S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొక్కలు నాటిన బాలకృష్ణ అభిమానులు

విజయవాడ: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా తెదేపా కార్యకర్తలు మొక్కలు నాటారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్‌, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

స్థానికతకు ఆమోదంపై ఉద్యోగుల హర్షం

హైదరాబాద్‌: స్థానికతకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపటం సంతోషకరమని ఏపీ గెజిటెడ్‌ అధికారుల ఐకాస అధ్యక్షుడు కృష్ణయ్య అన్నారు. స్థానికతపై వారం రోజుల్లో గెజిట్‌ ప్రకటన రావటం అభినందనీయమన్నారు.

పిడుగురాళ్లలో భూ ప్రకంపనలు

గుంటూరు: పిడుగురాళ్లలో శుక్రవారం కొద్ది సెకన్లపాటు భూమి కంపించింది. జనం భయాందోళనలకు లోనై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

రెచ్చగొడుతున్నందునే ‘సాక్షి’ ప్రసారాల నిలిపివేత

విశాఖ: ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నందునే ఎపిలో సాక్షి టీవీ చానల్ ప్రసారాలను నిలిపివేయాల్సి వచ్చిందని మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఆ చానల్‌లో తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నారని ఆరోపించారు. ఉనికి కోసమే దీక్షలు చేస్తూ ముద్రగడ పద్మనాభం కాపు కులస్థులను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. కాపుల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వానికి సహకరించడానికి బదులు శాంతిభద్రతలకు ముప్పు తెచ్చేలా వ్యవహరించడం సరికాదన్నారు.

అమిత్ షాకు ఘన స్వాగతం

హైదరాబాద్: బిజెపి అధ్యక్షుడు అమిత్ షాకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం మధ్యాహ్నం ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి ఆయన నల్గొండ జిల్లా సూర్యాపేటకు బయల్దేరారు. అక్కడ జరిగే వికాస్ పర్వ్ సభలో అమిత్ షా పాల్గొంటారు.

నాల్గో తరగతి ఉద్యోగుల ఆందోళన

హైదరాబాద్: ఎపి సచివాలయంలో నాల్గో తరగతి ఉద్యోగులు ముఖాలకు నలుపు గుడ్డలు కట్టుకుని శుక్రవారం ఆందోళన చేశారు. తమను తెలంగాణ సర్కారుకు కేటాయించాలని, ఈ విషయమై గతంలో సిఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని వీరు కోరుతున్నారు. కొన్నాళ్లు పనిచేశాక తెలంగాణ ప్రభుత్వంలోకి తీసుకుంటామని కెసిఆర్ హామీ ఇచ్చి రెండేళ్లు గడిచాయని అంటున్నారు. ఎపి సచివాలయం ఉద్యోగులంతా అమరావతికి తరలివెళ్తున్నందున తమ పరిస్థితి ఏమిటని వీరు ఆవేదన చెందుతున్నారు.

డానిష్ మహిళ కేసులో అయిదుగురికి యావజ్జీవం

దిల్లీ: డానిష్ దేశానికి చెందిన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో అయిదుగురికి యావజ్జీవ జైలుశిక్ష విధిస్తూ దిల్లీ హైకోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. మరో నిందితుడు కేసు విచారణ సమయంలో మరణించాడు. ఇదే కేసులో ముగ్గురు బాలనేరస్తులపై అభియోగాలను జువైనల్ కోర్టు విచారిస్తోంది. 2014లో దిల్లీలో 52 ఏళ్ల డానిష్ మహిళను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేసినట్లు కేసు దాఖలైంది. ఈ కేసులో అయిదుగురిని దోషులుగా ప్రకటిస్తూ న్యాయస్థానం శిక్షలను ఖరారు చేసింది.

ఆత్మహత్యకు యత్నిస్తే చట్టప్రకారం చర్యలు

కాకినాడ: ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించేవారు ఎంతటివారైనా చట్టప్రకారం కేసులను ఎదుర్కొనక తప్పదని తూ.గో జిల్లా ఎస్పీ రవిప్రకాష్ హెచ్చరించారు. పురుగుమందు సీసా పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించిన కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభంపైనా కేసులు నమోదు చేశామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ముద్రగడ దీక్ష, అరెస్టు నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయన్నారు. 124 మందిని ముందస్తుగా అరెస్టు చేశామని, 60 మందిని గృహనిర్బంధంలో ఉంచామని ఆయన తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు.

తుని విధ్వంసకాండపై సిబిఐ విచారించాలి

హైదరాబాద్: కాపుగర్జన సందర్భంగా తుని వద్ద హింసాత్మక సంఘటనలకు పోలీసులే కారకులని కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. మఫ్టీలో ఉన్న పోలీసులు ప్రయాణీకులందరినీ కిందకు దించాక రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు వ్యాపించాయని అన్నారు. ఈ ఘటనపై సిఐడి పోలీసులకు బదులు సిబిఐ చేత విచారణ జరిపించాలన్నారు.

నేరస్థులను అరెస్ట్ చేస్తే జగన్‌కు ఇబ్బందేమిటి?

నెల్లూరు: తుని విధ్వంసకాండకు సంబంధించి నేరస్థులను పోలీసులు అరెస్టు చేస్తుంటే వైకాపా అధినేత జగన్‌కు అభ్యంతరం ఎందుకని టిడిపి నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. కాపులను రెచ్చగొట్టి అశాంతిని సృష్టించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ముద్రగడను పావుగా వాడుకుంటూ ఎపిలో అరాచకశక్తులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్న జగన్ నిజానికి ఓ పొలిటికల్ క్రిమినల్ అని ఆయన వ్యాఖ్యానించారు.

Pages