S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమరయోధుడు సుభాంశు జిబాన్‌ కన్నుమూత

కోల్‌కతా: జాతిపిత మహాత్మాగాంధీతో స్వాతంత్య్ర పోరాటంలో కలిసి పనిచేసిన సమరయోధుడు సుభాంశు జిబాన్‌ గంగూలీ గురువారం మరణించారు. 99 ఏళ్ల గంగూలీ గుండె పోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కాంగ్రెస్‌లోనే కొనసాగుతా: మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి

హైదరాబాద్: తాను, తన కుటుంబం కాంగ్రెస్‌ కోసం పనిచేస్తున్నామని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని మాజీ స్పీకర్‌ సురేష్‌రెడ్డి స్ఫష్టం చేశారు. పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు.

విదేశీ పర్యటనలతో మోదీ ఏం సాధించారు?

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఇటీవల జరిపిన ఆఫ్ఘనిస్థాన్, ఖతర్, స్విట్జర్లాండ్, అమెరికా, మెక్సికో దేశాల పర్యటనలను కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. మోదీ విదేశీ పర్యటనలవల్ల దేశానికి కలిగిన ప్రయోజనాలు ఏంటో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనీశ్ తివారి అన్నారు.

రెచ్చిపోయిన ఇంగ్లాండ్‌ ఫుట్‌బాల్‌ అభిమానులు

ఫ్రాన్స్ : ఫుట్‌బాల్‌ మ్యాచ్ లో ఇంగ్లాండ్‌ ఓడిపోవడంతో అభిమానులు రెచ్చిపోయారు. రష్యా అభిమానులతో గొడవకు దిగారు. యూరో ఫుట్‌బాల్‌ చాంపియన్ షిప్‌లో భాగంగా ఇంగ్లండ్‌, రష్యాల మధ్య మ్యాచ్ జరిగింది. ఇంగ్లాండ్‌ అభిమానులు ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.

అమెరికాలో భూకంపం

కాలిఫోర్నియా: అంతా నిద్రిస్తున్నవేళ రాత్రి ఒంటిగంటా ఐదు నిమిషాలకు అమెరికాలోని కాలిఫోర్నియా దక్షిణ భాగంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.2గా నమోదైంది. ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లుగా సమాచారం లేదు. 30 సెకండ్ల పాటు భూమి కంపించింది. శాన్ డియాగో, లాస్‌ ఏంజెల్స్ సమీపంలో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి

ఎస్‌బిహెచ్ విలీనాన్ని వ్యతిరేకిస్తాం: సురవరం

హైదరాబాద్: ఎస్‌బిఐలో ఎస్‌బిహెచ్‌ను విలీనం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనను తాము వ్యితిరేకిస్తున్నామని, ఈ విషయమై ఈనెల 28, 29 తేదీల్లో ఎస్‌బిహెచ్ ఉద్యోగులు చేసే ఆందోళనకు తాము మద్దతు ఇస్తున్నామని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి తెలిపారు. ఎస్‌బిహెచ్ విలీనం యోచనను విరమించుకునేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సిఎం కెసిఆర్ వెంటనే ప్రధానికి లేఖ రాయాలన్నారు. ఇదే విషయమై అసెంబ్లీలోనూ తీర్మానం చేయాలన్నారు.

గాజువాక సిఐ, ఎస్‌ఐలపై సస్పెన్షన్ వేటు

విశాఖ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గాజువాక సిఐ అప్పారావు, ఎస్‌ఐ సురేష్‌లను నగర పోలీస్ కమిషనర్ యోగానంద్ సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలోనూ వీరు నిర్లక్ష్యంగా ఉన్నందున కేసుల సంఖ్య పేరుకుపోయిందని కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోకుంటే సిబ్బందిపై చర్యలు తప్పవన్న సంకేతాలను ఆయన ఇచ్చారు.

మరో సింగపూర్‌గా ఎర్రవల్లి: కెసిఆర్

మెదక్: ఎర్రవల్లి గ్రామాన్ని సింగపూర్‌లా తయారుచేస్తానని సిఎం కేసీఆర్ అన్నారు. ఆయన శుక్రవారం ఎర్రవల్లిలో పర్యటించిన సందర్భంగా పలు వరాలు కురిపించారు. ఇక్కడ త్వరలోనే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రారంభిస్తామని, ప్రతి ఇంటికీ 2 పాడిగేదెలు, పది కోళ్లు, ఎల్‌ఇడి బల్బులు ఇస్తామన్నారు. పర్యటన సందర్భంగా 42 మందికి ట్రాక్టర్లను ఆయన పంపిణీ చేశారు.

ఏ బాధ్యత అప్పగించినా ఓకే: రాజ్‌నాథ్

దిల్లీ: యుపి సిఎం అభ్యర్థిత్వం రేసులో తాను ఉన్నానని వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం ఇక్కడ మీడియాతో అన్నారు. వచ్చే ఏడాది జరిగే యుపి అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి సిఎం అభ్యర్థిగా తన పేరు ప్రచారంలో ఉందన్న విషయాన్ని విలేఖరులు ప్రస్తావించగా, పార్టీ అధిష్ఠానం తీసుకునే ఏ నిర్ణయాన్నైనా శిరసావహిస్తానని ఆయన తెలిపారు. ఏ బాధ్యత అప్పగించినా వెనుకంజ వేసేది లేదన్నారు. అలహాబాద్‌లో ఈ నెల 12న జరిగే బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో యుపి సిఎం అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకోవచ్చనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజ్‌నాథ్ స్పందించారు.

ఎర్రవల్లి, నర్సన్నపేటల్లో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్‌

మెదక్: తన దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. అన్ని సౌకర్యాలు ఈ రెండు గ్రామాల్లో కల్పించే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.

Pages