఐసిస్ సానుభూతి పరులు కుట్రపన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో రాష్ట్రంలో హై అలర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోనే అతిపెద్ద దేవాలయమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. శుక్రవారం స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను క్షుణ్ణంగా పరిశీలించాకే ఆలయంలోనికి అనుమతించారు. మెటల్ డిటెక్టర్ సహాయంతో భక్తులు తమ వెంట తీసుకువచ్చిన బ్యాగులను, ఇతరత్ర వస్తులను పరిశీలించారు. వారి వస్తువులను పరిశీలించారు చేశారు.

మొక్కల సంరక్షణకు గ్రామానికి 10వేలు

మంథని, జూలై 1: ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా మొక్కలు నాటాలని కలెక్టర్ నీతూప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం మంథని పట్టణంలోని కణ్యక పరమేశ్వరి కల్యాణ మండపంలో జరిగిన తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మొక్కల పెంపకం, సంరక్ష కోసం ప్రతీ పంచాయతీకి రూ.10వేలు ఇచ్చే ఆలోచన చేస్తున్నామన్నారు. ప్రతి మండలంలో అధికారులు ప్రజలతో మమేకమై హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. గ్రామంలో డండ్ యాడ్ ఏర్పాటు చేసుకునేలా తగుచర్యలు చేపడతామని చెప్పారు.

విద్యుత్ చార్జీలు తగ్గించే దాకా ఉద్యమిస్తాం

కరీంనగర్ టౌన్, జూలై 1: పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించే దాకా తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్త ఉద్యమాలు కొనసాగిస్తామని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు అన్నారు. ఉచిత విద్యుత్ పేర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలను మోసం చేసి ఇష్టారాజ్యంగా చార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ శుక్రవారం ట్రాన్స్‌కో ఎఈ కార్యాలయాన్ని ఆపార్టీ కార్యకర్తలు ముట్టడించి, ధర్నా చేశారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, సామాన్యుల నడ్డి విరిచేలా విద్యుత్ చార్జీలు పెంచటం అన్యాయమన్నారు.

విద్యుత్ చార్జీల పెంపు అప్రజాస్వామికం

కరీంనగర్ టౌన్, జూలై 1: ఎన్నికలకు ముందు ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీ మరిచి, ముఖ్యమంత్రి కెసిఆర్ ఇష్టారాజ్యంగా విద్యుత్ చార్జీలను పెంచటం అప్రజాస్వామికమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు అక్కనపల్లి కుమార్ విమర్శించారు. పెరిగిన విద్యుత్ ధరలను నిరసిస్తూ శుక్రవారం ఆపార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందంటూ చెప్పుకుంటున్న సిఎం పేద,మద్యతరగతి వర్గాలకు చెందిన ప్రజల నడ్డీ విరచటమే లక్ష్యంగా విద్యుత్ చార్జీలు పెంచాడని దుయ్యబట్టారు.

ఆర్జీ-1లో 91శాతం బొగ్గు ఉత్పత్తి

గోదావరిఖని, జూలై 1: సింగరేణి బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు కార్మికులు, అధికారులు మరింత కృషి చేయాలని ఆర్జీ-1 ఇన్‌చార్జి సిజిఎం సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం గోదావరిఖనిలోని సిజిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన జూన్ మాసపు ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. సమావేశంలో పర్సనల్ మేనేజర్ మంచాల శ్రీనివాస్, డిజి ఎం ప్రసాద్, రాజేశ్వర్ రావు తదితరులున్నారు. ఆర్జీ-1లో 4,97,900 టన్నులకు గాను 4,50,682 టన్నులతో 91శాతం బొగ్గు ఉత్పత్తి చేసినట్లు తెలిపారు.

మంత్రాల నెపంతో వృద్ధుడి హత్య

మేడిపల్లి, జూలై 1: మండలంలోని విలాయతబాద్‌కు చెందిన పూదరి బీమరాజం (52) అనే వృద్ధుడిపై మంత్రాల నెపంతో అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గత నెల 28న కత్తుల దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన బీమరాజం చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మంత్రాల చేస్తున్నాడనే నెపంతో గత నెల 28న బీమరాజంపై అదే గ్రామానికి చెందిన బత్తుల గంగాధర్, బత్తుల రాజు దాడి చేయగా తీవ్రగాయాల పాలయ్యాడు. తీవ్రంగా గాయపడిన బీమరాజంను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు అసుపత్రిలో చికిత్స జరిపించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

వేములవాడ రాజన్నను జిల్లాలోనే ఉంచండి

కరీంనగర్, జూలై 1: నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని సిరిసిల్లలో కలపకుండా కరీంనగర్ జిల్లాలోనే ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని కోరుతూ సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్ శుక్రవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపించారు. దశాబ్దాల చరిత్ర కలిగి శాతవాహనులు ఏలిన జిల్లా ఆధ్యాత్మిక, భక్తిప్రపత్తులతో వాసికెక్కింది.

ఉగ్రవాదులకు అడ్డాగా మారిన హైదరాబాద్

రామడుగు, జూలై 1: దేశంలో ఎక్కడా ఉగ్రవాదులు దాడులు జరిగినా హైదరాబాద్‌కు సంబంధాలు ఉన్నాయని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కట్ట రవీందర్ ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదులకు హైదరాబాద్ అడ్డాగా మారిందని, గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే ఉగ్రవాదులు చెలరేగి పోతున్నారన్నారు. ఉగ్రవాదాన్ని మతం పేరుతో ముడిపెట్టడం అనేక అనర్థాలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. సోషల్ మీడియాపై నిఘా పెంచాలని, సైబర్ నేరాల అదుపునకు సైబర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని అన్నారు.

Pages