S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాక్సింగ్ ఆణిముత్యం అలీ

లాస్ ఏంజిలిస్, జూన్ 4: బాక్సింగ్ రంగంలో అసలుసిసలైన ఆణిముత్యం ప్రపంచ హెవీవెయిట్ మాజీ చాంపియన్ మహమ్మద్ అలీ. అతని మృతితో బాక్సింగ్ మాత్రమే కాదు.. యావత్ క్రీడాలోకం ఒక అసాధారణ ప్రతిభావంతుడిని కోల్పోయింది. సుమారు మూడు దశాబ్దాల క్రితం పార్కిన్సన్స్ వ్యాధి బారిన పడిన అలీ కొంత కాలం నుంచి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. శ్వాసకోశ సంబంధనమైన వ్యాధి కారణంగా ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారగా, అలీ కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఫీనిక్స్ ప్రాంతంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందతూ అలీ 74వ ఏట మృతి చెందాడు.

నిప్పులు చెరిగిన నరైన్

ప్రావిడెన్స్ (గయానా), జూన్ 4: మూడు దేశాల అంతర్జాతీయ వనే్డ సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి డే/నైట్ మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ జట్టు బోణీ చేసింది. 27 పరుగులకే 6 వికెట్లు కూల్చి కెరీర్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసిన వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు. అతనికి తోడు కార్లోస్ బ్రాత్‌వైట్ (2/35), జెరోమ్ టేలర్ (1/36), జాసన్ హోల్డర్ (1/37) తమ వంతు రాణించారు. వీరి జోరును ప్రతిఘటించడంలో ఘోరంగా విఫలమైన దక్షిణాఫ్రికా జట్టులో రిలీ రొసెయు (61) మినహా మిగిలిన బ్యాట్స్‌మన్లు ఎవరూ సరిగా రాణించలేకపోయారు.

ఫ్రెంచ్ ఓపెన్ విజేత ముగురుజా

పారిస్, జూన్ 4: ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో స్పెయిన్ క్రీడాకారిణి గార్బిన్ ముగురుజా విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన ముగురుజా శనివారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్‌లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ (అమెరికా)పై సంచలన విజయం సాధించి కెరీర్‌లో తొలిసారి గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. వెనెజులాలో పుట్టి స్పెయిన్‌లో నివసిస్తున్న ముగురుజా క్లే కోర్టు ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరడం కెరీర్‌లో ఇదే తొలిసారి.

టీమిండియా కోచ్ పదవికి సందీప్ పాటిల్ దరఖాస్తు

ముంబయి, జూన్ 4: టీమిండియా ప్రధాన కోచ్ పదవి కోసం చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ రేసులోకి దిగాడు. కొంత కాలం నుంచి ఖాళీగా ఉన్న ఈ పదవిని భర్తీ చేసేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు దరఖాస్తులను ఆహ్వానించి కొద్ది రోజులు కూడా తిరక్కుండానే ఆయన ఈ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా సందీప్ పాటిల్ శనివారం పిటిఐ వార్తా సంస్థకు తెలియజేశాడు. డాషింగ్ బ్యాట్స్‌మన్‌గా గతంలో భారత జట్టుకు సేవలు అందించిన సందీప్ పాటిల్ కెన్యా జట్టుకు కొంత కాలం పాటు కోచ్‌గా వ్యవహరించిన విషయం విదితమే.

ఆసియా జూనియర్ అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన భారత్

న్యూఢిల్లీ, జూన్ 4: వియత్నాంలోని హోచిమిన్ సిటీలో జరుగుతున్న ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో శనివారం రెండో రోజు భారత్ నాలుగు పసిడి పతకాలతో పాటు మరో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుని సత్తా చాటుకుంది. పురుషుల హ్యామర్ త్రోలో ఆశిష్ అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనతో 69 మీటర్ల దూరం హ్యామర్‌ను విసిరి శనివారం భారత్‌కు తొలి పసిడి పతకాన్ని అందించగా, పరుగుల రాణి పిటి.ఉష శిష్యురాలు జిస్నా మాథ్యూ మహిళల 400 మీటర్ల రేస్‌ను 53.85 సెకన్లలో పూర్తిచేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

ఎన్డీయేది ప్రచార ఆర్భాటమే

లక్నో, జూన్ 4: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు మేలు జరిగింది శూన్యమేనని బిఎస్‌పి అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి విమర్శలు గుప్పించారు. పనిలో పనిగా ఆమె యుపి సిఎం అఖిలేష్ యాదవ్‌ను విడిచిపెట్టలేదు. శనివారం లక్నోలో మాయావతి విలేఖరులతో మాట్లాడుతూ మధురలో జరిగిన మారణకాండపై సిబిఐ లేదా న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అఖిలేష్, అంతగొడవ జరిగిన మధురకు వెళ్లకుండా బుందేల్‌ఖండ్‌లో పర్యటించడమేమిటని, మధురలో జరిగిన మారణకాండ ఆయనకు పట్టినట్లు లేదని విమర్శించారు.

