S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిజిటల్ సేవల్లో భారత్ దూకుడు

కాకినాడ, జూన్ 4: డిజిటల్ ఇండియాతో భారత్ ప్రపంచంలోనే ఐటి రంగంలో అగ్రగామిగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటి శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ చెప్పారు. ఈ విధానంతో దేశంలో సాంకేతికంగా విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయని, నకిలీ రేషన్‌కార్డులు, ఆధార్ కార్డులను తొలగించామని, వివిధ సంక్షేమ పథకాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అమలుచేస్తున్నట్టు చెప్పారు. కాకినాడ నగరంలో శనివారం జరిగిన సదస్సుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి సుదర్శన్ భగత్‌తో కలసి ఆయన హాజరయ్యారు.

సమస్యలకు భయపడొద్దు

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 4: ఆకలిగా వుంటే ఆలోచనలు చేయడం కష్టతరమవుతుందని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎన్నో ప్రవేశపెడుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సమస్యల ద్వారానే అవకాశాలు పెరుగుతాయని, సమస్యలను చూసి భయపడకూడదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక పద్ధతి లేకుండా రాష్ట్రాన్ని విభజించిందని, రాష్ట్రం మనం కోరుకోకుండా విడిపోయిందన్నారు. నవనిర్మాణ దీక్ష వారోత్సవాల్లో భాగంగా విజయవాడ ఏ కనె్వన్షన్ సెంటర్‌లో రెండేళ్లలో ప్రజలు, యంత్రాంగం సాధించిన విజయాలు, ఐదు గ్రిడ్లపై ఆ శాఖలకు సంబంధించిన అధికారులు, నిపుణులతో జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

హామీలపై నిలదీయడం తప్పా?

అనంతపురం (తలుపుల), జూన్ 4:‘ప్రజలను మోసపుచ్చిన వారిని చెప్పుతో కొట్టాలి అని చెప్పడం రాయలసీమలో సహజమని, ఎవరైనా డబ్బు తీసుకుని మోసం చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో చెప్పుతో కొడతామని అంటారని, ఆచరణ సాధ్యం కాని హామీలతో కొట్లాది మంది రాష్ట్ర ప్రజలను మోసపుచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబును చెప్పుతో కొట్టాలనడం తప్పెలా అవుతుందని’ వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి అన్నారు.

ఐకమత్యం (బాలల కథ)

ఆరేళ్ల రాజు రోజూ ఉదయం 8 గంటలకు టిఫిన్ తిని బడికి వెళతాడు. ఇదే అతని నిత్యకృత్యం. రోజూ టిఫిన్ తినేటప్పుడు వాళ్ల ఇంటి పెరటిలోని మామిడి చెట్టు కింద కొంచెం పెట్టేవాడు. దాన్ని ఆ చెట్టు మీదున్న పక్షులు తింటుంటే ఎంతగానో ఆనందించేవాడు.
ఒకరోజు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదుగాని, రాజు పెట్టిన ఇడ్లీ ముక్కను ఒక కాకి వచ్చి తిని ఎగిరిపోయింది. తరువాత రాజు టిఫిన్ తినేటప్పుడు చెట్టు మీద ఉన్న కాకి అరవటం ప్రారంభించింది. అలవాటుగా రాజు కొంచెం పెట్టేవాడు.

- డా. మైలవరపు లలితకుమారి

తారాపథంలో ఇస్రో రథం

రోదసి...
రహస్యాల పుట్టిల్లు....
అందులో ఏముందో తెలుసుకోవడం..ఓ సాహసం...ఓ శాస్త్రం..
దాని రహస్యాలు ఛేదించాలంటే ప్రయోగాలు చేస్తూనే ఉండాలి. ఫలితాలు రాబడుతూనే ఉండాలి...ఆ పని ఇప్పటికే చాలామంది ప్రారంభించారు... ఎడ్లబళ్లపై ప్రయోగ సామాగ్రి తరలించిన దశ నుంచి అడుగులు వేసిన మనం..ఆంక్షలు, అడ్డంకులు, అంతరాయాలను దాటుకుని రోదసివైపు సగర్వంగా, సాధికారికంగా దూసుకుపోతున్నాం... ‘ఇస్రో’ సారథ్యంలో...

