S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమ - వ్యామోహం

ఇద్దరు ప్రేమికులమధ్య అనుబంధాన్ని ప్రేమ అని పిలుస్తాము. ప్రేమ వివాహంతో ముగుస్తుంది. వ్యామోహం అన్నది కోరిక తీర్చుకొనేవరకే. ఒకవేళ వ్యామోహం ప్రేమగా మారి వివాహం అనే పరిణామం చెందవచ్చు. ప్రేమ విషయంలో పుత్రప్రేమకు ప్రాధాన్యత ఉన్నది. దీనికి ప్రబల తార్కాణం దశరథ మహారాజు. ఇచ్చిన మాటను నిలబెట్టుకొనడం ఎవరికైనా అవసరమే! అది ధర్మం కూడాను. దశరథుని విషయంలో అది పుత్ర ప్రేమకు అవరోధం అయింది. ఈ రెండు పరిస్థితులమధ్య మానసిక సంక్షోభం దశరథుని ఎంతగానో కలచివేసింది. పుత్రుడు కూడా తండ్రికి తగు విధంగా సహకరించినపుడే ఈ సంక్షోభ పరిస్థితినుండి తండ్రి బయటపడగలుగుతాడు. శ్రీరామచంద్రుడు చేసిన పని అదే!

-కాకుటూరి సుబ్రహ్మణ్యం

హరివంశం 156

పురుడు వచ్చీ రాగానే బిడ్డ కేరుమని అనకుండానే ప్రసవం అయిన మరుక్షణంలోనే ఎవడో ఎక్కడనుండి వస్తాడో కాని ఆ శిశువును దొంగిలించుకొనిపోతాడు. ఆ బిడ్డ మాకు దక్కడు. ఇప్పటికిట్లా మూడుసార్లు జరిగింది. దైవం ఇట్లా మమ్ముల్ని మూడుసార్లు వంచించాడు. ఇపుడు నా భార్య మళ్లీ గర్భవతి. ఇదుగో అదిగో అని ప్రసవ సమయం రానే వస్తున్నది. ఈ నాలుగో గర్భమైనా మాకు దక్కుతుందో లేదో?

-అక్కిరాజు రమాపతిరావు

యమహాపురి 65

కాస్త అర్థమయ్యేలా చెప్పండి’’ అన్నాడు యోగి.
ప్రభ కళ్ళు మళ్లీ మరిశాయి. ‘‘ఎక్కడికెడుతున్నావని నేనడిగాను మా అక్కని. ఊరెడుతున్నానంది. ఏ ఊరన్నాను. చెప్పనంది. ఎప్పుడొస్తావన్నాను. చెప్పనంది. ఎవరైనా నీకోసమొస్తే ఏం చెప్పాలన్నాను. తోచింది చెప్పమంది. మొబైల్ కూడా ఇక్కడే వదిలింది. ‘అదేమంటే ననె్నవరూ డిస్టర్బ్ చెయ్యకుండా’ అంది. మీరే చెప్పండి. అక్క నాకైమైనా చెప్పినట్లా, చెప్పనట్లా?’’ అందామె.
యోగి నవ్వి, ‘‘మీరు టూ ఇంటెలిజెంటనుకున్నాను. కానీ నేననుకున్నంత కాదు. ఆమె ప్రయాణం వెనుక ఇంత రహస్యముంటే- మీ తెలివంతా ఉపయోగించి తెలుసుకోలేకపోయారా?’’ అన్నాడు.

వసుంధర

నేర్చుకుందాం

చ. వనజ భవప్రభావుఁ డగువాని వసిష్ఠు నపత్యశోక మ
న్వననిధిలోన ముంచిన యవారి తసత్త్వుడు నిన్నుఁ దొట్టి రుూ
యనిమిషులెల్లవానికి భయంపడుచుండుదు రట్టి యుఘ్రకో
పసుకడ కిప్పుడేఁగు మని పాడియె యిప్పని నన్ను ఁబంపఁగన్

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

అమెరికా మహిళ ఆవేదన తెలుసు..

ఆకాశ హర్మ్యాలతో సగటు మనిషి కలల సౌధంగా నిలిచే అమెరికాలో ఇన్నాళ్లకు ఓ మహిళ చరిత్ర సృష్టించగలిగింది. స్వేచ్ఛ, సమానత్వం గురించి చెబితే మనకు కనిపించేది విదేశీ మహిళలే. వారెంతో సాధికారిత, సమానత్వం తో జీవిస్తున్నారని భ్రమపడుతుంటాం.‘ మేడిపండు చూడ మేలిమై యుండు.. పొట్ట విప్పి చూడు పురుగులుండు’ అని వేమన చెప్పినట్లు రెండు వందల సంవత్సరాలు దాటిన అమెరికా స్వాతంత్య్ర దేశ చరిత్రలో ఓ మహిళ అదీ తొలి అధ్యక్ష మహిళా అభ్యర్థిగా బరిలో నిలవటంపై హర్షాతిరేకాలు వెల్లువెత్తటం ఆనందించదగ్గ విషయమే అయినప్పటికీ..వాస్తవానికి అక్కడి మహిళా వివక్షతకు అద్దం పడుతుందనేది కఠోర సత్యం అని చెప్పక తప్పదు.

