S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారంలేని చదువులు

‘గ్రీన్‌విచ్ రేఖ..అంటే ఏంటి.? ఈ ప్రశ్న ఎప్పుడూ వినలేదు..? గ్రూప్-2 రాష్టస్థ్రాయి పరీక్షలు రాసిన నలుగురు ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులు రైల్లో మాట్లాడుకుంటున్న మాటలివి. సర్వశిక్షా అభియాన్‌లో భాగంగా ప్రాథమిక స్థాయి పాఠశాలలకై ఎంఆర్‌పి పోస్టులకోసం ఎంపికకై కలెక్టర్ల సమక్షంలో జరిగిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల ఇంటర్వ్యూలో- క్రితం రోజు బోధించిన ఆంగ్లభాషలోని బోధనాంశం ఏంటని ప్రశ్నిస్తే, ‘్ఫక్స్ అండ్ గ్రేప్స్’ అని, ‘ది జూ’ అని పాఠ్యాంశాల టైటి ళ్ల పేర్లు చెప్పారు కాని ఏ ఒక్కరూ ఆ పాఠం ద్వారా బోధించాల్సిన భాషాసంబంధమైన అంశాన్ని చెప్పని స్థితి! ఇప్పటికీ ఈపరిస్థితిలో మార్పు రాలేదు.

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162

ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా గంధం శ్రీనివాస్

ఆసిఫాబాద్ రూరల్, జూన్ 10: ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పట్టణానికి చెందిన గంధం శ్రీనివాస్‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ శాఖ జీవో ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. గందం శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమ కాలంలో రాజకీయ జెఎసి చైర్మన్‌గా అన్ని పార్టీల నాయకుల అభిప్రాయాలతో, వారి సహకారంతో ఉద్యమాన్ని నడిపించారు. రాష్ట్ర జెఎసి ఇచ్చిన పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలను ఆయన విజయంతం చేశారు. 2012 సంవత్సరంలో జెఎసికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఆసిఫాబాద్ పంచాయతీ ఎన్నికల్లో స్థానిక నాయకులతో కలసి సర్పంచ్ ఎన్నికల్లో కోవ లక్ష్మిని గెలిపించారు.

‘బిటి’కి ప్రత్యామ్నాయం?

స్వదేశీయ పరిజ్ఞానంతో బిటి పత్తి విత్తనాలను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం పరిశోధన ప్రక్రియను వేగవంతం చేస్తోందట. మహికో మొన్‌సాంటో బయోటెక్ ఇండియా లిమిటెడ్-ఎమ్‌ఎమ్‌బి- వంటి బహుళ జాతీయ వాణిజ్య సంస్థల గుత్త్ధాపత్యం నుండి బిటి పరిజ్ఞానాన్ని విముక్తం చేయడానికి ఈ పరిశోధనలు ఉపయోగపడనున్నట్టు ప్రచారం అవుతోంది. బిటి పరిజ్ఞానంతో విత్తనాలను ఉత్పత్తి చేయడం ద్వారా భయంకరమైన ధరలకు మొన్‌సాంటో సంస్థవారు మన రైతులకు ఈ విత్తనాలను అమ్మారు. దశాబ్దిన్నరకు పైగా భారీగా దోచుకున్నారు. ప్రభుత్వాల జోక్యం వల్ల న్యాయస్థానాల ప్రమేయం వల్ల బిటి పత్తి విత్తనాల ధరలు బాగా తగ్గినట్టు ప్రచారమైంది.

మహిళల చైతన్యంతోనే అభివృద్ది సాధ్యం

ఉట్నూరు, జూన్ 10: గిరిజన గ్రామాల్లో మహిళలను చైతన్యవంతులను చేయూటలో గ్రామైఖ్య సంఘాల పాత్ర చాలా కీలకమని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్ అన్నారు. శుక్రవారం స్థానిక పిఎమ్మార్సీ భవనంలో డిఆర్‌డిఏ ప్రాజెక్టు అధికారి ఆరుణకుమారితో కలిసి జిల్లా మహిళా సమైఖ్యసంఘాల సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో రైతులను చైతన్యపర్చి ప్రైవేట్ ధళారులు, వడ్డీ వ్యాపారస్తుల వద్దకు వెళ్లకుండా బ్యాంకుల వద్దనే రుణాలు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.

