S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూ.20వేల కోట్లతో నగరం అభివృద్ధి

గచ్చిబౌలి, జూన్ 4: మహానగరాన్ని ఇరవైవేల కోట్ల రూ.లతో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అంచనాలు తయారు చేస్తుందని రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. శేరిలింగంపల్లిలోని ఖాజగూడ మెయిన్‌రోడ్డు నుంచి చిత్రపురి కాలనీవరకు రూ.20 లక్షలతో ఏర్పాటుచేసే సిసి రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. చిత్రపురి కాలనీ మణికొండ గ్రామ పంచాయతీలో వున్నప్పటికీ శేరిలింగంపల్లి నుంచి కాలనీకి వెళ్లాల్సి వుందని రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారని, మంత్రి కెటిఆర్‌కు విన్నవించగా జిహెచ్‌ఎంసి అధికారులతో సంప్రదించి రోడ్డుకి రూ.20 లక్షలు మంజూరు చేసారన్నారు.

ముందుచూపు లేకుంటే మునకే!

హైదరాబాద్, జూన్ 4: మహానగరంలో ఈ సారి సాధారణ వర్షపాతం కన్నా కాస్త ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశముందంటూ కేంద్ర వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలతో వివిధ ప్రభుత్వ శాఖల్లో కదలిక వచ్చింది. నిన్నమొన్నటి వరకు ఎండలు బాగా మండిపోవటం, వాతావరణంలో మార్పుల నేపథ్యంలో క్యుములోనిబంస్ మేఘాల ప్రభావంతో బలమైన ఈదురుగాలులతో పలు సార్లు వర్షం బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే! ఆగకుండా అరగంట సేపు గట్టిగా వర్షం కొడితే అరిటాకులా వణికిపోయే నగరం మున్ముందు కురిసే వర్షాలకు ఎదురీడి నిలవాలంటే వివిధ ప్రభుత్వ శాఖలకు కాస్త ముందు చూపు అవసరమేనన్న వాదనలున్నాయి.

ఎస్‌బిహెచ్ కుంభకోణం దర్యాప్తు ముమ్మరం

హైదరాబాద్, జూన్ 4: ఎస్‌బిహెచ్‌లో ఖాతాల మళ్లింపు కేసు దర్యాప్తు కొనసాగుతోంది. గత డిసెంబర్ నెలలో నాలుగు బ్యాంకుల్లో సుమారు 43.48 కోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. జనవరిలో నలుగురు బ్యాంక్ సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కుంభకోణంలో కీలక సూత్రధారి మణి దామోదరన్ గత ఏప్రిల్‌లో సిబిఐ అరెస్టు చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగురు అరెస్టు కాగా మరికొందరిని అరెస్టు చేసేందుకు సిబిఐ ఆధారాలు సేకరిస్తుంది. సిబిఐచేపట్టిన ఈ బ్యాంకు కుంభకోణం కేసులో పురోగతి సాధించింది. ఫిక్స్డ్ డిపాజిట్లు ఇతర ఖాతాల్లోకి మళ్లించిన నాలుగు కేసుల్లో సిబిఐ దర్యాప్తు జరుపుతోంది.

హరీశ్‌ను కలిసిన కోమటిరెడ్డి..పిసిసి చీఫ్ ఉత్తమ్‌పై నిప్పులు

నల్లగొండ, జూన్ 4: దక్షిణ తెలంగాణలో టిఆర్‌ఎస్ విస్తరణకు సవాల్‌గా మారిందని భావిస్తున్న నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కల్లోలం రేగింది. గులాబీ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ వలలో చిక్కిన జిల్లా కాంగ్రెస్ నేతలు పరస్పరం విమర్శల దాడులకు దిగుతు రోడ్డున పడ్డారు. నేను ముందంటే నేను ముందు కారెక్కుతానంటు పోటీలు పడుతు కాంగ్రెస్ శ్రేణులను గందరగోళంలోకి నెట్టారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక బాధ్యతల్లో ఉన్న జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి, గుత్తాలలో ఎవరైన తమ పార్టీలోకి వస్తే బాగుండనుకున్న టిఆర్‌ఎస్‌కు ఇప్పుడు ఏకంగా వారిలో ఎవరిని చేర్చుకోవాలో ఎవరిని వద్ధనాలో అన్న నిర్ణయాత్మక స్థానంలో సగర్వంగా నిలబడింది.

దొంగతనం నెపంతో బాలలపై దాడి నిందితులపై కేసు

జగిత్యాల టౌన్, జూన్ 4: ఓ పాత ఇనుప సామాను దుకాణంలో రాగి వైర్ దొంగలించారనే ఆరోపణతో ముగ్గురు బాలలను దుకాణం యజమాని స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా చితికబాదాడు. ఈ సంఘటన సంఘటన కరీంనగర్ జిల్లా జగిత్యాల పట్టణంలోని శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కొత్తబస్టాండ్ ప్రాంతంలో గల ఓ పాత ఇనుప సామాను దుకాణంలో విబుది మారెమ్మ అనే మహిళ పనిచేస్తూ జీవనోపాధి సాగిస్తుంది. శనివారం తల్లితో పాటు కుమారులు శేఖర్ (10), గంగారాం (9) వీరితో పాటు వారి మిత్రుడు అరవింద్ ఆ దుకాణానికి వచ్చారు.

