S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

హైదరాబాద్: భార్య పుట్టింటికి వెళ్లిపోయినందుకు తీవ్ర మనస్తాపం చెంది భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన శంషాబాద్ మండలం ముచ్చింతలో సోమవారం ఉదయం వెలుగు చూసింది. మనోహర్ గౌడ్ అనే యువకుడు ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భార్య పుట్టింటికి వెళ్లడం వల్లే ఇతను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

పాలమూరు నిర్వాసితులకు రేవంత్ బాసట

మహబూబ్‌నగర్: పాలమూరు-రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోయే రైతులకు అండగా ఉంటానని టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తగినంత నష్టపరిహారం చెల్లించాలని కొల్లాపూర్ తహశీల్దార్ ఆఫీసు వద్ద దీక్షలు చేస్తున్న నిర్వాసిత రైతులను ఆయన సోమవారం ఉదయం కలుసుకుని సంఘీభావం ప్రకటించారు. రైతుల తరఫున తుది వరకూ పోరాడతానని ఆయన ప్రకటించారు.

కొత్త రాష్ట్రంలో సమస్యలు సహజం: బాబు

విజయవాడ: కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో సమస్యలు ఎదురైనంత మాత్రాన నిరుత్సాహపడరాదని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన సోమవారం ఉదయం వెలగపూడిలో పర్యటించి తాత్కాలిక సచివాలయ నిర్మాణం పనులను పరిశీలించారు. అయిదు అంతస్థుల సచివాలయం, ఇతర నిర్మాణాలు, ప్రాథమిక వసతుల కల్పనపై అధికారులతో సమీక్ష జరిపారు. వౌలిక వసతులు కల్పించి వీలైనంత త్వరగా సొంత రాష్ట్రంలో పాలన అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ నెల 27లోగా రాజధానికి తరలివచ్చే ఉద్యోగులు, 27 తర్వాత చేరుకునే ఉద్యోగుల వివరాలను ఆయన ఆరా తీశారు. వెలగపూడిలో పనిచేసే ఉద్యోగులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని ఆయన ప్రకటించారు.

కిడ్నాపైన బాలుడు క్షేమం

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కిడ్నాప్‌కు గురైన అబ్రహాం అనే బాలుడు క్షేమంగానే ఉన్నాడని, ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు మహిళలను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అపార్ట్‌మెంటుపై నుంచి దూకి ఒకరి ఆత్మహత్య

హైదరాబాద్: అపార్ట్‌మెంటుపై నుంచి కిందకు దూకి ఓ నడివయస్కుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పల్ ఆదర్శనగర్‌లో సోమవారం ఉదయం జరిగింది. మృతుడిని చెంగిచర్లకు చెందిన వాసి ప్రభాకరరెడ్డి (45)గా గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆర్టీసీ బస్సులో మహిళ ఆకస్మిక మృతి

విశాఖ: ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణీకురాలు ఆకస్మికంగా మరణించింది. విశాఖ జిల్లా రావికమతం మండలం నీడివాడ వద్ద బస్సులో ప్రయాణిస్తున్న మహిళ మరణించినట్లు సహ ప్రయాణీకులు గుర్తించారు. గుండెపోటు వల్లే ఆమె మరణించినట్లు భావిస్తున్నారు. పోలీసులు మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

పుష్కరాలకు టి.ఆర్టీసీ స్పెషల్ బస్సులు

హైదరాబాద్: ఆగస్టు 12 నుంచి 23వ తేదీ వరకూ జరిగే కృష్ణా పుష్కరాల సందర్భంగా 1,100 ప్రత్యేక బస్సులను నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీని వసూలు చేస్తారు. వెయ్యి ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ బస్సులతో పాటు వంద ఏసీ బస్సులను తెలంగాణలోని ముఖ్య పట్టణాల నుంచి కృష్ణానదీ తీరంలోని పుష్కర ఘాట్లకు నడుపుతారు. విజయవాడ వెళ్లే భక్తులకు కూడా హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయి.

కారు బోల్తా: నలుగురు ఆస్పత్రిపాలు

హైదరబాద్: నగర శివారులోని నార్సింగి వద్ద సోమవారం ఉదయం వేగంగా వస్తున్న కారు బోల్తాపడి నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

కోస్తా జిల్లాలకు వర్షసూచన

విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలంగా కొనసాగుతున్నందున కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఇక్కడి వాతావరణ శాఖ అధికారులు సోమవారం తెలిపారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు, రెండు, మూడు రోజుల్లో అవి కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని వారు తెలిపారు.

Pages