S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైద్యుల రిటైర్మెంట్ వయసు 65

విజయనగరం, జూన్ 5: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులల్లో పనిచేస్తున్న వైద్యుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్ళకు పెంచే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. వైద్య సంఘాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ విషయంలో ముఖ్యమంత్రి తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. విజయనగర పట్టణంలో ప్రభుత్వ ఘోషా ఆసుపత్రిలో పదికోట్ల రూపాయలతో ఆధునీకరించిన భవన సముదాయాన్ని మంత్రి కామినేని ఆదివారం ప్రారంభించారు. 1.06 కోట్ల రూపాయలతో నిర్మించే బాలుర సత్వర చికిత్స కేంద్రం పనులకు శంకుస్థాపన చేశారు.

కేంద్ర సహాయంపై ప్రజల్లో ప్రచారం చేస్తాం

కాకినాడ, జూన్ 5: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకంటే అధికంగా నిధులు మంజూరు చేయడానికి కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేంద్రం అందిస్తున్న సహాయంపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని కేంద్ర కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు, హైవేలు, ఎలక్ట్రానిక్ క్లస్టర్లు, మెగాప్రాజెక్ట్‌లను కేంద్ర ప్రభుత్వం నెలకొల్పనుందన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో రెండు రోజుల పర్యటనలో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి సుదర్శన్ భగత్‌తో కలసి రవిశంకర్‌ప్రసాద్ ఆదివారం విలేఖరులతో మాట్లాడారు.

మిషన్ భగీరథకు నిధుల వేట

హైదరాబాద్, జూన్ 5 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మిషన్ భగీరథ’ పథకానికి నిధుల వేటలో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ ఈ నెల 10 న ఢిల్లీ వెళుతున్నారు. కేంద్ర తాగునీరు, శానిటేషన్ మంత్రిత్వ శాఖ అధికారులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖాధికారులతో ఆయన చర్చలు జరుపుతారు. కేంద్ర తాగునీరు, శానిటేషన్ అదనపు సలహాదారు దినేష్ చౌదరి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌదరీ బీరేందర్ సింగ్, ఈ శాఖ సహాయ మంత్రి రాంకృపాల్ యాదవ్ ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు మిషన్ భగీరథకు సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణ పథకాలు భేష్

హైదరాబాద్, జూన్ 5: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలు చాలా బాగున్నాయని కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు అభినందించారు. తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్‌డమ్ శాఖ ఆధ్వర్యంలో లండన్‌లో కన్నుల పండువగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా వెంకయ్యనాయుడు, స్పీకర్ మధుసూదనాచారి పాల్గొన్నారు. అమరుల బలిదానాలను స్మరించుకుని తెలంగాణను దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలపాలని స్పీకర్ మధుసూధనాచారి అన్నారు.

ఏడు ఒప్పందాలపై సంతకాలు

దోహా, జూన్ 5: భారత్, ఖతార్‌ల మధ్య ఆదివారం ఏడు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. మనీ లాండరింగ్ (హవాలా), ఉగ్రవాద సంస్థలకు నిధులను అదుపు చేయడానికి ఆర్థిక సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి సంబంధించిన ఒప్పందం, అలాగే ఖతార్‌నుంచి వౌలిక సదుపాయాల రంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఉద్దేశించిన ఒప్పందం కూడా వీటిలో ఉన్నాయి. ఖతార్‌లో రెండు రోజుల పర్యటనకోసం శనివారం వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ తనీ మధ్య అధికారిక చర్చలు జరిగిన అనంతరం వారిద్దరి సమక్షంలో ఇరు దేశాల అధికారులు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు.