-బి.వి.ప్రసాద్

బహుళ ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని నిరోధించాలి

హైదరాబాద్, జూన్ 4: తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో బహుళ ఫ్లైవోవర్ల నిర్మాణానికి అనుమతులు ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని, ఆమోదాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పర్యావరణవేత్త డాక్టర్ కె పురుషోత్తం రెడ్డి శనివారం పిల్‌ను దాఖలు చేశారు. ఈ ఫ్లైవోవర్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వరాదని ఆయన హైకోర్టును అభ్యర్థించారు.

స్కూల్ ఫీజులకు నియంత్రణ మండలి

హైదరాబాద్, జూన్ 4: తెలంగాణలో స్కూలు ఫీజులపై ఉద్యమం రోజురోజుకూ ఉద్ధృత రూపాన్ని సంతరించుకుంటోంది. ఇప్పటికే పలు రూపాల్లో ఉద్యమం చేపట్టిన తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు, ఉపాధ్యాయ సంఘాలు, ఎన్‌జిఓలు తాజాగా ఒకే గొడుగు కిందకు వచ్చి న్యాయపోరాటానికి ఇంకో పక్క ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. స్కూళ్లవారీ పాలక మండళ్లను వేసి వారినే ఫీజులు నిర్ధారించుకోమని ప్రభుత్వం చెప్పడం సరికాదని, స్కూలు ఫీజులకు సైతం నియంత్రణా మండలి ఉండాలని హెచ్‌ఎస్‌పిఎ , ఎస్‌ఎఫ్‌ఆర్, స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు కోరుతున్నారు.

కొత్తగా 130 రెసిడెన్షియల్ పాఠశాలలు

హైదరాబాద్, జూన్ 4 : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 130 సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు, 30 సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చిందని రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్‌చైర్మన్ ఎస్. నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, 2016-17 విద్యాసంవత్సరం నుండే వీటిని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. పేదల విద్యకోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. దళితులు, గిరిజనులను విద్యారంగంలో మున్ముందుకు తీసుకువెళ్లాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. దళితుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కె.

వ్యవసాయ విస్తరణాధికారుల ఎంపిక పరీక్షకు 6479 మంది హాజరు

హైదరాబాద్, జూన్ 4: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ విస్తరణాధికారుల నియామకానికి పబ్లిక్ సర్వీసు కమిషన్ 4వ తేదీన నిర్వహించిన ఎంపిక పరీక్షకు 6479 మంది హాజరయ్యారు. ఈ పరీక్షకు 7645 మందికి హాల్‌టిక్కెట్లు జారీ చేశామని, 4వ తేదీన ఉదయం పేపర్-1కు 6491 మంది, సాయంత్రం పేపర్-2కు 6479 మంది హాజరయ్యారని కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ చెప్పారు. హెచ్‌ఎండిఎ పరిధిలో వీరికోసం 26 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, నలుగురు జోనల్ అధికారులు ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు నియమించామని పేర్కొన్నారు. పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని చెప్పారు.

మెల్‌బోర్న్‌లో తెలంగాణ ఉత్సవాలు

హైదరాబాద్, జూన్ 4 : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు ఆస్ట్రేలియాలో ఘనంగా జరిగాయి. మెల్‌బోర్న్‌లోని క్యారమ్ డౌన్స్ ప్రాంతంలో శివ విష్ణు ఆలయ ప్రాంగణంలోని సాంస్కృతిక కేంద్రంలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత అమరవీరుల స్థూపానికి కవిత నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బంగారు తెలంగాణ సాధనకోసం అందరం కలిసికట్టుగా పాటుపడదామని పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న తెలంగాణ ముద్దుబిడ్డలు ఒకవైపు ఆస్ట్రేలియా దేశ చట్టాలకు అనుగుణంగా ఉంటూ, తాము జన్మించిన ప్రాంతాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు.

Pages