- లత

పసందైన పనస

పనస తొనలు సువాసనగానే కాకుండా ఎంతో రుచిగా ఉంటాయి. తొనలు బంగారపు రంగులో ఉంటాయి. అవి ఆరోగ్యకరమే కాక, అనారోగ్య నివారణకు ఔషధంలా ఉపయోగిస్తాయి. పనసకాయ పొట్టులోనూ, పనసపండు తొనలలోనూ పోషక పదార్థాలు లభిస్తాయి. పనసతొనలలో కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, ఫైబర్, స్వల్పంగా ఫాట్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాపర్, మాంగనీస్, ఫాస్పరస్, సెలీనియం, జింక్, విటమిన్ ఎ, సి, ఇ, కె, ధయామిన్, పిరిడాక్సిన్, రిబోఫ్లోవిన్, ఫోలిక్‌యాసిడ్, పెక్టిన్ లాంటివీ వుంటాయి. పనసపొట్టును ఆహర పదార్థంగా వండుతారు. ప్రత్యేక శుభ సందర్భాల్లో, విందులకు పనసపొట్టు కూరకు ప్రాధాన్యతనిస్తారు.

- కె.నిర్మల

మనోధైర్యాన్నిచ్చే మానసిక పూజ

స్ర్తిలలో భక్త్భివం వలన మానసికంగా వారికి మనోధైర్యం లభిస్తుంది. ఉదయానే్న గృహిణి లేచి స్నానం చేసి పూజ గదిలో కాసేపు ధ్యానం చేసి తమ దైనందిన కార్యక్రమాలలోనికి అడుగుపెడితే.. ఎంతో బాగుంటుంది.

- ప్రపుల్లచంద్ర

దిజడ్జిమెంట్ (కథ)

ఆ వీధి వీధంతా ఎంతో కోలాహలంగా, చాలా సందడిగా వుంది. పండగో, ప్రళయమో తెలియని పరిస్థితి. జనమంతా బయటకు వచ్చి ప్రేక్షకుల్లా చూస్తున్నారు. అతి త్వరలో విడుదలయ్యే స్పీడున్నోడో, దమ్మున్నుడో తరహా సినిమా ప్రమోషన్‌కై కుర్ర హీరో హీరోయిన్లు రోడ్లనుండి వీధుల్లోకి కూడా వచ్చేస్తున్నారా! వారిని చూడ్డానికి పిల్లా పాపలతో సహా ఇంటిల్లిపాది ఎదురుచూస్తున్నారా! అన్నట్లుగా ఉందా దృశ్యం. కానీ గుమిగూడిన వారి చూపులను జాగ్రత్తగా గమనిస్తే అది సినిమా చోద్యం కాదు, జీవిత యథార్థ వ్యథార్థ దృశ్యమని తెలుస్తుంది.

-ఎస్.జి.జిజ్ఞాస

అరెస్టు చేసినవారిలో అమాయకులు లేరు..

విజయవాడ: తుని విధ్వంసకాండకు సంబంధించి సిఐడి పోలీసులు అరెస్టు చేసిన వారిలో అమాయకులు ఎవరూ లేరని మంత్రి నారాయణ అన్నారు. రౌడీషీటర్లు, వైకాపాకు చెందిన వారు విధ్వంసంలో పాల్గొన్నందున వారినే అరెస్టు చేశారన్నారు. రౌడీషీటర్లు, నేరస్థులను విడిచి పెట్టాలని ముద్రగడ కోరడం తగదన్నారు. విధ్వంసానికి పాల్పడినవారందరిపైనా కేసులు తప్పవన్నారు. శాంతిభద్రతలు దిగజారితే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ రారని అన్నారు.

ఎసిబికి చిక్కిన సోషల్ వెల్ఫేర్ ఎఇ

వరంగల్: ఇక్కడి కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఓ కాంట్రాక్టర్ నుంచి 5 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా సాంఘిక సంక్షేమశాఖ ఎఇ అజీజ్‌ను ఎసిబి అధికారులు పట్టుకున్నారు. నిర్మాణం పనులకు సంబంధించి బిల్లులు పాస్ చేయించేందుకు అజీజ్ లంచం అడగుతూ వేధించడంతో ఆ కాంట్రాక్టర్ ఎసిబిని ఆశ్రయించాడు.

Pages