S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలయం కూల్చవద్దంటూ ఆత్మహత్యాయత్నం

విజయవాడ: ఇక్కడి కృష్ణానదీ తీరంలో సీతమ్మవారి పాదాల వద్ద శనీశ్వరాలయాన్ని కూల్చివేయరాదని ఓ వ్యక్తి శుక్రవారం ఆత్మహత్యకు యత్నించాడు. పుష్కర ఘాట్ల నిర్మాణాలను మంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్యే బోండా ఉమా, మేయర్ శ్రీధర్ పరిశీలించి శనీశ్వరాలయాన్ని కూల్చివేయాలని నిర్ణయించారు. దీంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించాడు. అయితే, అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు కలుగజేసుకుని ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు.

ఫార్మాసిటీపై తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు

హైదరాబాద్ : రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల సరిహద్దుల్లో 12,500 ఎకరాల్లో ఫార్మాసిటీ ఫార్మాసిటీ ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఫ్లాట్‌ఫాంను ఢీ కొట్టిన గతిమాన్ ఎక్స్‌ప్రెస్‌

ఆగ్రా : ఆగ్రా రైల్వే స్టేషన్లో శుక్రవారం గతిమాన్ ఎక్స్‌ప్రెస్‌ ఫ్లాట్‌ఫాంను ఢీ కొట్టింది. పట్టాలు విరిగిపోవడంతో ఫ్లాట్‌ఫాంను ఢీ కొట్టింది. వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టారు. ప్రయాణీకులకు ఏమీ కాలేదని అధికారులు అన్నారు.

చంద్రబాబు చైనా పర్యటన ఖరారు

విజయవాడ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 26 నుంచి 29 వరకు చైనాలో పర్యటించనున్నారు. పెట్టుబడుల కోసం వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అవనున్నారు. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు.

పుష్కర ఘాట్ల పనులపై మంత్రి దేవినేని ఆరా

విజయవాడ: కృష్ణా పుష్కరాలు సమీపిస్తున్నందున ఘాట్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని మంత్రి దేవినేని ఉమా అధికారులను ఆదేశించారు. ఇక్కడ కృష్ణా నది తీరాన నిర్మిస్తున్న పుష్కరఘాట్ల పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఆయన వెంట ఎమ్మెల్యే బొండా ఉమ, నగర మేయర్ శ్రీ్ధర్, అధికారులు పాల్గొన్నారు.

ఇద్దరు ఎంవిఐలపై సస్పెన్షన్ వేటు

విజయవాడ: నగరంలోని రవాణాశాఖ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లుగా పనిచేస్తున్న మృత్యుంజయరాజు, కృష్ణవేణిలపై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి ఆరోపణలు రావడంతో వీరిపై ఉన్నతాధికారులు ఈ చర్య తీసుకున్నారని సమాచారం.

ముద్రగడపై పోలీసుల దౌర్జన్యం: జగన్

హైదరాబాద్: ఆమరణ దీక్ష చేస్తున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపైన, ఆయన కుటుంబ సభ్యులపైన సిఎం చంద్రబాబు ఒత్తిడితో పోలీసులు దౌర్జన్యం చేశారని వైకాపా అధినేత వైఎస్ జగన్ శుక్రవారం ఇక్కడ మీడియాతో అన్నారు. సిఎం దారుణంగా ప్రవర్తిస్తున్నందున అన్ని వర్గాల వారూ తీవ్రంగా నిరసించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎపిలో సాక్షి టీవీ చానల్ ప్రసారాలను నిలిపివేయడం చంద్రబాబు నియంతృత్వానికి పరాకాష్ట అన్నారు.

కోల్‌కతలో గుంటూరు జిల్లా యువకుడి అనుమానాస్పద మృతి

గుంటూరు: కోల్‌కతలోని ఓ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందేందుకు వెళ్లిన గుంటూరు జిల్లా ఉప్పలపాడుకు చెందిన సామినేని ఫణీంద్ర (22) అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ మేరకు సమాచారం అందడంతో యువకుడి తల్లిదండ్రులు హుటాహుటిన కోల్‌కతకు శుక్రవారం బయలుదేరి వెళ్లారు. తమ కుమారుడిని ఎవరో హత్య చేసి ఉంటారని వారు అనుమానిస్తున్నారు.

బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య

ఢాకా : బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ ఉగ్రవాదులు శుక్రవారం ఓ ఆశ్రమంలో స్వచ్ఛంద సేవకుడిని చంపేశారు. ఇటీవల బంగ్లాదేశ్‌లో హిందువులపైనా, లౌకికవాదులపైనా దారుణాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఠాకూర్ అనుకూల్ చంద్ర సత్సంగ పరమతీర్థ హేమయెత్పుర్ధామ్ ఆశ్రమ్‌లో స్వచ్ఛంద సేవకుడు నిత్యరంజన్ పాండే (60)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని సదర్ సర్కిల్ ఏఎస్పీ సెలిమ్ ఖాన్ చెప్పారు.

అగ్నిప్రమాదంలో రైస్‌మిల్లు దగ్ధం

నెల్లూరు: కోవూరు మండలం కొత్తూరు వద్ద ఓ రైస్‌మిల్లు శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. సుమారు 80 లక్షల రూపాయల మేరకు ఆస్తినష్టం జరిగిందని ప్రాథమిక అంచనా. ధాన్యం, బియ్యం నిల్వలతోపాటు మిల్లులోని యంత్రాలు అగ్నికి ఆహుతయ్యాయి.

Pages