లోకం తీరు! (కథానిక)

విజయవాడలో ఓ అడ్రసు కాగితం పట్టుకుని సందుల్లో అపార్ట్‌మెంట్ల పేర్లు చదువుతూ, అలా చూసుకుంటూ తన వేలు విడిచిన మేనమామ ఇంటి కోసం ఎండన పడి తిరుగుతున్నాడు వంశీ.
అమ్మకి దూరపు బంధువైన చలపతిరావుని కలవమని ఆమె ఎన్నాళ్లగానో అతనికి చెబుతోంది. వీలైతే అతన్ని ఒకసారి తీసుకురమ్మని కూడా చెబుతోంది. తీరిక లేక వంశీయే అతన్ని తీసుకురాలేకపోయాడు.

- పుష్ప గుర్రాల

ఆన్‌లైన్ మోసాలకు పాల్పడిన నైజీరియన్ల అరెస్ట్

కరీంనగర్, జూన్ 4: గతకొంతకాలంగా ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్ల ముఠాను కరీంనగర్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నైజీరియన్‌లకు సహకరించిన భారతీయుడుతోసహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నైజీరియన్‌కు చెందిన టెడ్డి మిలాన్, కెల్విన్‌తోపాటు ఉత్తరప్రదేశ్‌లోని బరేలికి చెందిన మహ్మద్ ఆసిమ్‌లను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా శనివారం జిల్లా ఎస్పీ డి.జోయల్ డేవిస్ ముఠాను మీడియా ఎదుట హాజరుపర్చి వివరాలను వెల్లడించారు.

ఎమ్మెల్యే ఎలా ఉంటాడో చూపిస్తా...

భిక్కనూరు, జూన్ 4: ‘ఎమ్మెల్యే అంటే తెలియని వాడివి... ఎందుకు పెట్టుకున్నావో వాడిని ...నా ముందుకు పిలిపించు.. వాడు ఎంతటివాడు... తక్షణమే వాడిని పనిలో నుండి తొలగించు’ అంటూ ప్రభుత్వ విప్, నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తీవ్ర స్థాయిలో టోల్‌ప్లాజా నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టోల్‌ప్లాజా ఇన్‌చార్జి అయిన మురళిని ఏ మురళి నీ టోల్‌ప్లాజ్‌లో లోకల్ సిబ్బంది తప్ప నాన్‌లోకల్ సిబ్బంది పనిచేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, కామారెడ్డి నియోజకవర్గానికి చెందినవారే టోల్‌ప్లాజాలో పనిచేయాలని ఆయన హుకుం జారీ చేశారు.

కర్నూలును ముంచెత్తిన భారీ వర్షాలు

కర్నూలు, జూన్ 4: కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం తెల్లవారుజామున భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలోని 54 మండలాల్లో వర్షం కురవడంతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 3.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో జూన్ నెల సగటు వర్షపాతం 77.20 మిమీ కాగా గత నాలుగు రోజుల్లోనే 47.40 మిమీ వర్షం కురవడం గమనార్హం. వరద నీటితో హంద్రీనది పొంగిపొర్లుతోంది. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆదోని డివిజన్‌లోని పాండవగల్లు వంక, ఉప్పలదొడ్డి వాగు పొంగిపొర్లాయి.

ఏసిబికి చిక్కిన డిసిటివో

కావలి, మే 4: నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని వాణిజ్య పన్నుల కార్యాలయంపై ఏసిబి అధికారులు శనివారం సాయంత్రం దాడి చేయగా ఒక ఆటో మొబైల్ దుకాణం యజమాని నుంచి రూ 80వేలు లంచం తీసుకొంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. స్థానిక రైల్వేరోడ్డు సమీపంలోగల పరితోష ఆటోమొబైల్స్ యజమాని చైతన్య ఫిర్యాదు మేరకు నిఘా వేసి వుంచి ఏసిబి అధికారులు సంబంధిత వ్యక్తి నుంచి నగదు తీసుకొనే సమయంలో వలవేసి పట్టారు. కార్యాలయంలోనే ఒక టేబుల్ డస్క్‌లో రూ 16వేలు, మరో కంప్యూటర్ స్టాండ్ వద్ద రూ 14వేలు 10రూపాయిలు మొత్తంగా 30వేల 10రూపాయిలు లెక్కచూపని నగదు వుండగా దానిని కూడా స్వాధీనం చేసుకొన్నారు.

Pages