హవాలా, ఉగ్రవాద నిధులపై ఉక్కుపాదం

దోహా, జూన్ 5: హవాలా లావాదేవీలు, ఉగ్రవాద నిధులను అదుపు చేయడానికి ఇంటెలిజన్స్ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని భారత్, ఖతార్‌లు ఆదివారం అంగీకరించాయి. అంతేకాకుండా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే, దానికి మద్దతు ఇచ్చే శక్తులను ఏకాకులను చేయాల్సిన అవసరం ఉందని ఇరుపక్షాలు పేర్కొంటూ, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే, దాన్ని తమ విధానాకి ఒక పావుగా ఉపయోగించుకునే శక్తులపై తక్షణం చర్యలు తీసుకోవడానికి కూడా అంగీకరించాయి.

అధునాతన కారులో కెటిఆర్ చక్కర్లు

హైదరాబాద్, జూన్ 5: అమెరికాలోని పలు ప్రాంతాల్లో పర్యావరణ హితమైన టెక్నాలజీని వినియోగించడం ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌ని ఆకట్టుకుంది. ఇలాంటి విధానాలను తెలంగాణలో అమలు చేసే విషయమై ఆయన సిలికాన్ వ్యాలీలో పలు సంస్థల ప్రతినిధులతో చర్చించారు. ఈ పర్యటన కోసం కెటిఆర్ ఉపయోగించిన కారు అందరి దృష్టినీ ఆకర్షించింది.

నగదు బదిలీ పథకానికి రంగం సిద్ధం

హైదరాబాద్, జూన్ 5: రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు నేరుగా లబ్ధిదారులకు అందే విధంగా చూసేందుకు, దళారుల పాత్రను తొలగించేందుకు నగదు బదిలీ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం త్వరలో శ్రీకారం చుట్టనుంది. దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం త్వరలో ఖరారు చేస్తుంది. నగదు బదిలీ పథకం మంచిదని 2009 ఎన్నికల్లోనే ప్రస్తావించిన చంద్రబాబు ప్రస్తుతం ఆ పథకాన్ని రాష్ట్ర స్ధాయిలో రెండు పథకాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. తొలి దశలో సామాజిక భద్రత పింఛను పథకానికి, జాతీయ ఉపాధి హామీ పథకం లబ్ధిదారులకు నగదు బదిలీ పథకానికి పరిమితం చేస్తారు.

బాబు, కెసిఆర్... ఇద్దరూ అవినీతిపరులే!

తిరుపతి, జూన్ 5: ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు, తెలంగాణ సిఎం కెసిఆర్‌ల మధ్య విభేదాలు కొనసాగలన్నదే ప్రధాని మోదీ ఆలోచన అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. తిరుపతిలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ రాష్ట్రాల అభివృద్ధి కోసం ఇటు చంద్రబాబు కాని అటు కెసిఆర్ కాని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదన్నారు. కెసిఆర్ ఢిల్లీకి వెళ్లేముందు ప్రత్యేక ప్యాకేజీలు తీసుకువస్తానని, బంగారు తెలంగాణను తీసుకువస్తానని ప్రధాని మోదీ వద్దకు వెళతారన్నారు.

‘స్థానికతే’ కీలకం!

విజయవాడ, జూన్ 5: హైదరాబా ద్ నుంచి తరలివచ్చే సెక్రటేరియట్ ఉద్యోగులనూ, హెచ్‌ఓడిలనూ కలవరపెడుతున్న అంశం ‘స్థానికత’. రాష్ట్ర విభజన తరువాత విద్యార్థుల స్థానికతను జోన్‌ల వారీగా విభజించారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఉద్యోగులు విజయవాడ రానున్నారు. వారి పిల్లలను విజయవాడలోని స్కూళ్లలో చేర్చనున్నారు. విజయవాడ జోన్-2 పరిధిలోకి వస్తుంది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు జోన్-2 పరిధిలో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చే ఉద్యోగులు మూడు సంవత్సరాలపాటు విజయవాడలోనే ఉండాలని ప్రభుత్వం విడుదల చేసిన సర్క్యులర్‌లో నిబంధన విధించారని హెచ్‌ఓడి ఉద్యోగ సంఘ నాయకుడు సత్యనారాయణ ‘ఆంధ్రభూమి’కి తెలిపారు.

Pages