వరుణ శపథం (కథ)

పెళ్లిచూపుల తతంగం ముగిసింది. చూడగానే ఇద్దరికీ ఒకరికొకరు నచ్చారు. తమ పెద్దవాళ్లు ‘ఓకే’ అనుకునే లోపల, వైశాలితో ఏకాంతంగా ఓ పది నిమిషాలు మాట్లాడాలని వరుణ్ అనగానే... ఇద్దర్నీ ఇంటి వెనక పెరట్లోకి పంపారు.
‘వైశాలిగారు! నాకు మీరు బాగా నచ్చారు. పెళ్లికి నాకైతే అభ్యంతరం లేదు. మీరు చెప్పండి... మీకు అంగీకారమేనా?’ వరుణ్ మాటలకు వైశాలి సంతోషంగా తల ఊపి తన సమ్మతాన్ని కూడా తెలియజేసింది.

- ఆచార్య కడారు వీరారెడ్డి

వరుణ శపథం కథ

పెళ్లిచూపుల తతంగం ముగిసింది. చూడగానే ఇద్దరికీ ఒకరికొకరు నచ్చారు. తమ పెద్దవాళ్లు ‘ఓకే’ అనుకునే లోపల, వైశాలితో ఏకాంతంగా ఓ పది నిమిషాలు మాట్లాడాలని వరుణ్ అనగానే... ఇద్దర్నీ ఇంటి వెనక పెరట్లోకి పంపారు.
‘వైశాలిగారు! నాకు మీరు బాగా నచ్చారు. పెళ్లికి నాకైతే అభ్యంతరం లేదు. మీరు చెప్పండి... మీకు అంగీకారమేనా?’ వరుణ్ మాటలకు వైశాలి సంతోషంగా తల ఊపి తన సమ్మతాన్ని కూడా తెలియజేసింది.

- ఆచార్య కడారు వీరారెడ్డి

మోదీకి అఫ్గాన్ అత్యున్నత పురస్కారం

హెరత్, జూన్ 4: అఫ్గానిస్థాన్‌లో ఒక రోజు పర్యటనకోసం శనివారం వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన అమీర్ అమానుల్లా ఖాన్ పురస్కారంతో సత్కరించారు. హెరత్ రాష్ట్రంలోని చిస్తీ-ఎ-షరీఫ్ వద్ద చరిత్రాత్మకమైన అఫ్గాన్-ఇండియా ఫ్రెండ్‌షిప్ డ్యామ్‌ను ప్రారంభించిన అనంతరం అఫ్గాన్ అధ్యక్షుడు అషఫ్ ఘనీ ప్రధాని మోదీని ఈ పురస్కారంతో సత్కరించారు. దాదాపు 25 నిమిషాల ప్రసంగంలో మోదీ సూఫీ సన్యాసి ఖాజా మొయినుద్దీన్ చిస్తీని గుర్తు చేసుకున్నారు. అనంతరం అఫ్గాన్ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

రాజ్యసభలో బలం పుంజుకున్న ఎన్డీయే

న్యూఢిల్లీ, జూన్ 4: రాజ్యసభకు జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో ఎన్‌డిఏ బలం పెద్దగా పెరగకపోయినా మొదటిసారి సభలో యుపిఏ కంటే బిజెపి మిత్రపక్షాల సభ్యుల సంఖ్య అధికం అయింది. రాజ్యసభలో యుపిఏ మిత్ర పక్షాల సంఖ్య 70 ఉంటే ఎన్‌డిఏ మిత్రపక్షాల సభ్యుల సంఖ్య 76కు చేరుకుంటోంది. అయితే రాజ్యసభలో కాంగ్రెస్ 60 మంది సభ్యులతో అతిపెద్ద పార్టీగా ఉంటుంది. రాజ్యసభలో ఎన్‌డిఏ బలం 76కు చేరుకున్నా బిల్లులకు సభ ముద్ర వేయించుకునేందుకు ఇతర భావ సారూప్యత గల పార్టీల మద్దతు తీసుకోకతప్పటం లేదు. బిజెపి ఆసోంలో అధికారంలోకి వచ్చినా ఆ రాష్ట్రంలో రాజ్యసభ సీట్లు 2019లో మాత్రమే ఖాళీ అవుతున్నందున బిజెపికి ఒరిగేది ఏదీలేదు.

Pages