అనుమానాస్పదంగా వార్డు సభ్యుడు మృతి

జన్నారం, జూన్ 10: మండల కేంద్రంలోని పొన్కల్ పంచాయతీకి చెందిన రెండవ వార్డు సభ్యుడు రంగు రమేష్ (40) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ మేరకు ఎస్సై లింగమూర్తి కథనం మేరకు మృతుడు రమేష్ గురువారం ఓ ప్రజాప్రతినిధి ఇచ్చిన విందుకు హాజరై రాత్రి ఇంటికి వచ్చి పడుకున్నాడని, మద్యంమత్తులో మంచంపై నుండి కిందపడడంతో భార్య శుభమణి లక్సెటిపేట ఆసుపత్రికి తరలించిందని,చికిత్స పొందుతూ మృతి చెందాడని అన్నారు. కాగా మృతుడి సోదరుడు రంగు నర్సయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

భైంసా డివిజన్‌లో ఊపందుకున్న ఖరీఫ్ పనులు

భైంసా రూరల్, జూన్ 10: సబ్ డివిజన్ పరిధిలోని భైంసా, కుభీర్, కుంటాల,లోకేశ్వరం, తానూర్, తదితర మండలాల్లో గత నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో రైతన్నలు ఖరీఫ్ పనులను వేగవంతం చేశారు. తొలకరి నుండే రైతులకు ఆశించిన మేర వర్షాలు కురుస్తుండడంతో రైతులు పంట పొలాలకు తరలివెళ్తున్నారు. డివిజన్ పరిధిలో అత్యధికంగా రైతులు పత్తిపంటను సాగుచేస్తుండగా దానికనుగుణంగా వర్షాలు కురుస్తుండడంతో పత్తి విత్తనాలను విత్తడంలో రైతులు తలమునకలయ్యారు. ఎన్నో ఆశలతో ఖరీఫ్ వైపు సాగుతున్న రైతులు ఇప్పటికే పంటలకు సాగయ్యే విత్తనాలను కొనుగోలుచేసుకుని విత్తేందుకు పంటపొలాలకు తరలివెళ్తున్నారు.

ఖానాపూర్ మార్కెట్ చైర్మన్‌గా నల్లా శ్రీనివాస్

ఖానాపూర్, జూన్ 10: టిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు నల్లా శ్రీనివాస్‌ను ప్రభుత్వం ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమించింది. ఈమేరకు శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ కారద్యర్శి నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి. నాలుగైదు రోజుల్లో శ్రీనివాస్ పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు నమ్మిన బంటూ, పార్టీ అధికారంలోకి రాకముందు తెలంగాణ సాధన ఉద్యమంలో కూడా కీలకంగా పనిచేశాడు.

అబద్దాలతో కాలక్షేపం చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్

బెల్లంపల్లి, జూన్ 10: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మేనిఫెస్టోలో ఉన్న హామీలను నెరవేరుస్తామని హామీలు ఇచ్చి అందమైన అబద్దాలతో రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి కెసిఆర్ మోసం చేస్తున్నాడని టిడిపి జిల్లా అధ్యక్షుడు బోడ జనార్దన్ విమర్శించారు. శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని టిఎన్‌టియుసి కార్యాలయంలో జరిగే టిడిపి పట్టణ కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

దళితబస్తీ లబ్దిదారులకు ఉచితంగా విత్తనాలు

ఆదిలాబాద్, జూన్ 10: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబస్తీ పథకం అమలులో జిల్లా అగ్రస్థానంలో ఉందని, భూములు పొందిన మహిళలకు పంటసాగు కోసం వంద శాతం సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేస్తామని కలెక్టర్ ఎం.జగన్మోహన్ అన్నారు. శుక్రవారం దళిత బస్తీ కింద కొనుగోలు చేసిన భూముల అభివృద్ది, పంటసాగు అంశాలపై కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్షించి, పలు మార్గదర్శకాలు జారీ చేశారు. నిరుపేద దళిత కుటుంబాలకు వ్యవసాయ భూములు కొనుగోలు చేసి ఇవ్వడం ద్వారా సామాజికంగా, ఆర్థికంగా వారి ఎదుగుదలకు ప్రభుత్వం చేయూతనిస్తోందని, ఈ పథకాల ద్వారా పంట దిగుబడులు సాధించి రైతులు ముందుకు సాగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

గులాబీ గూటికి మళ్శీ వివేక్, వినోద్

ఆదిలాబాద్, జూన్ 10: కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలుగా గుర్తింపు పొందిన జిల్లాకు చెందిన మాజీ ఎంపి గడ్డం వివేక్, ఆయన సోదరుడు మాజీ మంత్రి జి.వినోద్ టీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దమైంది. మాజీ కేంద్ర మంత్రి దివంగత జి.వెంకటస్వామి తనయులైన వీరిద్దరూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు విదేయులుగా పార్టీలో తమకంటూ ప్రాబల్యాన్ని నిలుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అవిర్భావం అనంతరం, ఆ పార్టీ అధినేత కెసిఆర్ సమక్షంలో కాంగ్రెస్ కండువా మార్చి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోగా ఆ పార్టీలో తమకు సముచిత గుర్తింపు ఇవ్వలేదన్న కారణంతో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

Pages