S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశీయ మార్కెట్లలో క్షీణిస్తున్న ఎఫ్‌పిఐ

న్యూఢిల్లీ, జూన్ 5: విదేశీ మదుపరులు దేశీయ స్టాక్ మార్కెట్ల లోకి గత నెలలో 2,500 కోట్ల రూపా యలకుపైగా పెట్టుబడులను తెచ్చారు. ఈ ఏడాది తొలి రెండు నెలల్లో పెట్టుబడుల ఉపసంహరణల ధ్యాస తోనే నడిచిన విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ).. మలి రెండు నెలల్లో మాత్రం పెట్టుబడుల ప్రవాహా న్ని సృష్టించారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో స్టాక్ మార్కెట్లలోకి 29,559 కోట్ల రూపాయల పెట్టుబడులను ఎఫ్‌పిఐలు పట్టుకొచ్చారు.

ఆన్‌లైన్‌లోనూ ‘రాజన్’ రచ్చ

న్యూఢిల్లీ, జూన్ 5: ఇప్పుడు ఏ పత్రికలో చూసినా, మరే వార్తా చానల్‌లో విన్నా పతాక శీర్షికల్లో కనిపిస్తోంది ఓ అంశం. అది.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్‌గా మరోసారి రఘురామ్ రాజన్ ఉంటారా? లేదా? అన్నదే. అవును మరి.. 1992 నుంచి గమినిస్తే ఆర్‌బిఐ గవర్నర్‌గా పనిచేసిన వారంతా కూడా ఐదేళ్లకుపైగా ఉన్నవారే. దీంతో ఈ సెప్టెంబర్‌తో ముగుస్తున్న రాజన్ మూడేళ్ల పదవీకాలం పొడిగింపు అవుతుందా? కాదా? అన్నది హాట్ టాపిక్‌గా మారింది. అదీగాక ముక్కుసూటి మనస్తత్వం కలిగిన రాజన్‌తో కేంద్రంలోని అధికార బిజెపి సర్కారుకు తలనొప్పులు కూడా ఎక్కువే.

భారత నల్లధనం థాయిలాండ్ జిడిపి కంటే ఎక్కువ!

న్యూఢిల్లీ, జూన్ 5: దేశంలో అక్రమార్కుల అవినీతి సంపదకు హద్దే లేకుండా పోతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు ప్రతిబింబమైన జిడిపిలో దాదాపు 20 శాతానికి సమానంగా భారతీయుల వద్దనున్న నల్లధనం ఉంది మరి. భారత ‘బ్లాక్ ఎకానమీ’ విలువ 30 లక్షల కోట్ల రూపాయల పైమాటే. అంతేకాదు థాయిలాండ్, అర్జెంటీనా వంటి దేశాల మొత్తం జిడిపి కంటే కూడా ఇది ఎక్కువని తాజాగా విడుదలైన ఓ అధ్యయనం తెలిపింది.

పేద బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి

మచిలీపట్నం, జూన్ 5: పేద బ్రాహ్మణుల అభ్యున్నతికి కట్టుబడి పని చేస్తున్నట్లు రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ప్రభుత్వ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. ఆదివారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిధి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ ద్వారా గత ఏడాది 11వేల మంది పేద బ్రాహ్మణులకు రూ.35కోట్ల మేర రుణాలుగా అందించడం జరిగిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంఘానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌లో కార్పొరేషన్‌కు రూ.65కోట్లు కేటాయించారన్నారు. ఈ నిధులను నిజమైన పేద బ్రాహ్మణ లబ్ధిదారులకు రుణాలుగా అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

సిఎం లక్ష్యానికి చేయూతనివ్వండి

మైలవరం, జూన్ 5: రేయనకా, పగలనకా కష్టపడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిపథంలోకి తీసుకెళ్ళేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యానికి అందరూ చేయూత నందించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. నవనిర్మాణ దీక్షలో భాగంగా ఆదివారం ఆయన స్థానిక ఎస్వీఎస్ కల్యాణ మండపంలో రైతులు, నీటి సంఘాల నేతలతో ఆయన సమావేశమై ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దటమే బాబు సంకల్పంగా ఆయన పేర్కొన్నారు.

