S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియల్టీ దిశ తిరిగింది!

హైదరాబాద్, జూన్ 5: రియల్ ఏస్టేట్ బూమ్ మళ్లీ పుంజుకుంది. ఔటర్ రింగ్ రోడ్‌కు వెలుపల మరో బాహ్య వలయం, హైదరాబాద్- వరంగల్ ఐటీ కారిడార్, యాదాద్రి డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు, ఆదిభట్లలో ఐటీ విస్తరణ, రావిర్యాల ఫాబ్ సిటీలో హార్డ్‌వేర్ పరిశ్రమలు, నూతన పారిశ్రామిక విధానంతో హైదరాబాద్ చుట్టుపక్కల కొత్తగా వెలుస్తున్న కొత్త పరిశ్రమలు, ముచ్చర్లలో ఫార్మాసిటీ స్థాపనకు భూసేకరణ ప్రక్రియ ప్రారంభం, రాచకొండగుట్టలో ఫిల్మ్ సిటీ ప్రతిపాదన తదితర అంశాలు రియల్టీ మళ్లీ రెక్కలల్లార్చడానికి కారణమని రియల్ ఏస్టేట్ నిపుణులు విశే్లషిస్తున్నారు.

ఈనెలలోనే కల్వకుర్తి

హైదరాబాద్, జూన్ 5: కల్వకుర్తి ప్రాజెక్టును పనులు ఈనెలలోనే పూర్తి చేసి, ప్రాజెక్టు ద్వారా 1.5లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్టు నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు. ఈ ఖరీఫ్ సీజన్‌లోనే మహబూబ్‌నగర్ జిల్లాలో నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని నిర్ణయించారు. కల్వకుర్తి నుంచి 1.5 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు ప్రాజెక్టు నుంచి లక్షా 50వేల ఎకరాలు, భీమా ద్వారా 1.40 లక్షల ఎకరాలు, కోయిల్‌సాగర్ ద్వారా 20 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టుల పనులపై మంత్రి జిల్లా అధికారులతో చర్చించారు.

కోమటిరెడ్డికి షోకాజ్

హైదరాబాద్/ నల్లగొండ, జూన్ 5: అసలే కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ నేతలను, కార్యకర్తలను మరింత కృంగతీస్తోంది. టి.పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కంటే ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మరింత వీక్, వేస్ట్ అని వ్యాఖ్యానించిన కోమటిరెడ్డికి పార్టీ రాష్ట్ర నాయకత్వం షోకాజ్ నోటీసు పంపించింది. అయితే అందుకు కోమటిరెడ్డి తీవ్రంగా ప్రతిస్పందిస్తూ తాను ఆ షోకాజ్‌కు స్పందించాల్సిన అవసరం లేదన్నారు.

లక్ష ఇళ్లకు గ్యాస్ పైప్‌లైన్

హైదరాబాద్, జూన్ 5: రానున్న రెండేళ్ళలో హైదరాబాద్‌లో పైప్ లైన్ ద్వారా లక్ష గృహాలకు వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్టు కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రి ధరేంద్ర ప్రధాన్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ రెండేళ్ళ పాలన సందర్భంగా దేశవ్యాప్తంగా చేపట్టిన ‘వికాస్ పర్వ్’లో భాగంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మంచి నీరు, పారిశుధ్య మంత్రి రాంకృపాల్ యాదవ్ హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ఆదివారం మీడియాతో మాట్లాడుతూ రామగుండం ఫెర్టిలైజర్‌కు త్వరలో ప్రత్యేక గ్యాస్ పైపులైన్ వేస్తామన్నారు.

చెట్టుకొకటి.. పుట్టకొకటి! (తరలింపు తిప్పలు-1)

విజయవాడ, జూన్ 5: హైదరాబాద్ నుంచి సెక్రటేరియట్ ఉద్యోగులు, హెచ్‌ఓడిలను రాజధాని అమరావతికి తరలింపు అంశం రోజురోజుకూ జటిలమవుతోంది. సిబ్బంది తరలింపుపై ఇటీవలి వరకూ నోరు మెదపని ఉద్యోగ సంఘాలు ఇప్పుడు అమరావతి వెళ్లడానికి ససేమిరా అంటున్నాయి. అమరావతి వెళితే తమకు ఎదురయ్యే కష్టాలను ఒక్కొక్కటిగా ఏకరువు పెడుతున్నారు. సెక్రటేరియట్ నిర్మాణం పూర్తి కానందున దశలవారీగా ఉద్యోగులను తరలిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ చెప్పడంతో వారు కాస్తంత శాంతించారు. అయితే హెచ్‌ఓడిలు మాత్రం విధిగా వెళ్లాల్సిందేనని ఆదేశించడంతో సమస్య మరో మలుపు తిరిగింది.

