S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు ఢిల్లీకి హరీశ్ బృందం

హైదరాబాద్, జూన్ 5:కృష్ణా బోర్డు వివాదాన్ని తెలంగాణ ప్రభుత్వం సోమవారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి దృష్టికి తీసుకు వెళ్లనుంది. నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కె జోషి, టిఆర్‌ఎస్ పార్లమెంటు సభ్యుల బృందం సోమవారం సాయంత్రం నాలుగున్నరకు ఢిల్లీలో కేంద్ర మంత్రి ఉమాభారతితో సమావేశం అవుతుంది. కృష్ణా బోర్డు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణకు అన్యాయం చేస్తోందని వారు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువస్తారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారమే నీటివాటా పంపిణీ జరుగుతుందని, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రాజెక్టులవారీగా తెలంగాణ వాటా తేల్చాల్సి ఉందని తెలంగాణ వాదిస్తోంది.

తరలింపు ఖర్చు తడిసిమోపెడు!

హైదరాబాద్, జూన్ 5:సచివాలయం తరలింపుపై అడుగులు తడబడుతున్నాయి. తరలింపు అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసారి చాలా పట్టుదలతో ఉన్నట్లు గత రెండురోజుల నుంచి ఆయన చేస్తున్న ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయి. అదే స్థాయిలో ఉద్యోగులు కూడా భీష్మించుకోవడంతో తరలింపు వ్యవహారం ఉత్కంఠగా మారింది. జూన్ 27కల్లా హైదరాబాద్‌లో ఉన్న సచివాలయ ఉద్యోగులంతా ఎట్టి పరిస్థితిలోనూ వెలగపూడికి రావల్సిందేనని ముఖ్యమంత్రి హుకుం జారీ చేసిన వెంటనే, సచివాలయ ఉద్యోగులలో కలకలం మొదలయింది. ఈ విషయంలో ఉద్యోగులంతా జాక్‌గా ఏర్పడి పోరాడాలన్న ప్రయత్నాలు మొదలయ్యాయి.

మళ్లీ జాట్ల ఆందోళన

చండీగఢ్, జూన్ 5: రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ జాట్ సామాజికవర్గ నాయకులు హర్యానాలో మళ్లీ ఉద్యమానికి ఉద్యుక్తులయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణకు భారీ మొత్తంలో రాష్ట్ర పోలీసు బలగాలతోపాటు 5 వేల మందికి పైగా పారామిలటరీ సిబ్బందిని మోహరించినప్పటికీ ఏమాత్రం ఖాతరు చేయని జాట్ నాయకులు రోహ్తక్ జిల్లాలో తమ ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉన్న జస్సియా గ్రామంలో ఆదివారం హవనాన్ని నిర్వహించి తాజాగా ఆందోళన ప్రారంభించారు.

దేశానికే గర్వకారణం

న్యూఢిల్లీ, జూన్ 5: ప్రధాని నరేంద్ర మోదీకి అఫ్గానిస్తాన్ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేయడం భారత్‌కు గర్వకారణమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ప్రధాని మోదీకే కాకుండా యావత్ దేశం గర్వించదగిన విషయమని పేర్కొన్న జైట్లీ భారత్ తరఫున అఫ్గాన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా శనివారం ఆఫ్గానిస్తాన్‌ను సందర్శించిన ప్రధాని మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారమైన అమీర్ అమానుల్లాఖాన్ అవార్డును బహూకరించిన విషయం విదితమే. రూ.1700 కోట్ల వ్యయంతో అఫ్గాన్‌లో భారత్ నిర్మించిన డ్యామ్ ప్రారంభోత్సవానికి హాజరైన ప్రధాని మోదీకి ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని బహూకరించారు.

‘భారత మాతాకు జై’ అనడం జాతికి గర్వకారణం

కాకినాడ, జూన్ 5: భారత మాతాకు జై నినాదం భారత జాతికి గర్వకారణమని, దురదృష్టవశాత్తూ ఈ నినాదాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారని కేంద్ర కమ్యూనికేషన్స్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ మద్దతివ్వడం దారుణమన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని పద్మనాభ ఫంక్షన్ హాలులో ఆదివారం జరిగిన బిజెపి కార్యకర్తల సమావేశంలో రవిశంకర్‌ప్రసాద్ ప్రసంగించారు. ‘్భరత మాతాకీ జై’ అనే నినాదం ఎక్కడ వినిపించినా దేశ ప్రజల నరాల్లో ఉత్తేజం నిండుతుందన్నారు.