రాష్ట్భ్రావృద్ధికి ప్రతి ఒక్కరూ శ్రమించాలి

మచిలీపట్నం, జూన్ 5: అశాస్ర్తియంగా జరిగిన రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పూడ్చేందుకు ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా శ్రమించాలని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నవ నిర్మాణ దీక్ష వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన ఆదివారం స్థానిక మెహర్ బాబా ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. నాటి యుపిఎ ప్రభుత్వం ఎటువంటి ముందు చూపు లేకుండా అశాస్ర్తియంగా, అనైతికంగా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందని ఆరోపించారు.

రాష్ట్రాన్ని హరితవనంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం

ఇంద్రకీలాద్రి, జూన్ 5: రాష్ట్రాన్ని హరివనంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం గొల్లపూడి మార్కెట్ యార్డు ఆవరణలో సియం 1000 మంది విద్యార్థుల చేత మొక్కలు నాటించారు. ఈసందర్భంగా సియం బాబు మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజస్థాపన చేయాలని, దీనికి కాలుష్య నియంత్రణ చేయాల్సి ఉంటుందన్నారు. కాలుష్య నియంత్రణకు చెట్లు నాటాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటాలని ఐదుకోట్ల జనాభా ఒక్కొక్కరు పది మొక్కలు నాటితే 50కోట్ల మొక్కలు పెరుగుతాయన్నారు.

కరవు రహితంగా రాష్ట్రం

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 5: కరవు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను చేయాలన్నదే తన లక్ష్యమని నీటికి ఎనలేని ప్రాధాన్యతనిస్తూ సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయటం జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. నవనిర్మాణ దీక్ష వారోత్సవాల్లో భాగంగా ఏ కనె్వన్షన్ సెంటర్‌లో జరిగిన వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సాధించిన ప్రగతి, భవిష్యత్ ప్రణాళికపై ఆయా రంగాలకు చెందిన అధికారులు, రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ నీరు-ప్రగతి మన జీవితాలకు చాలా అవసరమని, నీటి సంరక్షణ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

ఈ-పొస్ ద్వారా ఎరువుల పంపిణీ

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 5: దేశంలోనే మొట్టమొదటిసారిగా జిల్లాలో ఖరీఫ్ సీజన్ నుండి ఎరువులను 110 షాపుల్లో ఈపోస్ విధానం ద్వారా రైతులకు అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులకు సబ్సిడీ ఎరువులను నూతన సాంకేతిక పరిజ్ఞానం ఈపోస్ ద్వారా దేశంలోనే తొలిసారిగా 110 షాపుల్లో అమలుచేసి సరఫరా చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. జూలై చివరి నాటికి 149 రూపాయలకే ఫైబర్ కనెక్టివిటీ అన్ని గ్రామాల్లో కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

రివాల్వర్, 50 బుల్లెట్లు నగదుతో కారుడ్రైవర్ పరార్

విజయవాడ (పాతబస్తీ), జూన్ 5: కడప జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య బంధువు చెన్నంశెట్టి శశికుమార్ కారులోని సూట్‌కేస్‌ని తీసుకుని డ్రైవర్ పరార్ కాగా నగరంలోని సిసిఎస్, కొత్తపేట పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. కడప జిల్లాకు చెందిన చెన్నంశెట్టి శివకుమార్ ఓబులాపురం మైన్స్ కేసులో సాక్షిగా ఉన్నాడు. ఇతనికి ప్రాణహాని ఉందనే భయంతో ముందుజాగ్రత్త చర్యగా రాష్ట్ర ప్రభుత్వం నలుగురు గన్‌మెన్‌లను రక్షణగా కేటాయించింది.

Pages