కెవిజి శ్రీనివాస్

మహారాష్టల్రో ఘోర ప్రమాదం

ముంబయి, జూన్ 5: ముంబయి- పుణె ఎక్స్‌ప్రెస్ రహదారిలో ఆదివారం తెల్లవారుజామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో 17మంది మృతిచెందారు. ఆగివున్న రెండుకార్లను వేగంగా వస్తున్న ఒక ప్రైవేటు బస్సు ఢీకొనడంతో మొత్తం మూడు వాహనాలు లోతైన గోతిలో పడ్డాయ. కారు టైరు పేలిపోవడం వల్ల అది ఎక్స్‌ప్రెస్‌వేలో నిలిచివుందని, దానిపక్కనే ఓ ఎంయువి కూడా ఆగివుందని పోలీసులు తెలిపారు. కారులో ఉన్నవారికి సాయపడేందుకు ఎంయువి వాహనంలో వస్తున్న వ్యక్తులు అక్కడ ఆగారని, ఆ రెండు కార్లను వెనుకనుంచి వస్తున్న ఒక టూరిస్టు బస్సు ఢీకొందని, ఫలితంగా ఈ మూడు వాహనాలు 20 అడుగుల లోతైన గోతిలో పడిపోయాయని పోలీసులు తెలిపారు.

చెప్పులతో కాదు.. చీపుళ్లతో కొట్టాలి..!

అనంతపురం, జూన్ 5 : అనంతపురం జిల్లాలో వైకాపా అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర ఐదవ రోజైన ఆదివారం కూడా ఉద్రిక్తతల మధ్య సాగింది. గత నాలుగు రోజుల పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తీవ్రతను మరింత పెంచారు. రెండేళ్లలో పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి, ఎన్నికల హామీలు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసిన చంద్రబాబును చెప్పులతో కొట్టాలని, చెప్పులు చూపించాలంటూ స్వరాన్ని పెంచారు. ఇకపై చెప్పులతో పాటు చీపుర్లు చూపించి వాటితో కొట్టిన తర్వాతైనా ఆ పెద్దమనిషికి బుద్ధొచ్చి ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటారేమో’నని అన్నారు.

రోడ్‌మ్యాప్ రెడీ

హైదరాబాద్, జూన్ 5: హైదరాబాద్‌లోని ఆంధ్ర సచివాలయం నుంచి ఉద్యోగులు, ఉన్నతాధికారుల తరలింపునకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ నెల 8వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్య ప్రకాశ్ టక్కర్ అమరావతికి వెళ్లాల్సిన వివిధ శాఖాధిపతులు, ఉద్యోగులపై రోడ్‌మ్యాప్‌ను ప్రకటించనున్నారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయన్ని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో డెడ్‌లైన్ ముంచుకొస్తుండడంతో ఆదివారం ఉన్నతాధికారులు సమావేశమై కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.

మంచివారి వౌనం మంచిది కాదు!

విజయవాడ, జూన్ 5: చెడ్డవారు నోటికొచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతున్నప్పుడు మంచివారు మాట్లాడకపోవడం విషాదమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆదివారం ప్రజాప్రతినిధులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు ప్రభుత్వం పాజిటివ్‌గా వెళుతుంటే ప్రతిపక్షం ప్రతికూల ఆలోచనలతో వెళుతోందని, అందుకే ప్రజల విశ్వాసానికి దూరమైందన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి పవిత్రమైన కార్యక్రమాన్ని చెడగొట్టటమే ప్రతిపక్షం ఒక పనిగా పెట్టుకుందని విమర్శించారు. ‘రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని చెడగొట్టాలనుకుంది.. విశాఖలో నిర్వహించిన ఫ్లీట్ రివ్యూని పాడుచేయాలని భావించింది. తునిలో విధ్వంసకాండ సృష్టించింది’..

టిడిపికి కేంద్రంలో మరో మంత్రి పదవి?

హైదరాబాద్, జూన్ 5: మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి కేంద్రంలో అదనంగా మరో కేంద్రమంత్రి పదవి ఇచ్చేందుకు భారతీయ జనతా పార్టీ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ విషయం తెలిసిన టిడిపి ఎంపిలు ఇప్పటినుంచే లాబీయింగ్ ప్రారంభించారు. మిత్రపక్షమైన బిజెపికి అడిగిన వెంటనే ఒక రాజ్యసభ సీటు ఇచ్చి, ఆ పార్టీ నాయకత్వాన్ని మెప్పించిన టిడిపి అధినేత, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందుకు తగిన రాజకీయ ప్రయోజనం పొందనున్నారు. రాజకీయాల్లో ఇచ్చి పుచ్చుకునే సంప్రదాయం ఉండాలన్న సూత్రానికి అనుగుణంగా, రాజ్యసభ సీటు ఇచ్చిన టిడిపికి కేంద్రంలో అదనంగా ఒక సహాయమంత్రి పదవి ఇచ్చేందుకు బిజెపి నాయకత్వం అంగీకరించింది.

Pages