అన్ని రంగాల్లోనూ మరింత చేరువ

వాషింగ్టన్, జూన్ 5: భారత ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా జరుపుతున్న పర్యటన ఇరు దేశాల మధ్య భద్రతా దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని, అలాగే గత ఎనిమిది సంవత్సరాల కాలంలో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏమేరకు వృద్ధిచెందింది అనే దానిపైన సరైన అవకాహన కల్పిస్తుందని అమెరికా విదేశాంగ విభాగం పేర్కొంది. ఒబామా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేళ్ల కాలంలో భద్రత, దౌత్య, వ్యూహాత్మక రీతిలో ఇరు దేశాల మధ్య పరస్పర సంబంధాలు అనేక కోణాల్లో బలోపేతం అయ్యాయని అమెరికా విదేశాంగ విభాగం ప్రతినిధి అలిసా ఆరెస్ వెల్లడించారు.

‘యోగా’కు సర్వసన్నద్ధం

న్యూఢిల్లీ, జూన్ 5: మరికొద్ది రోజుల్లో జరుగనున్న రెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు దేశంలోని ప్రముఖ యోగా సంస్థలు తమ వంతు తోడ్పాటును అందజేస్తున్నాయి. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన శిక్షకులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్న విషయం విదితమే. ఈ వేడుకల సందర్భంగా యోగ విద్య పట్ల ప్రజల్లో అవగాహనను పెంపొందించేందుకు విస్తృత శిక్షణా కార్యక్రమాలను, యోగా ప్రదర్శనలను, యోగ విద్యలో నిష్ణాతులైన వారితో చర్చాగోష్ఠులను ఏర్పాటు చేయనున్నారు.

రామాలయంపై స్వామి చెప్పింది నమ్ముతా

న్యూఢిల్లీ, జూన్ 5: వివాదాస్పద బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామిని తన హీరోగా పేర్కొన్న కేంద్ర మంత్రి ఉమాభారతి, అయోధ్యలో రామమందిర నిర్మాణంపై స్వామి చెప్పే మాటలను నమ్ముతున్నట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండే అవకాశం లేదన్న ఆమె అమిత్ షా నేతృత్వంలో బిజెపి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం పనులు ఈ ఏడాది చివరినాటికి ప్రారంభమవుతాయని సుబ్రహ్మణ్యం స్వామి చేసిన వ్యాఖ్యల గురించి అడగ్గా, ‘నేను స్వామిని ఎంతో గౌరవిస్తాను. ఆయన నా హీరో, ఎమర్జెన్సీ విధించినప్పుడు నాకు 15-16 ఏళ్ల వయసు.

అమర వీరుల కుటుంబాలకు చెల్లని నియామక పత్రాలు

హైదరాబాద్, జూన్ 5: అమర వీరుల కుటుంబాలకు చెల్లని నియామక పత్రాలు ఇచ్చారని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే ఎ.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుపై ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ఆదివారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఆదిలాబాద్‌లో 27 మంది అమరవీరుల కుటుంబాలు ఆ నియామక పత్రాలతో అధికారుల వద్దకు వెళితే ఉద్యోగం లేదంటూ బయటకు పంపించారని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులపై లోగడ కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటికీ అనేక మంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆయన పేర్కొన్నారు.

అన్నీ కారు కూతలే!

సంగారెడ్డి, జూన్ 5: ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన అనుమతుల మేరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టిందని, అవగాహన లేని రేవంత్‌రెడ్డి ఓ బచ్చాలా కారు కూతలు కూస్తున్నాడని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఎద్దేవా చేసారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఏర్పాటుచేసిన జైలు మ్యూజియాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జైళ్ల శాఖ డిజి వికె.సింగ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులను రీ డిజైనింగ్ చేసి ప్రభుత్వం నిర్మించడానికి ముందుకు వెళ్తే..

Pages